CM Revanth Reddy (imagecredit:twitter)
తెలంగాణ

CM Revanth Reddy: కుటుంబ సమస్యను బజార్ లోకి తెచ్చారు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: ఆడపిల్ల ఉసురు బీఆర్ ఎస్ కు తప్పక తగులుతుందని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పేర్కొన్నారు. ఆయన ఢిల్లీలో చిట్ చాట్ చేశారు. కేసీఆర్(KCR), కేటీఆర్(KTR), హరీష్​ రావు(Harish Rao),సంతోష్​ రావు(Santhosh Rao)లు కవితను టార్గెట్ చేశారన్నారు. నలుగురు కలిసి ఒక ఆడపిల్లపై దాడి చేయాలని చూశారన్నారు. వాళ్ల కుటుంబ సమస్యను వాళ్లే బజార్లోకి తెచ్చారన్నారు. ఆస్తి పంపకాల అంశంలోనే తేడాలు వచ్చాయన్నారు. ఇక కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు ఎన్నడో తిరస్కరించాలని, ఆ ఫ్యామిలీని ప్రజలు బహిష్కరించారన్నారు. తెలంగాణ ఉద్యమంలో వందల మంది పిల్లల్నీ రెచ్చకొట్టి కేసీఆర్ వాళ్ల ను బలి పశువులను చేశారన్నారు. ఆ పాపం తప్పక తగులుతుందన్నారు. పదేళ్ల పాటు వ్యవహరించిన తీరు, తప్పిదాలు, నిర్లక్ష్యం, అణిచి వేతలన్నీ ఇప్పుడు తిరిగి తగులుతున్నాయన్నారు. ఉద్యమ సమయంలో వేల మంది తల్లుల గర్భశోకానికి కేసీఆర్ కారణం అన్నారు. ఇక టీఆర్ఎస్(BRS) ని బీజేపీ(BJP)లో విలీనం చేసినందుకు కేటీఆర్, హరీష్ రావు ప్రయత్నం చేశారని స్వయంగా కవిత(Kavitha) చెప్పారని సీఎం గుర్తు చేశారు.కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి, కవితను కేసీఆర్ పక్కన పెట్టడంతోనే పంచాయితీ మరింత ముదిరిందన్నారు. అధికారం, ఆస్తుల కోసం రోడ్డెక్కి కొట్లాడుకుంటున్నారన్నారు.

కేటీఆర్ చెప్పడంతోనే కాళేశ్వరానికి బ్రేకులు…

కాళేశ్వరం పై సీబీఐ ఎంక్వైరీని కేసీఆర్ అడ్డుకుంటున్నారని, ఇందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishna Reddy) సహకరిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ లు చెప్పినట్లు కిషన్ రెడ్డి ఆడుతున్నారన్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ ఎస్ దూరంగా ఉండటానికి కూడా కారణం ఇదేనని వెల్లడించారు. ఆ రెండు పార్టీల మధ్య ఒప్పందాలు స్పష్టంగా ఉన్నాయన్నారు. కాళేశ్వరం కేసును 48 గంటల్లోనే విచారణ జరుపుతామని చెప్పిన కిషన్ రెడ్డి ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. సీబీఐ కనీసం ఎఫ్​ ఐఆర్ కూడా చేయకపోవడం ఏమిటని? ప్రశ్నించారు. సీబీఐ(CBI) కేసు ఫైల్ చేస్తే అన్ని వివరాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ), ఘోష్ కమిషన్ రిపోర్ట్, ఇతర వివరాలు అందిస్తామన్నారు. బీహార్(Bihar) ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రచారానికి వెళ్తానని చెప్పారు. ఓటు చోరీ అంశంపై మొదట స్పందించింది తానేని గుర్తు చేశారు. 2018 ఎన్నికల్లో తెలంగాణలో 24 లక్షల ఓట్లు తొలగించారని చెప్పారు. ఒక్క కొడంగల్ నియోజకవర్గంలోనే 50 వేల ఓట్లను తొలగించారని వివరించారు. జీఎస్టీ మార్పులతో తెలంగాణకు రూ. 8 వేల కోట్లు నష్టం, కనీసం 5 ఏళ్ళు కేంద్రం గ్యాప్ ని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

మెట్రో, ట్రిపుల్ ఆర్ లలోనూ డ్రామాలే..

