Hyderabad:
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: హైదరాబాద్ నగరంలోని (Hyderabad) షేక్ పేట డివిజన్‌లో ఉన్న విరాట్ నగర్, మినీ బృందావనం , హకీమ్ కాలనీ ప్రజలకు త్వరలోనే ముంపు సమస్య నుంచి శాశ్వత విమక్తి కల్గిస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హామీ ఇచ్చారు.
శుక్రవారం సాయంత్రంషేక్‌పేట్ డివిజన్ విరాట్ నగర్, మిని బృందావనం , హకీమ్ కాలనీలలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంపుకు గురైన ప్రభావిత ప్రాంతాలను మంత్రి , మేయర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. బాధిత ప్రజలతో మాట్లాడారు. త్వరలోనే శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సందర్భంగా మంత్రి, మేయర్ మాట్లాడుతూ ప్రజలు ధైర్యంగా ఉండాలని, ముంపు బాధిత ప్రజలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. శాశ్వత పరిష్కారం కోసం త్వరగా ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి, మేయర్ అధికారులను ఆదేశించారు.
Read Also- Kadiyam Srihari: కడియం రాజీనామాపై పోస్టర్లు.. రఘునాథపల్లిలో రాజుకుంటున్న రాజకీయ చిచ్చు