Wine Mart (imagecredit:twitter)
తెలంగాణ

Wine Mart: మందుబాబులకు గుడ్ న్యూస్.. అనంతగిరిలో వైన్ మార్ట్..!

Wine Mart: ప్రభుత్వం తొలిసారిగా పర్యటన ప్రదేశంలో వైన్ మార్టు(Wine Mart) ఏర్పాటుకు శ్రీకారం చుట్టబోతుంది. అందుకోసం రాష్ట్ర పర్యాటకశాఖ ప్రణాళికలు రూపొందిస్తుంది. పర్యాటకులు ఆసక్తి చూపుతుండటంతోనే పర్యాటక ప్రాంతంలో మార్టు ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం.

అనంతగిరికి తెలంగాణ ఊటీగా..

రాష్ట్రంలోని ముఖ్య పర్యాటక ప్రాంతాలలో ఒకటి వికారాబాద్ జిల్లా(Vikarabad District)లోని అనంతగిరి. ఈ ప్రాంతం అంతా ప్రకృతి రమణీయతో కూడుకున్నది. కొండలు, అడవి అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. సహజ సిద్దమైన మంచినీటి బుగ్గలు, పచ్చటి హరిత వనాలు ఇలా ప్రకృతి అందాలు కట్టిపడేస్తున్నాయి. అనంతగిరికి తెలంగాణ ఊటీగా పేరొందింది. దీంతో ఇక్కడికి వీకెండ్ లో పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు రోజూ రోజూకు అనంతగిరి అందాలను వీక్షించేందుకు రాష్ట్ర పర్యాటకులకే కాకుండా విదేశీ పర్యాటకులు సైతం వస్తున్నారు. ఆ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే వైన్ మార్టు ఏర్పాటుకు కసరత్తు చేస్తుంది. పర్యాటకుల సౌకర్యార్ధమే అందుబాటులో తీసుకొచ్చే ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వానికి ఆదాయం సైతం సమకూరనున్నది. ప్రభుత్వం ఫైనల్ చేస్తే ఈ అనంతగిరిలో వైన్ మార్టు ఏర్పాటు కానుంది. ఇక్కడ సక్సెస్ అయితే మరిన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

అన్నిశాఖల సహకారంతో..

మరోవైపు అనంతగిరి అభివృద్ధి కోసం డిస్టినేషన్ మేనేజ్ మెంట్ కమిటీ(Destination Management Committee) ఏర్పాటు చేయబోతున్నారు. దీంతో చూసేందుకు వచ్చే పర్యాటకులకు మౌలిక వసతుల సమస్య లేకుండా పనులు చేపట్టనున్నారు. ఈ కమిటీలో పారెస్టు, ఫిషరీస్, జిల్లాకలెక్టర్, పీఆర్ ఆర్డీ, ఇలా అన్ని శాఖలకు చోటు కల్పించనున్నారు. అన్నిశాఖల సహకారంతో పర్యాటక ప్రాంతాల్లో అభివృద్ధికి శ్రీకారం చుట్టబోతున్నట్లు పర్యాటకశాఖ అధికారులు తెలిపారు. అదే విధంగా అనంతరగిరి వరల్డ్ క్లాస్ రిసార్ట్స్(World Class Resorts) నిర్వహించబోతున్నారు. అందులో కార్పొరేట్ తరహాలో సౌకర్యాలు కల్పించనున్నారు. అందుకు సైతం టూరిజం కార్పోరేషన్ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

Also Read: CP Anandh: నిమజ్జనం ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోంది: సీపీ ఆనంద్

అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో..

