Kantara Chapter 1
ఎంటర్‌టైన్మెంట్

Kantara Chapter 1: ‘ఓజీ’ ట్రీట్ అయిన వెంటనే ‘కాంతార 2’ ట్రీట్.. ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది

Kantara Chapter 1: రిషబ్ శెట్టి (Rishab Shetty) హీరోగా నటిస్తున్న ‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter1) చిత్ర ట్రైలర్‌ విడుదలకు సంబంధించిన అప్డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ అప్టేడ్ ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న హైఓల్టేజ్ యాక్షన్ చిత్రం ‘ఓజీ’ (Pawan Kalyan OG) ట్రైలర్ విడుదలైన మరుసటి రోజే.. ‘కాంతార చాప్టర్ 1’ ట్రైలర్ ట్రీట్ ఇవ్వబోతుంది. 2022లో అతి తక్కువ బడ్జెట్‌తో నిర్మితమైన ‘కాంతార’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పాన్-ఇండియా లెవెల్లో భారీగా విజయం సాధించి, కొత్త బెంచ్‌మార్క్స్‌ను క్రియేట్ చేసింది. హోంబలే ఫిలింస్‌ బ్యానర్‌కి ఈ సినిమా గ్రేట్ మైల్ స్టోన్‌గా నిలిచింది. ఇప్పుడదే సినిమాకి ప్రీక్వెల్‌గా రాబోతున్న ‘కాంతార: చాప్టర్ 1’ పై ఆకాశమే అవధి అన్నట్లుగా భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను డబుల్ చేసేలా ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ హైప్ పెంచుతూ వస్తుంది. తాజాగా మేకర్స్ ట్రైలర్ విడుదల తేదీని, సమయాన్ని అధికారికంగా ప్రకటించారు.

Also Read- Vijay Deverakonda: ఎవరి సలహాలు వినాల్సిన పనిలేదు.. బండ్లకు కౌంటర్! ఇదెలా మిస్సయ్యారు?

‘కాంతార: ఛాప్టర్ 1’ ట్రైలర్ రిలీజ్ డేట్ అండ్ టైమ్

పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా ట్రైలర్ (OG Trailer Release Date) సెప్టెంబర్ 21 ఉదయం 10 గంటల 08 నిమిషాలకు విడుదల కాబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. ‘ఓజీ’ ట్రైలర్ విడుదలైన ఒక రోజు అనంతరం అంటే, 22 సెప్టెంబర్ 2025, మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు ‘కాంతార: చాప్టర్ 1’ ట్రైలర్‌ (Kantara Chapter1 Trailer Release Date)ను విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ.. ఓ పవర్ ఫుల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో హీరో రిషబ్ శెట్టి డోలు వాయిస్తూ, భక్తిలో లీనమయ్యారు. ఈ పిక్ చూస్తుంటే అక్కడ జాతర జరుగుతున్నట్లుగా అర్థమవుతోంది. జనాలందరూ గుంపుగా నిలబడి రిషబ్ శెట్టి విన్యాసాన్ని తీక్షణంగా చూస్తున్నారు. ఇప్పుడీ పిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Also Read- Sharwanand: కాపురంలో కలహాలు.. శర్వానంద్ జంట విడాకులు తీసుకుంటున్నారా?

గ్రేట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేందుకు..

2022లో వచ్చిన మాస్టర్‌పీస్‌ ‘కాంతార’ విజయాన్ని కొనసాగించాలని, ఈ ప్రీక్వెల్‌ను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నిర్మాణంలో హోంబలే ఫిలింస్‌ ఎక్కడా రాజీ పడలేదని తెలుస్తోంది. ఈ చిత్రంలో 500 మంది యోధులు, సుమారు 3,000 మంది ప్రజలు పాల్గొనే ఒక భారీ యుద్ధ సన్నివేశాన్ని రూపొందించారంటే, ఈ సినిమా ఖర్చు విషయంలో నిర్మాతల మైండ్ సెంట్ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. జాతీయ, అంతర్జాతీయ నిపుణుల పర్యవేక్షణలో 25 ఎకరాలలో పట్టణం నిర్మించి, దాదాపు 45–50 రోజులపాటు షూటింగ్ జరిపారు. ఇది భారతీయ సినిమా చరిత్రలోనే అతి పెద్ద సన్నివేశాల్లో ఒకటిగా నిలుస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. ప్రేక్షకులకు గ్రేట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేందుకు నిర్మాణ సంస్థ, హీరో ఎంతగానో శ్రమించినట్లుగా చిత్ర బృందం చెబుతోంది. ఈ సినిమా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా కన్నడతో పాటు హిందీ, తెలుగు, మలయాళం, తమిళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో కూడా రిలీజ్ కాబోతోంది. ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం చేరువ చేయాలని మేకర్స్ ఇలా రిలీజ్‌ని ప్లాన్ చేశారు. ఈ చిత్రానికి బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Pawan Kalyan thanks: వారికి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్.. ప్రత్యేకించి అభిమానులకు అయితే..

OG Concert: ‘ఓజీ’ సినిమాలో హీరో తాను కాదంటూ బాంబ్ పేల్చిన పవన్.. ఇంతకూ వారు ఎవరంటే?

Ind Vs Pak: కీలక క్యాచ్‌లు నేలపాలు.. టీమిండియా ముందు భారీ టార్గెట్

BRS women wing: బీఆర్ఎస్ మహిళా విభాగ అధ్యక్షురాలి పదవి ఎవరికి?

OTT movie review: పేరెంట్స్ అలా చేయడంతో దానికి రెడీ అయిన స్టూడెంట్.. ఏం చేసిందంటే?