హైదరాబాద్ లో ప్రస్తుతం 5 లక్షల మంది మెట్రోరైల్ లో ప్రయాణం చేస్తున్నారని, మెట్రో విస్తరిస్తే సుమారు 15 లక్షల మంది ప్రయాణించే అవకాశం ఉన్నదన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రానికి అప్పగించామని, దీనిలోనూ కేసీఆర్ డైరెక్షన్ మేరకు కిషన్ రెడ్డి రాజకీయం చేస్తున్నాడన్నారు. కేసీఆర్, ఎల్ అండ్ టీ కారణంగానే మెట్రో ఫస్ట్ ఫేజ్ ఆలస్యమైందన్నారు. మెట్రో ఫస్ట్ ఫేజ్ 1 లో 70 కి.మీ ల కోసం దాదాపు రూ. 20 వేల కోట్లు ఖర్చు చేశామని, ఈ ప్రాజెక్ట్ లో తాము నష్టపోయినట్లు ఎల్ అండ్ టీ చెబుతోందన్నారు. అందువల్ల ఈ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మోయాలని డిమాండ్ చేస్తుందన్నారు. ఈ టైంలో మెట్రో రైల్ ఫేజ్ 2 కోసం ఎల్ అండ్ టీ తో ఒప్పందం చేసుకోవాలని కేంద్రం సూచించడం సరికాదని మండిపడ్డారు.దీంతో పాటు 360 కి.మీ ట్రిపుల్ ఆర్ కు ప్రధాని మోదీనే హైదరాబాద్ వేదికగా మాటిచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుత రూట్ లను చివరి పాయింట్ వరకు విస్తరిస్తూ ఫేజ్ 2లో 76 కి.మీ ప్రతిపాదనను కేంద్రం ముందు ఉంచామన్నారు.

Also Read: Haritha Haram: హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలు బ్రతుకుతున్నాయా?.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10, 822 కోట్లు ఖర్చు

యూరియాపై రాజకీయం…

కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్ర వాటా కింద 9.8 లక్షల టన్నుల యూరియా రావాల్సి ఉన్నదన్నారు. కానీ వాటాకు తగ్గట్లుగా సరైన టైంలో కేంద్రం యూరియాను సరఫరా చేయలేదన్నారు. పలు దఫాల్లో తగ్గించి సరఫరా చేయడం వల్ల రాష్ట్రంలో యూరియాపై అనిశ్చితి ఏర్పడిందన్నారు. దీన్ని ఆసరగా తీసుకొని బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) నేతలు కృత్రిమ యూరియా కొరతను సృష్టించి రైతుల్లో ఆందోళన నింపారన్నారు. ఈ ఫోబియాతో రైతులు ఎక్కువ యూరియా కొనుగోలు చేసే ప్రయత్నం చేశారని వివరించారు.మరోవైపు నక్సలైట్లు లొంగిపోవడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కొన్ని పాలసీలు తీసుకొచ్చాయని గుర్తు చేశారు. వారికి జనజీవన స్రవంతిలో కలిసేందుకు అవకాశం ఉందన్నారు. పాకిస్థాన్ టెర్రరిస్టులతో చర్చలు జరపడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు… నక్సలైట్లుగా మారిన దేశ అన్నదమ్ములు, అక్క చెల్లెల్లైతో చర్చలు చెప్పడానికి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు.

కండువాలతో పార్టీలు మారినట్లు కాదు..? స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం..?

10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని కేటీఆర్, హరీష్ రావులు పదే పదే ఆరోపిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అయితే ఆ ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో వాళ్లకే క్లారిటీ లేదంటూ చురకలంటించారు .తమకు సభలో 37 మంది సభ్యులు ఉన్నారని, మాట్లాడేందుకు సమయం కావాలని హరీష్ రావు చెప్తున్నారని, కానీ ఇందుకు భిన్నంగా కేటీఆర్ 10 మంది పార్టీ ఫిరాయించారని చెప్తున్నారన్నారు. ఎమ్మెల్యేలు బీఆర్ ఎస్ లోనే ఉన్నామని చెప్తుండగా, టెక్నికల్ గా ఆయా ఎమ్మెల్యేలు బీఆర్ ఎస్ లోనే ఉన్నారనే విషయంస్పష్టమవుతుందన్నారు. ఇక నీటి వినియోగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర స్పష్టమైన లెక్కలు లేవని సీఎం అన్నారు. ఆరవై వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ పాలనలో నీటి వినియోగంపై గందరగోళం నెలకొందని చెప్పారు. అందుకే ఏపీ, తెలంగాణ ల మధ్య నెలకొన్న నీటి పంపకాల వివాద పరిష్కారం కోసం త్వరలో ఓ కమిటీ వేయబోతున్నట్లు తెలిపారు. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు వెలువరిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుకు వెళ్తామని సీఎం చెప్పారు. అయితే సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలను గుర్తు చేశారు. ఈ గడువు సైతం దగ్గర పడుతోన్న నేపథ్యంలో న్యాయకోవిధుల సలహాలు తీసుకుంటామని చెప్పారు.

Also Read: Engineering Fee Hike: బిగ్ న్యూస్.. ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త ఫీజులు?

Just In

01

Pawan Kalyan thanks: వారికి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్.. ప్రత్యేకించి అభిమానులకు అయితే..

OG Concert: ‘ఓజీ’ సినిమాలో హీరో తాను కాదంటూ బాంబ్ పేల్చిన పవన్.. ఇంతకూ వారు ఎవరంటే?

Ind Vs Pak: కీలక క్యాచ్‌లు నేలపాలు.. టీమిండియా ముందు భారీ టార్గెట్

BRS women wing: బీఆర్ఎస్ మహిళా విభాగ అధ్యక్షురాలి పదవి ఎవరికి?

OTT movie review: పేరెంట్స్ అలా చేయడంతో దానికి రెడీ అయిన స్టూడెంట్.. ఏం చేసిందంటే?