Sukumar Writings
ఎంటర్‌టైన్మెంట్

Sukumar Writings: సుకుమార్‌ రైటింగ్స్‌కు పది వసంతాలు.. సక్సెస్ రేట్ ఎంతో తెలుసా?

Sukumar Writings: దర్శకుడిగా సుకుమార్ (Sukumar) బ్రాండ్ ఏంటో అందరికీ తెలుసు. హీరోయిజానికి సరికొత్త నిర్వచనాన్ని ఇస్తూ.. రా అండ్ రస్టిక్ పాత్రలతో సంచలనాలను క్రియేట్ చేస్తున్నారు. ఆయన మార్క్‌తో హీరోలలో కూడా భారీ ఛేంజ్ కనబడుతోంది. ‘పుష్ప’ ఫ్రాంచైజ్ చిత్రాలతో ‘ఆల్ టైమ్ ఇండియన్ ఇండస్ట్రీ హిట్’ స్థాయిని అందుకున్న సుకుమార్, తెలుగు రాష్ట్రాలకే కాకుండా జాతీయ స్థాయిలో కూడా కల్ట్ ఫిల్మ్ మేకర్‌గా గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఇక తెలుగు ప్రేక్షకుల దృష్టిలో సుకుమార్ స్థాయి బాక్సాఫీస్ విజయాలకు, స్టార్‌డమ్‌కు మించి ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఒకవైపు స్టార్‌ హీరోలను డైరెక్ట్ చేస్తూనే.. మరో వైపు సుకుమార్‌ రైటింగ్స్‌ (Sukumar Writings) బ్యానర్‌‌పై క్రేజీ పాన్‌ ఇండియా చిత్రాలను, కొత్తదనం నిండిన వైవిధ్యమైన చిత్రాలను అందించడంలో ఆయన ముందంజలో ఉన్నారు. ఆయన స్థాపించిన సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ సక్సెస్ ఫుల్ చిత్రాలతో విజయవంతంగా పది వసంతాలు పూర్తి చేసుకుంది.

Also Read- Kantara Chapter 1: ‘ఓజీ’ ట్రీట్ అయిన వెంటనే ‘కాంతార 2’ ట్రీట్.. ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది

బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలే..

తన దగ్గర పని చేసిన అసిస్టెంట్స్‌‌‌కు డైరెక్షన్ అవకాశం ఇచ్చి, వారి భవిష్యత్‌కు ఓ బాట వేసే క్రమంలో.. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌ను స్థాపించారు. ఈ బ్యానర్‌లో ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలను గమనిస్తే, ఆయన శిష్యులు దర్శకులుగా మారి రూపొందించిన సినిమాలే ఎక్కువ ఉండటం విశేషం. ఈ పది వసంతాల కాలంలో సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్ నుంచి.. ‘కుమారి 21F, ఉప్పెన, విరూపాక్ష, 18 పేజెస్, పుష్ప-2, గాంధీ తాత చెట్టు’ వంటి చిత్రాలు వచ్చాయి. అగ్ర నిర్మాణ సంస్థలతో కలిసి నిర్మాణ భాగస్వామ్యం పంచుకుని సుకుమార్ తన సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై ఈ సినిమాలను రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన బ్యానర్‌లో వచ్చిన చిత్రాల సక్సెస్ రేట్‌ని గమనిస్తే.. ఒక్క ‘18 పేజెస్’ సినిమానే కాస్త నిరాశ పరిచింది. మిగతా అన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసినవే. ఈ సినిమాలు కొత్త ప్రతిభను పరిచయం చేయడంతో పాటు, తెలుగు సినిమాకు కొత్త ఊపును ఇచ్చాయని చెప్పుకోవచ్చు. ఈ ప్రయాణంలో ఈ బ్యానర్‌కు అత్యంత ప్రతిష్టాత్మక సక్సెస్‌ను ఇచ్చిన చిత్రంగా నిలిచింది ‘పుష్ప 2: ది రూల్’ (Pushpa 2: The Rule) చిత్రం. ఈ సినిమా భారతదేశం మొత్తంలోనే కాకుండా.. విదేశాల్లో కూడా రికార్డులు క్రియేట్ చేసింది. ఇది సుకుమార్ సృజనాత్మకతను, సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్‌ నిర్మాణ విలువలను కూడా చాటి చెప్పింది.

Also Read- Sharwanand: కాపురంలో కలహాలు.. శర్వానంద్ జంట విడాకులు తీసుకుంటున్నారా?

ఆరు స్క్రిప్టులు సిద్ధం

ఇప్పుడీ బ్యానర్‌లో భారతదేశం అంతా ఎదురు చూస్తున్న ప్రాజెక్టులలో ఒకటైన ‘పెద్ది’ (Peddi) సినిమా నిర్మాణం జరుపుకుంటోంది. గోబ్లల్‌ స్టార్‌ రామ్ చరణ్ (Global Star Ram Charan) హీరోగా బుచ్చిబాబు సానా (సుకుమార్ శిష్యుడు) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే, యువ సామ్రాట్‌ నాగచైతన్య హీరోగా దర్శకుడు కార్తీక్ దండు (సుకుమార్ శిష్యుడు) రూపొందిస్తున్న తాజా చిత్రంలో కూడా సుకుమార్‌ రైటింగ్స్‌ భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోంది. ఇవి కాకుండా, ఇంకా ఆరు స్క్రిప్టులు నిర్మాణానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలు సుకుమార్‌ రైటింగ్స్‌పై తెరకెక్కడానికి సిద్దంగా ఉన్నాయని, ఈ ఆరు కథలు దేశవ్యాప్తంగా ప్రభావం చూపగల సామర్థ్యం కలిగి ఉన్నాయని పేర్కొంటున్నారు. త్వరలోనే వాటి వివరాలను సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ అధికారికంగా ప్రకటించనుందనేలా టాక్ వినబడుతోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Pawan Kalyan thanks: వారికి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్.. ప్రత్యేకించి అభిమానులకు అయితే..

OG Concert: ‘ఓజీ’ సినిమాలో హీరో తాను కాదంటూ బాంబ్ పేల్చిన పవన్.. ఇంతకూ వారు ఎవరంటే?

Ind Vs Pak: కీలక క్యాచ్‌లు నేలపాలు.. టీమిండియా ముందు భారీ టార్గెట్

BRS women wing: బీఆర్ఎస్ మహిళా విభాగ అధ్యక్షురాలి పదవి ఎవరికి?

OTT movie review: పేరెంట్స్ అలా చేయడంతో దానికి రెడీ అయిన స్టూడెంట్.. ఏం చేసిందంటే?