Manipur attack: మణిపూర్‌లో శుక్రవారం సాయంత్రం షాకింగ్ ఘటన (Manipur attack) జరిగింది. అసోం రైఫిల్స్ జవాన్లు ప్రయాణిస్తున్న ట్రక్కుపై సాయుధాలు దాడి చేశారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు జవాన్లు వీరమరణం చెందారు. మరో ఐదుగురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. రాష్ట్ర రాజధాని ఇంఫాల్ నగర శివారల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఈ కాల్పులకు పాల్పడ్డారు. గాయపడిన జవాన్లను ఇంఫాల్ నగరంలోని రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు (RIMS) తరలించారు.
ఈ దాడి సాయంత్రం 5:50 గంటల సమయంలో జరిగిందని భద్రతా వర్గాలు తెలిపాయి. అసోం రైఫిల్స్‌కు చెందిన 407 టాటా వాహనం పట్సోయి బేస్ నుంచి నంబోల్ బేస్‌కు వెళుతున్న సమయంలో గుర్తు తెలియని సాయుధ వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. ఇదే మార్గంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే ప్రధాని మోదీ ప్రయాణించారు. మణిపూర్ పర్యటనలో భాగంగా ఆయన ప్రయాణించినట్టు తెలుస్తోంది.
Read Also- Hyderabad: ముంపు నుంచి శాశ్వత విముక్తి కలిగిస్తాం.. హైదరాబాదీలకు మంత్రి వివేక్ హామీ
ఇంఫాల్ – చురాచంద్‌పూర్ మధ్యలో నంబోల్ సబల్ లేకై అనే ఏరియాలో ఈ దాడి జరిగింది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వెలువడింది. కాల్పుల దాడిలో ఇద్దరు జవాన్లు మృతి చెందారని, ఐదుగురు గాయపడ్డారని అధికారులు పేర్కొన్నారు. మణిపూర్‌లోని డీ నోటిఫైడ్ ఏరియాలో జరిగిందని వివరించారు.
ఈ దాడికి బాధ్యత వహిస్తూ ప్రస్తుతానికి ఏ గ్రూప్ కూడా ప్రకటన చేయలేదు. దాడిలో పాల్గొన్నవారి కోసం భద్రతా బలంగా విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు అజయ్ భల్లా ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి హింసాత్మక చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. శాంతి, స్థిరత్వాన్ని కాపాడే దిశగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
Read Also- Sukumar Writings: సుకుమార్ రైటింగ్స్‌కు పది వసంతాలు.. సక్సెస్ రేట్ ఎంతో తెలుసా?
కాగా, మణిపూర్ రాష్ట్రంలో ప్రస్తుతం ఆర్మ్‌ర్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ (AFSPA) అమలులో ఉంది. అయితే, లోయ ప్రాంతంలోని ఐదు జిల్లాల్లోని 13 పోలీస్ స్టేషన్ పరిధిలో మాత్రం ఈ చట్టం వర్తించదు. దాడి జరిగిన నాంబోల్ ఏరియా బిష్ణుపూర్ జిల్లాలో ఉంది. ఇది ఏఎఫ్ఎస్‌పీఏ చట్టం పరిధిలోకి రాదు. ఈ చట్టాన్ని చివరిసారిగా మార్చి 2025లో 6 నెలల పాటు పొడిగించారు. ఈ నెలాఖరులో మళ్లీ సమీక్షకు రానుంది. కేంద్ర హోంశాఖ సమాచారం ప్రకారం, మణిపూర్‌లో మైతేయ్ తెగకు చెందిన మొత్తం తీవ్రవాద గ్రూపులపై నిషేధం కొనసాగుతోంది. ఈ గ్రూపులు గతంలో కూడా అస్సాం రైఫిల్స్‌పై దాడులకు తెగబడ్డాయి. 2021 నవంబర్‌లో చురాచాంపూర్ జిల్లాలో జరిపిన దాడిలో అస్సాం రైఫిల్స్‌కు చెందిన కల్నల్ విప్లవ్ త్రిపాఠి, ఆయన భార్య, కుమారుడు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన సెహ్కెన్ గ్రామానికి సమీపంలో జరిగింది. పెద్ద ఎత్తున ఆయుధాలతో ఉగ్రవాదులు ఈ దాడి జరిపారు. కల్నల్ త్రిపాఠి కాన్వాయ్‌పై అకస్మాత్తుగా కాల్పులు జరపడంతో ఆయనతో పాటు మరో ముగ్గురు క్విక్ రియాక్షన్ టీమ్ జవాన్లు కూడా అక్కడికక్కడే కన్నుమూశారు.