New Thar Crashes: దేశ రాజధాని దిల్లీలో వింత ఘటన చోటుచేసుకుంది. కొత్తగా కొనుగోలు చేసిన మహీంద్రా థార్ కారు.. ప్రమాదానికి గురైన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రూ.15 లక్షలకు పైగా విలువైన ఈ కొత్త కారును నిమ్మకాయలు తొక్కించి షోరూం నుంచి బయటకు తెచ్చే క్రమంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. షోరూం మెుదటి అంతస్తు నుంచి కారు ఒక్కసారిగా కిందపడిపోయింది.
వివరాల్లోకి వెళ్తే..
దిల్లీలోని నిర్మాణ్ విహార్ ప్రాంతంలో గల ఓ షోరూమ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. రూ.15 లక్షలకు పైగా విలువైన మహీంద్రా థార్ రాక్స్ (Mahindra Thar ROXX) కారును 29 ఏళ్ల ఓ యువతి ఎంతో ఇష్టంగా కొనుగోలు చేసింది. మెుదటి అంతస్తులో ఉన్న కారును శుభసూచకంగా నిమ్మకాయలు తొక్కించి.. బయటకు తీసుకురావాలని భావించింది. ఈ క్రమంలో కారు యాక్సలేటర్ ను ఒక్కసారిగా నొక్కడంతో ఆ కారు బాల్కానీ నుంచి దూసుకెళ్లి అమాంతం కిందపడిపోయింది. 15 అడుగుల ఎత్తు నుంచి నేలపైకి బోల్తా పడింది.
యువతికి గాయాలు..
ఈ ఘటనతో ఒక్కసారిగా కంగుతున్న షోరూం సిబ్బంది.. హుటాహుటీనా కిందకు పరిగెత్తుకు వచ్చారు. కారులో చిక్కుకున్న యువతిని బయటకు తీసుకొచ్చారు. అదృష్టవశాత్తు యువతి స్వల్ప గాయాలతో బయటపడింది. కానీ కారు మాత్రం తీవ్రంగా దెబ్బతిన్నది. గాయపడ్డ యువతిని సమీపంలోని ఆస్పత్రికి షోరూం సిబ్బంది తరలించారు. సోమవారం (సెప్టెంబర్ 8) సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: Prithvi Shaw: లైంగిక వేధింపుల కేసులో.. క్రికెటర్ పృథ్వీషాకు.. రూ.100 జరిమానా
రంగంంలోకి పోలీసులు..
ఘటన గురించి సమాచారం అందుకున్నపోలీసులు.. హుటాహుటీన మహీంద్ర షోరూం వద్దకు చేరుకున్నారు. అయితే ప్రమాద సమయంలో కారులో యువతి భర్తతో పాటు షోరూం సిబ్బంది ఒకరు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారెవరికీ పెద్దగా గాయాలు కాలేదని స్పష్టం చేశారు. అయితే ఘటనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు.
Also Read: Shocking Incident: అందరూ చూస్తుండగానే.. కుప్పకూలిన స్వీడన్ ఆరోగ్య మంత్రి.. వీడియో వైరల్
వీడియోలో ఏముందంటే?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను గమనిస్తే.. మహీంద్రా థార్ కారు తలకిందులై పడి ఉంది. కారు అద్దాలు పగిలి.. చెల్లాచెదురుగా వాహనం చుట్టూ పడి ఉన్నాయి. జనాలు గుమ్మిగూడి కారును చూస్తూ ఉండిపోవడాన్ని వీడియోలో గమనించవచ్చు. షోరూమ్ మెుదటి అంతస్తు బాల్కానీకి అమర్చిన గాజు గ్లాస్ పగిలి పోవడం కూడా వీడియో కనిపించింది.
Brand-new Thar crashes out of Delhi showroom after buyer accidentally hits the accelerator
Read more here: https://t.co/3uGgmK2YwH pic.twitter.com/YuFr4felpn
— The Indian Express (@IndianExpress) September 9, 2025