Ganesh Immersion 2025: వినాయక నిమజ్జనంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ లోని ఆరు జోన్లలో కలిపి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు సుమారు 2 లక్షల 54 వేల 685 విగ్రహాలు నిమజ్జనమైనట్లు జీహెచ్ఎంసీ( GHMC) అధికారులు వెల్లడించారు. గత నెల 27 నుంచి గణేష్ నవరాత్రులు మొదలైనప్పటికీ, ఈ నెల 29 నుంచే జీహెచ్ఎంసీ పరిదిలోని 30 సర్కిళ్లలో అధికారులు బేబీ పాండ్లను అందుబాటులోకి తెచ్చారు. ఈ బేబీ పాండ్ల వద్ద మూడు, అయిదు, ఏడు, తొమ్మది రోజులతో పాటు ఫైనల్ నిమజ్జనం జరిగిన శనివారం నిమజ్జనం చేసిన విగ్రహాల సంఖ్యను కలిపి మొత్తం 2 లక్షల 54 వేల 685 ఉన్నట్లు వెల్లడించారు. వీటిలో బేబీ పాండ్లలో నిమజ్జనం చేసిన విగ్రహాల సంఖ్య కనిష్టంగా ఒక ఫీటు గరిష్టంగా ఎనిమిది ఫీట్ల వరకు ఉండవచ్చునని అధికారులు వెల్లడించారు.
శనివారం సాయంత్రం వరకు జరిగిన వినాయక విగ్రహాల సంఖ్య ఇలా ఉంటే, నిమజ్జనం శనివారం రాత్రితో పాటు ఆదివారం మధ్యాహ్నాం వరకు కొనసాగే అవకాశముండటంతో ఈ సంఖ్య మూడు లక్షలు దాటవచ్చునన్న అంచనాలున్నాయి. గత సంవత్సరం కూడా రెండు రోజుల పాటు జరిగిన నిమజ్జనం లో భాగంగా రెండో రోజు ఉదయ కల్లా నిమజ్జనం ముగియనున్నట్లు అధికారులు చెప్పినా, నిమజ్జనం రెండో రోజు సాయంత్రం వరకు కొనసాగింది.
ఖైరతాబాద్ జోన్ లో 62 వేల 714 విగ్రహాలు
పోలీసులు నిమజ్జనానికి విధించిన ట్రాఫిక్ ఆంక్షలను మరి కొద్ది గంటల పాటు పొడిగించుకోవల్సి వచ్చింది. ఈ సారి కూడా ఆదివారం మధ్యాహ్నాం తరువాత వరకు కూడా నిమజ్జనం జరిగే ఛాన్స్ ఉన్నందున నిమజ్జనం అయిన విగ్రహాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగే అవకాశం లేకపోలేదు. అత్యధికంగా ఖైరతాబాద్ జోన్ లో 62 వేల 714 విగ్రహాలు నిమజ్జనం కాగా, అన్ని జోన్ల కన్నా తక్కువగా, అత్యల్పంగా చార్మినార్ జోన్ లో 19 వేల 781 విగ్రహాలు నిమజ్జనం అయినట్లు అధికారులు తెలిపారు.
జోన్ల వారీగా నిమజ్జనమైన విగ్రహాలు
————————————————————————————————————-
జోన్ 1.5 నుంచి 3 అడుగుల విగ్రహాలు 3 కన్నా ఎక్కువ అడుగులు మొత్తం విగ్రహాలు
————————————————————————————————————-
ఎల్బీనగర్ 14253 21625 35878
చార్మినార్ 10234 9547 19781
ఖైరతాబాద్ 23468 39246 62714
శేరిలింగంపల్లి 13986 26864 40850
కూకట్ పల్లి 10032 49547 59579
సికిందరాబాద్ 20125 15758 35883
————————————————————————————————————-
మొత్తం 92098 162587 254685
————————————————————————————————————
Also Read: Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!