అదే విధంగా సఫారీ ఏరియా ఏర్పాటు చేయబోతున్నారు. ఈ అనంతగిరి కొండలు దాదాపు 3763 ఎకరాల విస్తీర్ణం లో ఉండటంతో అమ్రాబాద్, జెన్నారం తరహాలో సఫారీ ఏరియాకు శ్రీకారం చుట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే టూరిజం ప్రాంతాల్లో వెల్ నెస్ సెంటర్లు, యోగాడెస్క్, వెడ్డింగ్ డెస్టినేషన్, స్పా ఏరియా, కేఫ్‌టేరియా సౌకర్యాలు ఏర్పాటుకు ఇప్పటికే ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో దీనిని రూపుదిద్దనున్నారు. పర్యాటకులు ఒత్తిడి నుంచి ఉపశమనం, మానసికోల్లాసం అందించేలా సౌకర్యాలు కల్పించనున్నారు. ఆర్యోగం, ఆహ్లాదం, ఆనందం కలిగించేలా పర్యాటకుల స్వర్గధామంగా.. అనంతగిరి ని తీర్చిదిద్దనున్నారు. విదేశీ, దేశీయ పర్యాటకులు హాయిగా సేద తీరేలా వసతులు కల్పించబోతున్నారు. ఇప్పటికే ఇక్కడ గ్లాంపింగ్స్(గుడారాల) ఏర్పాటుకు ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించింది. 18 ఎకరాల విస్తీర్ణంలో 88 గ్లాపింగ్స్ ఏర్పాటు చేయనున్నారు.

సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో

ఒక్కో గ్లాంపింగ్ ను సుమారు రూ.4.31 లక్షలతో నిర్మించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే రూ.38 కోట్లు మంజూరయ్యాయి. ఒక్కో ఎకరంలో సుమారు 5 ప్లాట్ ఫారాలు ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు అనంతగిరిలో పీపీ మోడల్(ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం)తో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. సెంట్రల్ గవర్నమెంట్ నిధులతోనూ టూరిజం ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. అనంతగిరి హిల్స్ సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లతో ఒక లగ్జరీ వెల్‌నెస్ రిసార్ట్‌ను ఏర్పాటు చేసే యోచనలో ఉంది. ఇది బెంగళూరులోని జిందాల్ నేచురల్ క్యూర్ తరహాలో ఏర్పాటు చేయాలని టూరిజం శాఖకు సూచించినట్లు తెలిసింది. పర్యాటకుల భద్రత కోసం 7.75 కిలో మీటర్ల పొడవునా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు.

అనంతగిరి సమగ్రాభివృద్ధి ప్రణాళిక

అనంతగిరికి పర్యాటకులను మరింత ఆకర్షించేందుకు అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పనులు చేపట్టనున్నాం. అందుకు ఏజెన్సీలను ఆహ్వానిస్తున్నాం. అంతేగాకుండా అభివృద్ధికి కమిటీలు వేస్తున్నాం. ఈ కమిటీల్లో అన్ని శాఖలకు ప్రాతినిధ్యం కల్పించబోతున్నాం. అందులో భాగంగానే వైన్ మార్టు, వరల్డ్ క్లాస్ రిసార్ట్స్, సఫారీ ఏరియా ఏర్పాటు చేయబోతున్నారు. దేశ విదేశీ పర్యాటకులను మరింతకట్టుకునేలా వసతులు కల్పించనున్నామని టూరిజం ఎండీ వల్లూరి క్రాంతి అన్నారు.

Also Read: Bellamkonda Sai Srinivas: వారి వల్లే సినిమాకు అలా జరిగింది.. అలా అనే సరికి బాధేస్తోంది

Just In

01

Heavy Rains: కుండపోత వర్షంతో కనిపించని రహదారులు.. ఎక్కడంటే..?

Prithvi Shaw: లైంగిక వేధింపుల కేసులో.. క్రికెటర్ పృథ్వీషాకు.. రూ.100 జరిమానా

Vayuputra Animation Movie: పాన్ ఇండియా స్థాయిలో మరో యానిమేషన్ మూవీ.. నిర్మాత ఎవరంటే?

Maoist Party: మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా దేవ్ జీ?

Jishnu Dev Verma: జైళ్ల శాఖ సిబ్బంది కృషి శ్లాఘనీయం: గవర్నర్​ జిష్ణుదేవ్ వర్మ