Boinapally Vinod Kumar ( IMAGE credit: swetcha reporter)
Politics

Boinapally Vinod Kumar: గ్రావిటీ ద్వారా నీళ్ల తరలింపు సాధ్యం కాదు.. మాజీ ఎంపీ కీలక వ్యాఖ్యలు

Boinapally Vinod Kumar: తుమ్మిడి హట్టి నుంచి నీళ్ల ఎత్తిపోత జరగాల్సిందేనని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్(Boinapally Vinod Kumar) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్ లో  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వానాకాలం ముగియగానే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ లకు మరమ్మత్తులు చేయిస్తామని మంత్రి ఉత్తమ్ ప్రకటించారన్నారు. మొదట్నుంచి మరమ్మతుల్లో ఆలస్యం ఎంత మాత్రం వద్దని చెబుతూనే ఉన్నామన్నారు.

 Also Read: Bigg Boss 9 Telugu: ఫస్ట్ వీక్ నామినేషన్సే ఇంత వైలెంట్‌గా ఉన్నాయేంట్రా బాబు..?

152 మీటర్ల ఎత్తున గోదావరి జలాల తరలింపు

మేడిగడ్డ బ్యారేజ్ కే మరమ్మతులు అవసరముంటాయి..అన్నారం, సుందిళ్లకు అవసరం ఉండకపోవచ్చు .ఒక వేళ ఉన్నా ఇబ్బందేమీ ఉండదని తెలిపారు. గ్రావిటీ ద్వారా నీళ్ల తరలింపు సాధ్యం కాదన్నారు. తుమ్మిడి హట్టి దగ్గర నుంచి నీళ్లు ఎత్తిపోయాలంటే రెండు చోట్ల లిఫ్ట్ లు అవసరం అన్నారు. 152 మీటర్ల ఎత్తున గోదావరి జలాల తరలింపునకు మహారాష్ట్ర అంగీకరించే ప్రసక్తే లేదని వెల్లడించారు. ఏపీ, మహారాష్ట్ర, ఢిల్లీ లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నా 152 మీటర్ల ఒప్పందాన్ని సాధించలేక పోయారన్నారు. ఇప్పుడు ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎం గా ఉన్నారన్నారు. ముంపు ఎక్కువ ఉంటుందని ఆయన 152 మీటర్లకు అస్సలు ఒప్పుకోవడం లేదన్నారు.

మేడిగడ్డ బ్యారేజీ విలువ 3,500 కోట్లు

ప్రాజెక్టులకు ఏం జరిగినా భాద్యత ఓనర్ దే అని ఎన్.డీ.ఎస్.ఏ చట్టం లోనే ఉందని తెలిపారు. మేడిగడ్డ మూడు పిల్లర్లు మాత్రమే కుంగాయి అన్నారం, సుందిళ్ళకు ఏం కాలేదని ఆ రిపోర్టులోనూ స్పష్టం చేసిందన్నారు. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తీసుకువస్తే మంచిదన్నారు. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తేవాలన్నా లిఫ్ట్ చేయాల్సిందే అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ విలువ 3,500 కోట్లు అని, అందులో మూడు పిల్లర్ల విలువ కేవలం 300 కోట్లుఅని రిపేర్ చేస్తే సరిపోతుందన్నారు. యాసంగి లో మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోయక పోవడం వల్ల రైతులు నష్టపోయారు.. ఆ పరిస్థితి పునరావృతం కానీయొద్దు.. వీలయినంత త్వరగా మేడిగడ్డ కు మరమ్మత్తులు చేసి వినియోగం లోకి తేవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ,కార్పొరేషన్ మాజీ చైర్మన్లు కె .వాసుదేవ రెడ్డి ,సతీష్ రెడ్డి పాల్గొన్నారు.

 Also Read: Bhadra Kaali Trailer: విజయ్ ఆంటొనీ భద్రకాళి ట్రైలర్ ఇదే.. సస్పెన్స్‌తో మరోసారి మన ముందుకు

Just In

01

Ram Charan Next movie: రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా దర్శకుడు ఎవరో తెలిస్తే ఫ్యాన్స్‌కు పండగే..

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?