Huzurabad Hospital: హుజూరాబాద్ ఏరియా వంద పడకల ఆసుపత్రిలో సరైన వైద్యం అందడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, ఫిజియోథెరపీ సేవలు అందుబాటులో లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రిలో 22 మంది వైద్యులు ఉన్నప్పటికీ, ఒక్క ఫిజియోథెరపిస్ట్ లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం దొరక్క, రోగులు ప్రైవేట్ క్లినిక్‌ల వైపు వెళ్లక తప్పడం లేదు. ప్రైవేట్ కేంద్రాలు ఒక్కో సెషన్‌కు రూ.500 వరకు వసూలు చేస్తున్నాయి. దీనివల్ల నెలకు 15,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆర్థిక భారం సామాన్య ప్రజలకు పెను సమస్యగా మారిందని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని ఫిజియోథెరపిస్ట్‌ను నియమించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: CM Revanth Reddy: కుటుంబ సమస్యను బజార్ లోకి తెచ్చారు.. సీఎం సంచలన వ్యాఖ్యలు
ఆర్థిక భారం పడుతుంది.
స్థానిక నివాసి అయిన కొత్తూరు జీవన్ తన భార్య కొత్తూరీ సువర్ణ విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వేచ్ఛ తో పంచుకున్నారు. సువర్ణకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో ఆపరేషన్ అయిన తర్వాత, ఎడమ కాలు, ఎడమ చేయి పడిపోయాయి. వైద్యులు ఫిజియోథెరపీ చేయించుకోవాలని సూచించడంతో, వారు హుజూరాబాద్‌లోని ప్రైవేట్ ఫిజియోథెరపీ సెంటర్‌కు వెళ్తున్నారు. “ఇప్పటికి తొమ్మిది నెలల నుంచి రోజూ 500 ఖర్చుతో ఫిజియోథెరపీ చేయిస్తున్నాం. ఇది మాకు చాలా పెద్ద భారం” అని జీవన్ కన్నీరు పెట్టుకున్నారు. ఈ సమస్యపై ప్రజల ఆందోళనను గుర్తించి, ప్రభుత్వం తక్షణమే స్పందించి, హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రిలో ఫిజియోథెరపీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
Also Read: Ponguleti Srinivasa Reddy: ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అక్రమాలు.. మంత్రి ఫుల్ సీరియస్..?
బతుకమ్మ ప్రారంభోత్సవ వేడుకలకు ఏర్పాట్లను త్వరగా సిద్ధం చేయాలి.. హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
బతుకమ్మ ప్రారంభోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో బతుకమ్మ ప్రారంభోత్సవ వేడుకల ఏర్పాట్లు, నిర్వహణపై మున్సిపల్, రెవెన్యూ, పోలీస్, ఇతర శాఖల అధికారులతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ , జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డిలతో కలిసి జిల్లా కలెక్టర్ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
బతుకమ్మ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ఈనెల 21వ తేదీన హనుమకొండలోని చారిత్రక దేవాలయమైన వేయి స్తంభాల ఆలయం వద్ద రాష్ట్రస్థాయి బతుకమ్మ ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. విద్యుత్తు లైట్లు, సౌండ్ సిస్టం, తాగునీరు, పోలీస్ బందోబస్తు, పారిశుద్ధ్య నిర్వహణ, తదితర అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు. ప్రారంభోత్సవ వేడుకలకు రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, ధనసరి అనసూయ సీతక్క, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు పాల్గొననున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మేన శ్రీను, హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్, జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Also Read: Manipur attack: జవాన్ల ట్రక్కుపై సాయుధుల దాడి.. ఇద్దరు అస్సాం రైపిల్స్ జవాన్లు కన్నుమూత