Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 షో.. సెప్టెంబర్ 7 గ్రాండ్‌గా మొదలైంది. మొత్తం 15 మంది హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో 6 కామనర్స్ ఉంటే, 9 మంది సెలబ్రిటీలకు బిగ్ బాస్ అవకాశం కల్పించారు. ఈ షో మొదలై రెండు రోజులు కూడా కాలేదు.. అస్సలు ఒకరంటే ఒకరికి హౌస్‌లో పడటం లేదు. నార్మల్‌గా అయితే ఇంత హడావుడి ఇప్పటి వరకు షో మొదలైన రెండు వారాల తర్వాత నుంచి ఉంటుంది. కానీ, ఈసారి షో మొదటి రోజు నుంచే ఇంట్లో వాతావరణం వేడెక్కింది. ఒకరిని మించి ఒకరు తమ టాలెంట్ ప్రదర్శిస్తున్నారు. ఇలా చేస్తే.. చాలా తొందరగానే జనాలకు ఈ షో పై ఇంట్రస్ట్ పోయే అవకాశం ఉందనడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రియా ఏడ్వడం ఒక నరకం అనుకుంటే.. ఫ్లోరా, సంజనల మధ్య గొడవలు చూస్తున్న వారిని గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఫస్ట్ వీక్ నామినేషన్స్ (Bigg Boss Telugu 9 First Week Nominations) గురించి చెప్పేదేముంది.
Also Read- Lavanya Tripathi: మెగా ఫ్యాన్సుకు గుడ్ న్యూస్.. వారసుడికి వెల్‌కమ్ చెప్పిన లావణ్య త్రిపాఠి
సుమన్ శెట్టి వర్సెస్ ఫ్లోరా షైనీ
అసలు ఎవరు ఎవరిని, ఎందుకు నామినేట్ చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదు. హౌస్‌లోకి వెళ్లి రెండు, మూడు రోజులకే.. మిగతా వారిని చదివేసినట్లుగా ఒక్కొక్కరు చెబుతున్న కారణాలు ఉన్నాయంటే, ఎంత కృత్రిమంగా ఈ షో నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ షోని చూస్తున్న వారంతా.. ఫస్ట్ వీక్ నామినేషన్స్ ఇంత వైలెంట్‌గా ఉన్నాయేంట్రా బాబు? అని అనుకుంటున్నారంటే, రెండు రోజుల్లోనే ఈ షో ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా మూడో రోజుకు సంబంధించిన ప్రోమో ఒకటి స్టార్ మా విడుదల చేసింది. ఇందులో సుమన్ శెట్టి, ఫ్లోరా షైనీ నెట్‌లో మొకాళ్లపై నడుస్తూ కనిపించారు. అందులో సుమన్ శెట్టి గెలిచి, నామినేట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు. తనపై గెలిచిన సుమన్ శెట్టిని ఫ్లోరా ఆత్మీయంగా పలకరించింది.
Also Read- Bellamkonda Srinivas: సినిమా మొదలైన పది నిమిషాల తర్వాత అలా జరగదు.. ఎందుకంటే?
అప్పుడే షో పై కామెంట్స్
ఆ తర్వాత సుమన్ శెట్టి ఈ ప్రోమోలో చెబుతున్నది వింటే.. హౌస్‌లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో అర్థం చేసుకోవచ్చు. అలాగే కామనర్స్‌కు, సెలబ్రిటీలకు అస్సలు పడటం లేదు. ముఖ్యంగా ఫుడ్ దగ్గర వీరంతా గొడవలు పడుతుండటం మరింత ఇరిటేటింగ్‌గా ఉంది. హౌస్‌లో ప్రేమాయణం నడిపించాలనే విధంగా కూడా, మొదలైన రెండు రోజుల్లోనే బిగ్ బాస్‌కు థాట్ ఎలా వచ్చిందో? అసలు ఈ షోకి ఉన్న గుర్తింపును పోగొట్టడానికే ఇదంతా చేస్తున్నారా? ఎన్టీఆర్ హోస్ట్ చేసిన షో ఎంత బాగుంది? ఇప్పుడెలా తయారైంది? అంటూ రకరకాలుగా జనాలు మాట్లాడుకుంటున్నారు. మరీ దారుణంగా ఫస్ట్ వీక్ నామినేషన్స్ ప్రక్రియ ఉంది. సిల్లీ రీజన్స్‌తో నామినేట్ చేస్తుండటంతో.. ఇది దారుణం అంటూ షో చూసే వారు కామెంట్స్ చేస్తుండటం చూస్తుంటే.. బిగ్ బాస్ గేమ్ మార్చితే తప్ప.. ఈసారి టీఆర్పీలు రావడం కష్టం అంటూ అప్పుడే ఈ షో గురించి టాక్ నడుస్తుంది. చూద్దాం.. ముందు ముందు ఈ షో ఏ విధంగా మారుతుందో..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
