Ganesh Chaturthi 2025 (Image Source: Twitter)
Viral

Ganesh Chaturthi 2025: లక్ అంటే ఈ కుర్రాడిదే.. రూ.99 కే 333 కేజీల లడ్డూను సొంతం చేసుకున్నాడు?

Ganesh Chaturthi 2025: గణేశుడి లడ్డూ పాటలో మనం ఇప్పటి వరకు కోట్లు పలికిన లడ్డూను చూశాము. అలాగే, లక్షల్లో, వేలల్లో పలికిన లడ్డూలను కూడా చూశాము. కానీ, హైద్రాబాద్ లోని ఓ ప్రదేశంలో కేవలం రూ.99 కే లడ్డూ సొంతం చేసుకున్నారు. మరి, ఆ లక్కీ పర్సన్ ఎవరు? ఆ లడ్డూ ఎన్ని కేజీలు ఉంటుందో ఇక్కడ ఆ వివరాలు పూర్తిగా తెలుసుకుందాం..

Also Read: Bigg Boss Telugu 9: ఈ రోజే బిగ్‌ బాస్ 9 గ్రాండ్ లాంఛ్.. ఫైనల్ లిస్ట్ అదేనా లేక అంతా తూచ్ అంటారా?

ఈ ఏడాది గణపతి దేవుడి బొమ్మ పెట్టిన రోజు నుంచి నిమజ్జనం అయ్యే రోజు వరకు వానలు పడుతూనే ఉన్నాయి. ఎడ తెరిపి లేకుండా కురిసిన వానలకు భక్తులు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఆ వినాయకుడికి ఘనంగా పూజలు చేశారు. దండాలయ్యా ఉండ్రాలయ్యా అంటూ ఆ గణేశుడికి దండాలు పెడుతూ .. నీ అండాదండా ఉండాలయ్యా అంటూ భక్తులు భజనలు చేస్తూ వినాయక చవితి పండుగను సంతోషంగా జరుపుకున్నారు. అయితే, ఈ క్రమంలోనే హైద్రాబాద్ లోని ఓ ఏరియాలో కేవలం రూ.99 కే లడ్డూ సొంతం చేసుకున్నారు. ఎక్కడా అని సందేహిస్తున్నారా? ఎక్కడో కాదండి కొత్త పేటలో ఓ విద్యార్ధి రూ.99 కే 333 కేజీల లడ్డూను సొంతం చేసుకున్నాడు. ఏంటి నమ్మాలనిపించడం లేదా? ఇది నిజం. కాకపోతే లక్కీ డ్రా లో ఆ లడ్డూను సొంతం చేసుకున్నాడు.

Also Read: Karthik Gattamneni: తొమ్మిది గ్రంథాలు దుష్టుల బారిన పడితే.. ‘మిరాయ్‌’ మన రూటెడ్ యాక్షన్ అడ్వెంచర్

ఓ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లడ్డూ కోసం నిర్వహించిన లక్కీ డ్రాలో ఈ లడ్డూను సొంతం చేసుకోవడం జరిగింది. మొత్తం 760 టోకెన్లను విక్రయించారు. దీనిలో ఓ విద్యార్ధికి అదృష్టం తలుపు తట్టింది. లక్కీ డ్రాలో 333 కేజీల లడ్డూను రూ.99 రూపాయలకే సొంతం చేసుకున్నాడు.

Also Read: Ganesh Immersion 2025: హైదరాబాద్‌లో 2 లక్షల 54 వేల 685 విగ్రహాలు నిమజ్జనం.. జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడి

Just In

01

KTR: పారిశుధ్య కార్మికుడిది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్యే: కేటీఆర్

Ganesh Visarjan 2025: రెండో రోజు కొనసాగిన నిమజ్జనం.. పారిశుద్ధ్య కార్మికురాలు మృతి!

Harish Rao: రాష్ట్రంలో దీన స్థితికి చేరిన గురుకులాలు.. హరీష్ రావు ఫైర్

TSUTF Demands : టెట్ పై సుప్రీం తీర్పును పున:సమీక్షించాలని ఉపాద్యాయులు డిమాండ్!

CV Anand: సిబ్బంది అందరికీ అభినందనలు తెలిపిన సీపీ ఆనంద్!