Shocking Incident (Image Source: Twitter)
Viral

Shocking Incident: అందరూ చూస్తుండగానే.. కుప్పకూలిన స్వీడన్ ఆరోగ్య మంత్రి.. వీడియో వైరల్

Shocking Incident: కొత్తగా నియమింపబడిన స్వీడన్ ఆరోగ్యమంత్రి ఎలిసబెట్ లాన్ (Elisabet Lann).. విలేకారుల సమావేశంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి 10 రోజులు కూడా కాకముందే ఆమె అనారోగ్యానికి గురికావడంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. మరోవైపు మంత్రి కుప్పకూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అసలేం జరిగిందంటే?
ఆరోగ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం 48 ఏళ్ల తన తొలి ప్రెస్ కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు. ఆమెతో పాటు స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్ సన్ (Ulf Kristersson), క్రిస్టియన్ డెమోక్రాట్స్ పార్టీ (Christian Democrats party) నేత ఎబ్బా బుష్ (ఉప ప్రధాని), పలువురు అధికారులు సైతం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. జర్నలిస్టు అడిగిన ప్రశ్నపై ఓ అధికారి మాట్లాడుతుండగా లాన్ ఆసక్తికగా వింటూ కనిపించారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా ముందుకు వాలి ఒక్కసారిగా కిందకు పడ్డారు.

సాయం చేసిన ఉప ప్రధాని
ఆరోగ్యమంత్రి కిందపడిపోవడంతో ఆమె పక్కనే ఉన్న ఉప ప్రధాని ఎబ్బా బుష్ అప్రమత్తయ్యారు. ఆమె వద్దకు పరిగెత్తుకొని వెళ్లి కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే అక్కడి ఉన్న అధికారులు, జర్నలిస్టులు సైతం ఆరోగ్యమంత్రి వద్దకు వచ్చి ఆమెను పైకి లేపారు. కొద్దిసేపటి తర్వాత లాన్ కోలుకొని.. తిరిగి సమావేశ మందిరానికి వచ్చారు. తనకు జరిగిన అనూహ్య పరిణామం గురించి వివరణ ఇచ్చారు.

దానివల్లే ఇలా జరిగింది: ఆరోగ్యమంత్రి
శరీరంలో చక్కెర స్థాయులు ఒక్కసారిగా పడిపోవడం వల్లే తాను అనారోగ్యానికి గురైనట్లు ఆరోగ్యమంత్రి ఎలిసబెట్ లాన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ అనూహ్య ఘటన నేపథ్యంలో నిర్దేశించిన సమయం కంటే ముందే ప్రెస్ కాన్ఫరెన్స్ ను అధికారులు ముగించారు. జర్నలిస్టుల ప్రశ్నోత్తరాలను సైతం అర్ధాంతరంగా ఆపేశారు.

Also Read: PM Modi: భారత్‌తో వాణిజ్య చర్చలు.. ట్రంప్ పోస్టుకు.. ప్రధాని ఆసక్తికర ఆన్సర్!

ఎలిసబెట్ లాన్ రాజకీయ నేపథ్యం
గత సోమవారం తన పదవికి రాజీనామా చేసిన ఆకో ఆంకార్బర్గ్ జోహాన్సన్ (Acko Ankarberg Johansson) స్థానంలో లాన్ అదే రోజు ఆరోగ్యమంత్రిగా నియమితులయ్యారు. క్రిస్టియన్ డెమోక్రాట్స్ పార్టీకి ఆమె సుదీర్ఘంగా కాలంగా సేవలు అందిస్తున్నారు. 2019 నుంచి గోథెన్‌బర్గ్‌లో మున్సిపల్ కౌన్సిలర్‌గా పనిచేశారు. ఆమె లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అలాగే ఆమె కేబినెట్ ఆఫీస్ డిప్యూటీ డైరెక్టర్‌గా, హెల్త్ కేర్ రెస్పాన్స్‌బిలిటీ ఎంక్వైరీలో భాగంగా పనిచేశారు.

Also Read: Wine Mart: మందుబాబులకు గుడ్ న్యూస్.. అనంతగిరిలో వైన్ మార్ట్..!

Just In

01

NHRC Files Case: క్లినికల్ ట్రయల్స్ ముసుగులో పేదల ప్రాణాలతో చెలగాటం.. రెడ్డీస్ ల్యాబ్‌పై కేసులు!

Lavanya Tripathi: మెగా ఫ్యాన్సుకు గుడ్ న్యూస్.. వారసుడికి వెల్‌కమ్ చెప్పిన లావణ్య త్రిపాఠి

YS Jagan: అట్టర్‌ ఫ్లాప్‌ సినిమాకు.. బలవంతపు విజయోత్సవాలా.. సూపర్ సిక్స్‌పై జగన్ సెటైర్లు

New Thar Crashes: నిమ్మకాయలు తొక్కించబోయి.. రూ.15 లక్షల కొత్త కారును.. బోల్తా కొట్టించిన యువతి

Deepika Padukone: కూతురుకోసం వంట చేసిన దీపికా పదుకోణె .. ఏం చేసిందంటే?