Swetcha Effect (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ, సూపర్ ఎక్స్‌క్లూజివ్

Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. అవినీతి అక్రమాలపై అదనపు ఎస్పీ శంకర్ విచారణ షురూ.. వెలుగులోకి సంచలనాలు

Swetcha Effect: జోగులాంబ గద్వాల జిల్లా కేటి దొడ్డి మండల పోలీస్ స్టేషన్(KT Doddi Police Station) లో అవినీతి అక్రమాలపై వస్తున్న ఆరోపణలపై జిల్లా పోలీస్ బాస్ పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించారు. ఇటీవల మండలంలో జరిగిన పాగుంట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగిన జాతరలో చిన్నచిన్న దుకాణ దారుల నుంచి అక్రమ వసూళ్లకు మండల పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్పడిందని ఆరోపణలు పెద్ద ఎత్తున రావడంతో ఎస్సై బిజ్జ శ్రీనివాస్(SI Bijja Srinivas), కానిస్టేబుల్ రజిని బాబు(Constable Rajini Babu)ను విఆర్ కు అటాచ్ చేశారు. తాజాగా గద్వాల సర్కిల్ ఆఫీస్ పాత్ర పై సైతం ఆరోపణలు రావడంతో సమగ్ర విచారణకు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు(SP Srinivasa Rao) జిల్లా అదనపు ఎస్పీ శంకర్ కు అప్పజెప్పారు.


వసూళ్ల బాగోతంపై చర్చ..

ఈ ఉదంతం నేపథ్యంలో పోలీసుశాఖలో పెరిగిపోతున్న అడ్డగోలు వసూళ్ల బాగోతంపై చర్చ ప్రారంభమైంది. ముఖ్యంగా భూవివాదాల పంచాయితీలు, కేసులపై పారదర్శకత లేకపోవడం, ఇసుక ఇటుక అక్రమ రవాణాకు అక్రమ వసుళ్ళకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో జిల్లా ఎస్పీ ఇతర అధికారుల పాత్ర పైన సైతం విచారణకు ఆదేశించారు. ఈ అంతర్గత విచారణలో తేలే ఆధారాల ఆధారంగా పోస్టులలో మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కేటి దొడ్డి మండల పోలీస్ స్టేషన్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ఇటీవల స్వేచ్ఛ ప్రత్యేక కథనాన్ని ఇచ్చింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ పూర్తిస్థాయిలో అంతర్గత విచారణకు జిల్లా అదనపు ఎస్పీ శంకర్ కు అప్పజెప్పారు.

Also Read: Road Accidents Report: ఏపీలో 20 వేల రోడ్డు ప్రమాదాలు.. 8 వేల మరణాలు.. వెలుగులోకి సంచలన రిపోర్ట్


చిరు వ్యాపారులను సైతం వదలని వైనం..

పాగుంట(Pagunta) జాతరలో జీవనోపాధి కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న దుకాణాలదారులను సైతం వదలలేదు. ప్రతి దుకాణం నుంచి అక్రమంగా సిబ్బంది వసూలు చేశారనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ మండల పి.ఎస్ కానిస్టేబుల్ ను ఏ. ఆర్ కు అటాచ్ చేశారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది.

కానిస్టేబుల్ సెల్ఫీ వీడియో కలకలం

జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District) కేటి దొడ్డి మండలం పాగుంట వెంకటేశ్వర స్వామి జాతర(Lord Venkateswara Swamy Fair) సందర్భంగా అక్రమ వసూళ్లలో ఓ కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవడంతో మనస్థాపం చెందిన ఆ కానిస్టేబుల్ ఈ వ్యవహారంలో ఎస్సై సైతం ఉన్నారని తనని ఒక్కడిని బలిపశువును చేశారని, తన బదిలీని ఆ ఎస్ఐ ఆపకపోతే పోలీస్ స్టేషన్లో జరిగే ప్రతి అక్రమ వసూళ్ల చిట్టాను మొత్తం బయట పెడతానని, తిరిగి అదే పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని తన తల్లిదండ్రులకు తెలుపుతూ ఓ సెల్ఫీ వీడియో రికార్డ్(Selfie video record) చేసి మండల పోలీస్ వాట్సాప్ గ్రూపు(WhatsApp group)లో పెట్టాడు. దీంతో బెంబేలెత్తిన ఆ గ్రూప్ సిబ్బంది.. వ్యవహారం జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరడంతో జిల్లా ఎస్పి శ్రీనివాసరావు(SP Srinivasa Rao) ఎస్సై(SI) పై విచారణ జరిపి జిల్లా సాయుధ దళ కార్యాలయానికి అటాచ్ చేశారు. తాజాగా మరికొందరి ఉన్నతాధికారుల పాత్రపై సైతం విచారణ చేపట్టి నివేదికను ఎస్పీకి సమర్పించనున్నారు. ఈ మేరకు అక్రమాలకు పాల్పడ్డ వారిపై తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది.

Also Read: Huzurabad News: అమెరికా వేదికపై.. హుజురాబాద్ బాలిక నృత్య ప్రదర్శన

Just In

01

Wife Shocking Plot: కట్టుకున్న భర్తనే కిడ్నాప్ చేయించింది.. దర్యాప్తులో నమ్మలేని నిజాలు

Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. అవినీతి అక్రమాలపై అదనపు ఎస్పీ శంకర్ విచారణ షురూ.. వెలుగులోకి సంచలనాలు

Revanth Reddy: ఈ నెల 11 లోగా కేసీఆర్‌ను అరెస్ట్ చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Tandur Protest: తాండూర్‌లో హైటెన్షన్.. పార్టీలకు అతీతంగా భారీగా కదిలొచ్చిన నేతలు..?

Baahubali rocket: ‘బాహుబలి’ సినిమా మాత్రమే కాదు.. తెలుగు ప్రజల గౌరవం..