Mahabubabad district: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సిసి కెమెరాల నిఘా విస్తృతం చేయనున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న చోరీలను అరికట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ కోసం జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆధ్వర్యంలో డిఎస్పి ఎన్.తిరుపతిరావు నేతృత్వంలో టౌన్ సిఐ మహేందర్ రెడ్డి పర్యవేక్షణలో పట్టణంలో నిఘా సాధించనున్నారు. ఓవైపు సిసి కెమెరాల రూపంలో మరోవైపు పోలీస్ బలగాల పటిష్ట చర్యలు, గస్తీలు, పెట్రోలింగులు నిర్వహిస్తూ అక్రమ వ్యాపారాలు, అసాంఘిక కార్యకలాపాలు, చోరీలు జరగకుండా ప్రత్యేక ఫోకస్ పెట్టారు.
ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా పటిష్ఠ చర్యలు
మహబూబాబాద్ పట్టణంలో వాహనాల సంఖ్య పెరగడంతో ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతుండడంతో చాలా రకాలుగా ట్రాఫిక్(Traffic) ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటన్నింటిని అధిగమించేందుకు నూతనంగా టౌన్ సిఐగా బాధ్యతలు చేపట్టిన మహేందర్ రెడ్డి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అందుకు తగ్గ విధులను పోలీసు అధికారులు, సిబ్బందికి అప్పగించి సూచనలు చేస్తున్నారు. వివిధ రకాల షాపుల వద్ద కొనుగోలు చేసే సమయంలో వాహనాలు సరైన రీతిలో పార్కింగ్ చేసుకునేలా పోలీస్ సిబ్బందితో అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా సెల్లార్లు ఉన్న వాహన సముదాయాల ప్రాంతంలో వాహనాలను సెల్లర్లలోనే పార్కింగ్ చేసుకునేలా సూచనలు చేస్తున్నారు. పోలీసు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వాహనదారుల జేబుకు చిల్లులు పడడంతో పాటు జైలుకు సైతం పంపించేందుకు పోలీస్ అధికారులు వెనుకాడడం లేదు.
Also Read: Telangana: దివ్యాంగుల సంక్షేమం.. సర్కారు సరికొత్త వ్యూహం
చోరీలపై ప్రత్యేక ఫోకస్
మహబూబాబాద్(Mehabubabad) జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాల్లో చోరీల లొల్లి ఇటీవల కాలంలో ఎక్కువైపోయింది. దీన్ని అరికట్టేందుకు జిల్లా పోలీస్ బాస్ సుధీర్ రామ్నాథ్ కేకన్ సరైన విధి విధానాలతో ముందుకు సాగుతున్నారు. అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ చోరీలను అరికట్టేందుకు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా బిజీగా ఉన్న పట్టణ ప్రధాన కూడలలో సీసీ కెమెరాలు(CC Camera) అమర్చి చోరీల నియంత్రణకు చర్యలు చేపడుతున్నారు.
అక్రమ రవాణాలపై ఉక్కు పాదం
మహబూబాబాద్ జిల్లా అంటేనే అక్రమ రవాణాకు అడ్డాగా పేరుగాంచింది. ఇక్కడ విధులు నిర్వహించాలంటే అధికారులకు “కత్తి మీద సాము” అనే విధంగా ఉంటుంది. అయితే నూతనంగా మహబూబాబాద్ టౌన్ సిఐ గా బాధ్యతలు చేపట్టిన మహేందర్ రెడ్డి కి ఇవన్నీ సవాళ్లుగా సిద్ధంగా ఉన్నాయి. వీటన్నింటిని అరికట్టి తన స్టైల్ లో ముందుకు సాగుతూ అక్రమ రవాణా వ్యాపారాలను అధిగమిస్తూ తన మార్కు చూపుతాడా పట్టణ ప్రజలు ఎదురుచూస్తున్నారు.
ముఖ్యంగా నాలుగు జిల్లాలకు అనుసంధానంగా ఉన్న మహబూబాబాద్ నుంచి తొర్రూరు, మహబూబాబాద్ నుంచి మరిపెడ, మహబూబాబాద్ నుంచి ఇల్లందు, మహబూబాబాద్ నుంచి నర్సంపేట వంటి ప్రధాన రహదారులు మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి ఉండడంతో ఇక్కడ అత్యధికంగా అక్రమ రవాణాకు అవకాశం గా ఉంటుంది. అంతేకాకుండా అసాంఘిక కార్యకలాపాలు కూడా ఇక్కడ ఎక్కువగానే ఉంటాయి. ఈ అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ వ్యాపారాలు, నిత్యం ఏదోచోట చోరీ జరిగే వాటన్నింటినీ అరికట్టాల్సిన బాధ్యత మహబూబాబాద్ పోలీస్(Mehabubabad Police) అధికార యంత్రం గానికి ఉంది.
Also Read: Samantha vs Sobhita: అక్కినేని కోడలు వర్సెస్ సమంత రూత్ ప్రభు.. నెటిజన్లు షాకింగ్ కామెంట్స్!
గంజాయి రవాణా, సేవించడం పోలీసులకు కొరకరాని కొయ్య
గత కోవిడ్(Covid) సమయం అంటే 2020 నుంచి మహబూబాబాద్ జిల్లా కేంద్రం, ఆ తర్వాత మండల కేంద్రాలకు సైతం గంజాయి సేవించడం పాకింది. అప్పట్లో బీటెక్,(B-Tec) ఉన్నత నగరాలు ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు మహబూబాబాద్ పట్టణానికి వచ్చిన సమయంలో గంజాయి సేవించడం పెరిగిపోయింది. తమ ఇంటి చుట్టుపక్కల ఉన్న పదవ తరగతి, ఇంటర్ చదివే పిల్లలకు ఉన్నత నగరాల్లో చదువుకునే విద్యార్థులు మహబూబాబాద్ లో చదువుకునే వారికి గంజాయి రుచి చూపించారు.
విద్యార్థులకు చాటుగా
అప్పుడు అడపాదడపా గంజాయి సేవించే విద్యార్థులు… నేడు ఎక్కడా చూసిన గంజాయి సేవించే విద్యార్థులు నిత్య కృత్యంగా కనిపిస్తున్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్(Andhrapradesh) రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి గంజాయిని అటు రైలు మార్గాలు ఇటు కార్లు,(Car) ద్విచక్ర వాహనాలపై కూడా గంజాయిని రవాణా చేస్తూ ఇక్కడ విద్యను అభ్యసించే విద్యార్థులకు చాటుగా విక్రయిస్తున్నారు. దీంతో గంజాయి మత్తులో యువత చిత్తవుతూ తమ కుటుంబాలకు తీరని శోకాన్ని బాధలను తెచ్చి పెడుతున్నారు.
Also Read: Gold Rate Today: వీకెండ్‌లో ఝలక్ ఇచ్చిన పసిడి.. భారీగా పెరిగిన ధరలు.. ఎంతంటే?
ఇప్పుడు ఇదే విషయం పోలీసులకు కొరకరాని కొయ్యగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్ఫోర్స్మెంట్ దాడులు నిర్వహిస్తున్నప్పటికీ మహబూబాబాద్ సహా పలు ప్రాంతాల్లో గంజాయి రవాణా సాగుతూనే ఉంది. చాప కింద నీరుల గంజాయి పాకిపోయి విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తుంది.