Huzurabad News: హుజురాబాద్ పట్టణానికి చెందిన తొమ్మిదేళ్ల బాలిక అన్విత(Anvita) ప్రతిభకు అంతర్జాతీయ వేదికను అందించింది. అన్విత ప్రదర్శనలో భాగస్వామ్యం కావడం తెలుగువారికి, హుజురాబాద్(Huzurabad) వాసులకు గర్వకారణం అని స్థానికులు అభినందిస్తున్నారు. అమెరికా(USA)లో ప్రదర్శితమవుతున్న ‘చెంచులక్ష్మి’ నృత్య నాటిక, కేవలం సాంస్కృతిక వైభవాన్ని చాటడంతో పాటు హుజురాబాద్ ప్రతిభను అమెరికా అమెరికా వేదికపై ఆవిష్కరించింది అంటూ స్థానికులు అభినందిస్తున్నారు. నటరాజ నాట్యాంజలి కూచిపూడి డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో జార్జియాలోని కమ్మింగ్ నగరంలో జరిగిన ‘చెంచులక్ష్మి’ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ అద్భుత ఆధ్యాత్మిక నాటికలో ప్రముఖ న్యాయవాది పత్తి వాసుదేవరెడ్డి మనుమరాలు, గాడిపల్లి సాయిలీల కూతురు అయిన అన్విత తన నృత్య ప్రతిభను ప్రదర్శించింది.
ప్రముఖ నృత్య కళాకారుల
తొమ్మిదేళ్ల చిన్నారి అన్విత ప్రముఖ నృత్య కళాకారుల మధ్య తన స్థానాన్ని నిలబెట్టుకొని, తాళం, లయ, అభినయంతో ప్రేక్షకులను మెప్పించింది. నరసింహ స్వామి, లక్ష్మీ దేవి వృత్తాంతంగా సాగిన ఈ ప్రేమ, ఆధ్యాత్మిక గాథలో అన్విత పాత్ర మెచ్చుకోదగినదిగా నిలిచింది. నీలిమ గడ్డమనుగు అద్భుత దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ ప్రదర్శనలో పాల్గొనడం ద్వారా, అన్విత బాల్యం నుంచే తన కళాభిరుచిని, ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో నిరూపించుకుంది.
భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా..
కళను విద్యాసేవతో సమ్మిళితం చేస్తూ విద్యార్థుల భవిష్యత్తు కోసం నిధులు సమీకరించే ఈ కార్యక్రమంలో అన్విత భాగస్వామి కావడంపట్ల హుజురాబాద్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా అన్వితను చిన్నారి తల్లిదండ్రులను, ప్రదర్శన నిర్వాహకులను పలువురు హుజురాబాద్ ప్రముఖులు అభినందించారు. అమెరికా వేదికపై తెలుగు సంస్కృతిని, కూచిపూడి కళను ప్రదర్శించిన అన్విత, నేటి తరానికి కళాభిమానాన్ని, వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలనే స్ఫూర్తిని ఇస్తుందని ప్రముఖులు కొనియాడుతున్నారు.
Also Read: Free ChatGPT: ఉచితంగా చాట్‌జీపీటీ సబ్‌స్క్రిప్షన్.. ఆశ్చర్యపరిచే నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే!
