varun-tej(image :x)
ఎంటర్‌టైన్మెంట్

Lavanya Tripathi: మెగా ఫ్యాన్సుకు గుడ్ న్యూస్.. వారసుడికి వెల్‌కమ్ చెప్పిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi: మెగా అభిమానులకు అదిరిపోయే న్యూస్ తెలిపారు వరుణ్ తెజ్. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు తమ మొదటి సంతానంగా మగబిడ్డకు జన్మ ఇచ్చారు. మెగా ఫ్యామిలీలో మూడో తరంలో వచ్చిన ఈ వారసుడు ఫ్యాన్స్‌లో ఆనందాన్ని కలిగించాడు. హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో లావణ్య త్రిపాఠికి సుఖప్రసవం జరిగిందని, తల్లి బిడ్డ ఇద్దరూ ఆరోగ్యవంతులేనని కుటుంబ వర్గాలు నిర్ధారించాయి. ఈ సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో మెగా స్టార్ కలకూడా నెరవేరినట్టు అయింది. ఇప్పటికే తన లెగసీని ముందుకు తీసుకెళ్లాలంటే మగ సంతానం అవసరం అని తెలిపిన చిరంజీవికి వరుణ్ తేజ్ దంపతుల రూపంలో ఒక సంతానం కలిగింది. దీంతో మెగా అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

Read also-YS Jagan: అట్టర్‌ ఫ్లాప్‌ సినిమాకు.. బలవంతపు విజయోత్సవాలా.. సూపర్ సిక్స్‌పై జగన్ సెటైర్లు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ప్రేమ కథ తెలుగు సినిమా పరిశ్రమలో ఒక రొమాంటిక్ టేల్. 2017లో వచ్చిన ‘మిస్టర్’ సినిమా సెట్స్‌లో కలిసిన ఈ ఇద్దరూ, అక్కడే ప్రేమలో పడ్డారు. ‘అంతరీక్షం 9000 కిలోమీటర్లు’ వంటి సినిమాల్లో కలిసి పనిచేసిన తర్వాత, వారు ఏడు సంవత్సరాలు డేటింగ్ చేశారు. 2023 నవంబర్ 1న ఇటలీలోని టస్కనీలో గ్రాండ్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఆ వెడ్డింగ్‌లో మెగా ఫ్యామిలీ సభ్యులైన రామ్ చరణ్, అల్లు అర్జున్, పంజా వైష్ణవ్ తేజ్, సై రాజరాజ్ వంటి సెలెబ్రిటీలు పాల్గొన్నారు. వివాహం తర్వాత ఇద్దరూ కూడా తమ కెరీర్‌ను కొనసాగించారు. కానీ కుటుంబ జీవితానికి ప్రాధాన్యత ఇచ్చారు.

Read also-New Thar Crashes: నిమ్మకాయలు తొక్కించబోయి.. రూ.15 లక్షల కొత్త కారును.. బోల్తా కొట్టించిన యువతి

వరుణ్ తేజ్ ఇటీవల ‘మట్కా’ సినిమాలో నటించారు, ఇది పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్. అయితే, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. తన తదుపరి సినిమా మెర్లపాక గాంధీ డైరెక్షన్‌లో హారర్ కామెడీగా రాబోతోంది. లావణ్య త్రిపాఠి ఇటీవల ‘హ్యాపీ బర్త్‌డే’ వెబ్ సిరీస్ ‘మిస్ పర్ఫెక్ట్’లో కనిపించింది. తన తదుపరి సినిమా ‘సతి లీలావతి’లో మలయాళ నటుడు దేవ్ మోహన్‌తో కలిసి నటిస్తోంది. వీరిద్దరూ వివాహం తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతున్నారు.

Just In

01

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?

Aryan second single: విష్ణు విశాల్ ‘ఆర్యన్’ సెకండ్ సింగిల్ వచ్చేసింది.. చూసేయండి మరి..