DSP Chandrabhanu ( IMAGE credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

DSP Chandrabhanu: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు : డిఎస్పి చంద్రబాను

DSP Chandrabhanu:  అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పోలీసు అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇల్లందు డిఎస్పి చంద్రబాను ఆదేశించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఆదేశాల మేరకు ఇల్లందు డిఎస్పి చంద్రభాను ఆధ్వర్యంలో గురువారం ఇల్లందు పోలీస్ స్టేషన్ పరిధిలోని వినోభా నగర్ లో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం ను నిర్వహించారు. ఈ కార్యక్రమం లో మొత్తం సుమారుగా 250 ఇండ్లలో సోదాలు నిర్వహించారు. సరైన పత్రాలు లేకుండా నెంబర్ ప్లేట్లు లేని 70 ద్విచక్ర వాహనాలను, 03 ఆటోలను, ఒక కారును సీజ్ చేశారు. అనంతరం వినోభా నగర్ వాసులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇల్లందు డిఎస్పి చంద్రభాను పలు సూచనలు చేశారు.

మట్కా, జూదం,బెట్టింగ్, గంజాయి రవాణా పాల్పడే వ్యక్తులపై ప్రత్యేకంగా నిఘా

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని కోరారు. తమ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. మట్కా, జూదం,బెట్టింగ్, గంజాయి రవాణా పాల్పడే వ్యక్తులపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వివరించారు. విపత్కర సమయాల్లో, ఆపదలో ఉన్నప్పుడు డయల్ 100 కు ఫోన్ చేసి పోలీస్ సేవలను పొందాలని తెలిపారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. నేరాల నియంత్రణ కొరకు తమ నివాస ప్రాంతాలలో సీసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 100 మందికి పైగా పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

 Also Read: Jupally Krishna Rao: బతుకమ్మ ప్రాముఖ్యతను చాటి చెబుదాం.. మంత్రి జూప‌ల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు

అనర్హత వేటు వేయడానికి అర్హత సాధించేసిన రాజగోపాల్ రెడ్డి

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసి.. అనర్హతా వేటు వేయడానికి అవసరమైన అర్హత సాధించారు. మంత్రి పదవి రాదని తెలిసినప్పటి నుండి ఆయన తిరుగుబాటు చేస్తున్నారు. మొదట ముఖ్యమంత్రిని టార్గెట్ చేసినా ఇప్పుడు నేరుగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు. యువతకు రెండు లక్షలు ఇస్తామని చెప్పి తమ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. నేపాల్ తరహాలో తెలంగాణ ప్రభుత్వంపై తిరుగుబాటు చేద్దామని.. ఓ అన్నలా అండగా ఉంటానని యువతకు పిలుపునిచ్చారు.తెలంగాణ లిబరేషన్ డే సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించిన తర్వాత రాజగోపాల్ రెడ్డి తన రాజకీయం తాను చేసుకున్నారు. మంత్రి పదవి రానప్పటి నుండి ఆయన తాను కాంగ్రెస్ పార్టీలో లేనట్లుగానే వ్యవహరిస్తున్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు తిరుగుబాటు గురించి చెబుతున్నారు. ఆయన తీరుతో కాంగ్రెస్ పార్టీలోనూ అసహనం వ్యక్తమవుతోంది.

ఘోరంగా క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్న రాజగోపాల్ రెడ్డి

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా ఘోరంగా క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. పీసీసీ చీఫ్ కూడా తనకు కోమటిరెడ్డి మీద ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు. క్రమశిక్షణా కమిటీ సుమోటోగా తీసుకుని విచారణ చేయవచ్చని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఎలా చూసినా.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కంట్రోల్ చేసుకోకపోతే ఆయన నేరుగా మనుషుల్ని తీసుకొచ్చి ధర్నాలు చేయించినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది. రాజగోపాల్ రెడ్డి మాటలే కాదు అనుకున్నంత చేసే రాజకీయ నాయకుడేనని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

 Also Read: Periyar Jayanti: సనాతన ధర్మాన్ని వీడిన రోజే.. బహుజన రాజ్యాధికారం సాధ్యం..జీడి సారయ్య

Just In

01

Harish Rao: లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టే ధైర్యం ప్రభుత్వానికి లేదా: హరీష్ రావు

Ramachandra Rao: ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం.. అలైన్ మెంట్ మార్చాలంటూ రైతులు డిమాండ్!

H-City Project: ముందుకు సాగని హెచ్ సిటీ పనులు.. ఎందుకో తెలుసా..!

Pawan Kalyan thanks: వారికి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్.. ప్రత్యేకించి అభిమానులకు అయితే..

OG Concert: ‘ఓజీ’ సినిమాలో హీరో తాను కాదంటూ బాంబ్ పేల్చిన పవన్.. ఇంతకూ వారు ఎవరంటే?