Kadiyam Srihari: స్టేషన్ ఘన్‌పూర్ లో రాజకీయ చిచ్చు రాజుకుంటుంది. స్టేషన్ ఘన్‌పూర్ (Station Ghanpur) ఎమ్మెల్యే కడియం శ్రీహరి( Kadiyam Srihari) రాజీనామా చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ వాల్‌పోస్టర్లు వేయడం రఘునాథపల్లిలో రాజకీయ కలకలం రేగుతుంది. శుక్రవారం స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ పరిధిలోని రఘునాథపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మాజీ ఎంపీపీ వై. కుమార్ గౌడ్, జిల్లా నాయకుడు గూడ కిరణ్‌ల నేతృత్వంలో కడియం శ్రీహరి రాజీనామాను డిమాండ్ చేస్తూ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించి, గ్రామాల్లో గోడలపైన అతికించారు. పోస్టర్ లో కడియం గారు నీ రాజీనామా ఎప్పుడు..? అంటూ విద్యావేత్త, నీతి, నిజాయితీకి మారుపేరుగా చెప్పుకుంటున్న కడియం గారు స్టేషన్ ఘన్‌పూర్ భారత రాష్ట్ర సమితి కార్యకర్తల కష్టంతో ఎమ్మెల్యేగా గెలిచిన పదవికి నిజంగా మీరు ఉమ్మడి వరంగల్ సీనియర్ నాయకులు అయితే భారత రాజ్యాంగం పట్ల న్యాయస్థానాలు, స్పీకర్ గారి ఆదేశాల పట్ల మీకు ఏమాత్రం గౌరవం ఉన్న తక్షణమే మీ పదవికి రాజీనామా చేసి మీ నిజాయితిని ప్రజాక్షేత్రంలో నిరూపించుకోగలరు.
Also Read: Sharwanand: కాపురంలో కలహాలు.. శర్వానంద్ జంట విడాకులు తీసుకుంటున్నారా?
శ్రీహరిపై వేసిన ఈ పోస్టర్లతో రాజకీయ వేడి
భారత రాష్ట్ర సమితి, రఘునాథపల్లి మండలం అని పోస్టర్ ను ఆవిష్కరించారు. పోస్టర్ లో ప్రముఖంగా సీఎం రేవంత్‌రెడ్డిని కడియం శ్రీహరి ఆలింగనం చేసుకున్న ఫోటోను, కడియం ఫోటోను ముద్రించారు. ఇప్పుడు ఈ పోస్టర్ సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతుంది. కడియం శ్రీహరిపై వేసిన ఈ పోస్టర్లతో రాజకీయ వేడి రగులుకుంది. ఈ సందర్భంగా కుమార్ గౌడ్ మాట్లాడుతూ కడియం శ్రీహరి బీ ఆర్ ఎస్ కార్యకర్తల చెమట కష్టం వల్ల ఎమ్మెల్యే పదవి దక్కించుకున్నారు, ఆ పదవికి రాజీనామా చేసి ఏ పార్టీ నుంచి పోటీ చేసినా మాకు పర్వాలేదు అని డిమాండ్ చేశారు.
రాజీనామా చేయించాలనే ప్రచారం
ప్రజల సమస్యలను విస్మరిస్తూ వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. ప్రజలు ఇలాంటి రాజకీయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరని అన్నారు. ఒక ఎమ్మెల్యేను రాజీనామా చేయించాలనే తలంపుతో ఈ ఎత్తుగడ వేసినట్లు ప్రచారం జరుగుతుంది. కడియం శ్రీహరి వ్యవహారం ఇప్పుడు స్పీకర్ వద్ద ఉంది. బీ ఆర్ ఎస్ నాయకులు కడియం శ్రీహరిని మానసికంగా దెబ్బతీయాలనే సంకల్పంతో ఇలా పోస్టర్ల రాజకీయానికి తెరలేపారని కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఈ పోస్టర్ల రాజకీయం ఎటువైపు దారి తీస్తుందో అంతు చిక్కడం లేదు.