YS Jagan (Image Source: twitter)
ఆంధ్రప్రదేశ్

YS Jagan: అట్టర్‌ ఫ్లాప్‌ సినిమాకు.. బలవంతపు విజయోత్సవాలా.. సూపర్ సిక్స్‌పై జగన్ సెటైర్లు

YS Jagan: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్.. కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘సూపర్ సిక్స్.. సూపర్ హిట్’ అంటూ ప్రభుత్వం తలపెట్టిన విజయోత్సవ కార్యక్రమంపై మండిపడ్డారు. అట్టర్ ఫ్లాప్ సినిమాకు బలవంతపు విజయోత్సవాలు ఏంటని జగన్ ప్రశ్నించారు. రెప్ప వేయకుండా అబద్దాలు చెప్పే వ్యక్తి సీఎం చంద్రబాబు (CM Chandrababu) అని తీవ్రస్థాయిలో విమర్శించారు.

సూపర్‌ సిక్స్‌.. అట్టర్‌ ఫ్లాప్‌
వైసీపీ అధినేత వైఎస్ జగన్.. తాడేపల్లిలోని నివాసం నుంచి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి పలు ప్రశ్నలు సంధించారు. ఎన్నికలకు ముందు చెప్పిన సూపర్ సిక్స్ కు .. ప్రస్తుతం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ కు అసలు పొంతన లేదని జగన్ ఆరోపించారు. తల్లికి వందనం కింద ఒక్కొక్కరికి రూ. 15వేలు, రైతులకు అదనంగా రూ.20వేలు, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, నిరుద్యోగ భృతి సక్రమంగా అమలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. గతేడాది, ఈ ఏడాది కలిపి ఒక్కో నిరుద్యోగికి రూ.72వేలు, ఒక్కో రైతుకు రూ.40వేలు బాకీ పడ్డారని అన్నారు. తల్లికి వందనం రూ.15వేలు ఇస్తామని చెప్పి.. రూ.8-13వేల మధ్యనే ఖాతాల్లో వేశారని జగన్ ఆరోపించారు.

Also Read: Shocking Incident: అందరూ చూస్తుండగానే.. కుప్పకూలిన స్వీడన్ ఆరోగ్య మంత్రి.. వీడియో వైరల్

యూరియా కొరతపై..
ఏపీలో ఎరువులు దొరక్క రైతులు అవస్థలు పడుతుంటే సీఎం చంద్రబాబు ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని జగన్ మండిపడ్డారు. సమయానికి ఎరువులు అందిస్తే రైతులు ఎందుకు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వస్తుందని ప్రశ్నించారు. ఆఖరికి చంద్రబాబు ఇలాకా అయిన కుప్పంలోని రైతులు సైతం యూరియా దొరక్క ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం నుంచి రైతులకు వెళ్లాల్సిన ఎరువుల్ని టీడీపీ నేతలు దారి మళ్లించి అధిక ధరలకు అమ్ముకుంటున్నారని జగన్ ఆరోపించారు. ఎరువుల్ని బ్లాక్ చేసి.. బ్లాక్ అమ్మేసుకుంటున్నారని విమర్శించారు. అయినా ఎవరిమీద చర్యలు లేవని మండిపడ్డారు. దోచుకో.. పంచుకో.. తినుకో.. అనే తీరుతో ప్రభుత్వం నడుస్తోందని అన్నారు.

Also Read: New Thar Crashes: నిమ్మకాయలు తొక్కించబోయి.. రూ.15 లక్షల కొత్త కారును.. బోల్తా కొట్టించిన యువతి

మెడికల్ కాలేజీలు అంశంపై..
ఏపీలో మెడికల్ కాలేజీ అంశంపైనా వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. సీఎంగా ఉండి ఏనాడైనా ఒక్క మెడికల్ కాలేజీని చంద్రబాబు తీసుకువచ్చారా? అని ప్రశ్నించారు. తమ హయాంలో 17 కాలేజీలను తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. 26 జిల్లాల్లో ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఉండాలని ప్రయత్నించిన ఘనత గత వైసీపీ ప్రభుత్వానిదని జగన్ అన్నారు. పులివెందుల మెడికల్ కాలేజీకి 50 ఎంబీబీఎస్ సీట్ల భర్తీ అనుమతులు వస్తే సీఎం చంద్రబాబు అడ్డుకున్నారని జగన్ ఆరోపించారు. తమకు సీట్లు వద్దని కేంద్రానికి లేఖ రాశారని విమర్శించారు. ఇలాంటి సీఎం దేశంలో ఎక్కడైనా ఉంటారా? అని జగన్ ప్రశ్నించారు.

Also Read: Prithvi Shaw: లైంగిక వేధింపుల కేసులో.. క్రికెటర్ పృథ్వీషాకు.. రూ.100 జరిమానా

Just In

01

Nagababu: మెగా లిటిల్ ప్రిన్స్‌‌పై మెగా బ్రదర్ రియాక్షన్ ఇదే.. పట్టలేనంత ఆనందంలో!

Mahabubabad District: మహిళ ఉపాధ్యాయురాలికి.. ఆర్టీసీ డ్రైవర్ తో ఘోర అవమానం!

Viral Video: పులిని పట్టుకోని ఫారెస్ట్ అధికారులకు.. గ్రామస్థులు విచిత్రమైన శిక్ష!

Chiranjeevi- Vijay Sethupathi: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సెట్‌కి అనుకోని అతిథి.. ఎందుకొచ్చారంటే?

Suspicious Death: అనుమానాస్పద స్థితిలో ఒంటరి మహిళ మృతి.. ఎక్కడంటే?