TG GOVT
తెలంగాణ

Telangana: దివ్యాంగుల సంక్షేమం.. సర్కారు సరికొత్త వ్యూహం

Telangana: దివ్యాంగుల సంక్షేమంలో ప్రభుత్వం మరో కీలక స్టెప్ తీసుకున్నది. 2367 స్వయం సహాయక సంఘాల ఉపాధి కల్పనకు శ్రీకారం చుట్టింది. దీంతో సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 23 వేల మంది దివ్యాంగులకు లబ్ధి జరగనున్నది. ఈ మేరకు ప్రభుత్వం ఈ ఏడాది కొరకు ఏకంగా రూ.3.55 కోట్లను రిలీజ్ చేసింది. ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్​ ప్రమాణ స్వీకారం తర్వాత మొదటగా ఈ ఫైల్ పైనే సంతకం పెట్టారు. దీంతో ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న దివ్యాంగుల కమ్యూనిటీ ఉపాధికి ప్రభుత్వం చేయుతనిచ్చింది. ఈ నూతన విధానం దేశంలో ఎక్కడా లేదని ప్రభుత్వం చెబుతున్నది. ఇటీవల రాజీవ్ యువ వికాసం స్కీమ్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీల్లోని పేద వర్గాలకు ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం ప్రాసెస్ మొదలు పెట్టింది. మహిళా సంఘాలకూ ప్రత్యేక రాయితీలతో వ్యాపారాలు ప్రారంభించేందుకు సర్కార్ అండగా నిలిచింది. దీంతో తమ కమ్యూనిటీకి కూడా ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం ప్లాన్ చేయాలని దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య కోరారు. దీన్ని పరిశీలించిన సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, ఇందుకు సంబంధించిన ఫైల్ మంత్రి చేతుల మీదుగా ముందుకు కదలడం గమనార్హం.

ఒక్కో గ్రూప్‌లో 10 నుంచి 15 మంది?

దివ్యాంగుల స్వయం సహాయక ఒక్కో సంఘంలో 10 నుంచి 15 మందిని ఎంపిక చేయనున్నారు. ఒకే జిల్లా, మండలం, రెవెన్యూ డివిజన్, నియోజకవర్గాలు ఆధారంగా టీమ్ సెలక్షన్ జరగనున్నది. జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎంపికలు జరుగుతాయి. ఇలా ఒక్కో టీమ్‌తో ఉన్నతాధికారులు ఇండివిడ్యువల్‌గా రివ్యూలు చేయనున్నారు. ఉపాధి కోసం ఏం వ్యాపారం బాగుంటుంది? టీమ్ అందరికీ అనువుగా ఉండేవి ఏమిటీ? ఎంత బడ్జెట్‌లో నిర్వహించగలుగుతారు? ప్రభుత్వం నుంచి ఎలాంటి సపోర్టు భావిస్తున్నారు? తదితర అంశాలపై సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తారు. ఆ తర్వాత ఉమ్మడి జిల్లాల వారీగా కో ఆర్డినేషన్ కోసం ప్రత్యేక ఆఫీసర్లను కేటాయించనున్నారు. వీళ్లంతా ఆయా పథకం లాంచింగ్, కొనసాగుతున్న విధానం తదితర వాటిపై దృష్టి పెట్టనున్నారు.

Read Also- Commissioner Karnan: జీహెచ్ఎంసీలో తగ్గనున్న.. అదనపు కమిషనర్ల సంఖ్య

చిన్న తరహా పరిశ్రమలకు ప్రయారిటీ ?

తొలి దశలో చిన్న తరహా వ్యాపారాలు, కుటీర పరిశ్రమలకు ప్రభుత్వం అవకాశం కల్పించనున్నది. ఎలాంటి పరిశ్రమలు కేటాయించాలి? ఎక్కువ లబ్ధి జరిగే వ్యాపారాలు ఏమిటీ? అనే అంశాలపై ఆఫీసర్ల బృందం స్టడీ చేస్తున్నది. అర్బన్, రూరల్‌లో వేర్వేరుగా అధ్యయనం చేయనున్నారు. దీంతో పాటు ఏపీ, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో అత్యధిక సంఖ్యలో లబ్ధి జరుగుతున్న చిన్న తరహా పరిశ్రమలు ఏమిటీ? అనే దానిపై కూడా అధికారులు ఆరా తీయనున్నారు. వీటన్నింటిని పరిశీలించిన తర్వాత ప్రభుత్వం యూనిట్ల వివరాలను ప్రకటించనున్నది.

Read Also- Phone Tapping Case: ప్రభాకర్ రావుకు ఇంకా రాచమర్యాదలేంది.. బండి ఫైర్!

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?