Gadwal District (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Gadwal District: గద్వాల జిల్లాలో పత్తి కొనుగోలుకు కొర్రీలు.. ఆందోళనలో రైతన్నలు

Gadwal District: పత్తి కొనుగోళ్లకు పరిమితులు విధిస్తూ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(Cotton Corporation of India)మరో మెలిక పెట్టింది. దీంతో పత్తి రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటివరకు పత్తిలో తేమశాతం విషయంలో రైతుల అభ్యంతరం వ్యక్తం చేస్తూ కనీసం 18% వరకు పరిగణలోకి తీసుకుని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఎకరానికి 12 క్వింటాళ్ల వరకు పత్తిని కొనుగోలు చేసిన సిసిఐ(CCI) ఏకంగా ఈ ఏడాది 5 క్వింటాలని తగ్గిస్తూ ఏడు క్వింటాలను మాత్రమే కొనుగోలు చేసేందుకు నిర్ణయించడం పట్ల ఇటు రైతులు అటు జిన్నింగ్ మిల్లుల కొనుగోలు కేంద్ర నిర్వాహకులు సీసీఐ నిర్ణయం పట్ల ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే 70% పత్తి పంటలు పూర్తికాగా ఇటీవల జోగులాంబ గద్వాల జిల్లాలో ఏర్పాటుచేసిన మూడు కొనుగోలు కేంద్రాలలో పూర్తిస్థాయిలో పత్తి కొనుగోలు ప్రక్రియ చేపట్టలేదు. దీనికి కారణం సిసిఐ కొత్తగా అమలు చేస్తున్న కపాస్ కిసాన్ యాప్(Kapas Kisan App) ద్వారా నమోదుకు తలెత్తుతున్న సమస్యలను అధిగమించేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో రైతులు ఇప్పటికే ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరలకు అమ్ముకొని ఇబ్బందులు పడుతుండగా కనీసం పత్తి కొనుగోలు కేంద్రాలలోనైనా కనీస మద్దతు ధర 8 వేల 110 పొందేందుకు రైతులు ఆసక్తి చూపారు. ఎకరాకు ఆశించిన స్థాయిలో దిగుబడులు రాకపోగా కేవలం వచ్చే ఐదు ఆరు క్వింటాలతో పెట్టుబడులు వెళ్లే పరిస్థితి లేక పత్తి సాగుతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల కారణంగా ఈసారి దిగుబడులు అంతంత మాత్రమే వచ్చాయి. వచ్చిన పంటను సీసీఐలో అమ్ముకునేందుకు రైతులు మొగ్గుచూపుతుండగా వారి కఠిన నిబంధనలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్లాట్ బుక్ చేసుకున్న రైతులు సైతం అయోమయంలో పడ్డారు.

నిరవధిక బందుకు పిలుపు..

సిసిఐ కఠిన నిబంధనలను వ్యతిరేకిస్తూ కొనుగోలు కేంద్రాలు నేటి నుంచి కొనుగోలను నిలిపివేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక బందుకు పిలుపునిచ్చాయి. రైతులు, డీలర్లు ట్రేడర్స్ కి ఆమోదయోగ్యమైన సమస్య పరిష్కారమయ్యే వరకు కాటన్ జిన్నింగ్ మిల్లులకు సహకరించాలని కొనుగోలు కేంద్ర నిర్వాహకులు కోరుతున్నారు.

Also Read: Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. అవినీతి అక్రమాలపై అదనపు ఎస్పీ శంకర్ విచారణ షురూ.. వెలుగులోకి సంచలనాలు

సమన్వయం లోపం..

వ్యవసాయ శాఖ క్రాప్ బుకింగ్ ఆధారంగానే సిసిఐ, మార్క్ ఫెడ్ సంస్థలు పంటలను కొనుగోలు చేస్తాయి ఈ ఏడాది జిల్లాలో 1.87 లక్షల ఎకరాలలో రైతులు పత్తి పంటను సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. పంట లెక్కల ఆధారంగానే ఎకరానికి ఎన్ని క్వింటాళ్ల పత్తి దిగుబడిలో వస్తాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కానీ సిసిఐ అధికారులు మాత్రం ఎకరానికి ఏడు క్వింటాళ్ల పత్తి దిగుబడులను మించే అవకాశం లేదంటూ కొనుగోళ్లకు పరిమితులు విధించారు. దీనికి ప్రధాన కారణం ఆ శాఖల మధ్య సమన్వయలోప కారణంగానే ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయని రైతులు, మిల్లర్లు ఆరోపిస్తున్నారు. సారవంతమైన నల్ల రేగడి నేలల్లో ఎకరానికి గరిష్టంగా 12 క్వింటాల వరకు దిగుబడిలో వస్తాయని రైతులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సిసిఐ ఏడు క్వింటాలనే కొనుగోలు చేస్తే మిగతా 5 క్వింటాళ్లను దళారులకే అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుందని రైతులు వాపోతున్నారు

యాప్ తో తప్పని తిప్పలు

మునుపెన్నడు లేని విధంగా సిసిఐ ఈసారి కొత్తగా కపాస్ కిసాన్ యాప్ ను అమల్లోకి తీసుకొచ్చింది దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పత్తిని విక్రయించేందుకు ముందుగా స్లాట్ బుక్ చేసుకోవడం అలాగే ఎకరానికి 7 క్వింటాళ్లకు పరిమితిని విధించడంతో పత్తిని అమ్ముకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. సాధారణంగా గ్రామాలలో చాలామంది రైతులకు స్మార్ట్ ఫోన్లు అందుబాటులో లేవు దీంతో స్మార్ట్ ఫోన్ ఉన్న రైతులపై ఆధారపడి పంట అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. స్లాట్ సైతం పీఎం కిసాన్ యోజన పథకానికి ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ ఉన్న వివరాళ్లతోనే బుక్ చేసుకోవాలని వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు సూచిస్తున్నారు.

సిసిఐ కొర్రీలతో పత్తి రైతులకు షాక్

ఈ ప్రస్తుత ఖరీఫ్ సీజన్ పత్తి రైతులకు కలిసి రాలేదు. అధిక వర్షాల వల్ల పంట దిగుబడులపై ప్రభావం చూపగా ఇప్పుడిప్పుడే వర్షాల నుంచి బయటపడుతున్న తరుణంలో చేతికొచ్చిన పంటను సీసీఐలో అమ్ముకునేందుకు రైతులు ప్రయత్నిస్తుండగా ఆ సంస్థ సైతం మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే తేమశాతం పేరుతో ధరల్లో భారీ పూతలు విధించడంతో చాలామంది రైతులకు మద్దతు ధర దక్కడం లేదు తాజాగా ఎకరానికి 7 క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేసేందుకు పరిమితులు విధించడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు స్లాట్ బుకింగ్ పేరుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు తెలిపారు.

Also Read: Rail Accident: మరో ఘోర ప్రమాదం.. పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన రైలు.. పలువురు మృతి

Just In

01

Bandla Ganesh: బండ్ల గణేష్ మాటల వెనుకున్న మర్మమేంటి? ఎందుకిలా మాట్లాడుతున్నాడు?

Deputy CM: వరల్డ్ క్లాస్ ఫిలిం సిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం.. ‘మా’ బిల్డింగ్‌కు స్థలం కూడా మేమే ఇస్తాం!

CM Revanth Reddy: షేక్‌పేట డివిజన్ రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్..!

Roja: 90స్ క్వీన్ రీ ఎంట్రీ.. 12 ఏళ్ల తర్వాత ‘సంతానం’గా రోజా!

Khammam District: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. ఆర్టీసీ అద్దె బస్సులో అకస్మాత్తుగా పొగలు.. భయంతో జనం పరుగులు