Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్(Phone Tapping)తో అనేక మంది జీవితాలను కేసీఆర్(KCR) నాశనం చేశారని, ఈ ట్యాపింగ్ సిరిసిల్ల కేంద్రంగానే జరిగిందని, దీనివెనుక ఎవరున్నారో ప్రజలందరికీ తెలుసని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాల్లో(International Yoga Day) పాల్గొనేందుకు ఉదయం కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియానికి విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ పై కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS) పార్టీల తీరుపై నిప్పులు చెరిగారు. అనేక మంది ఉసురు పోసుకున్న దుర్మార్గుడు ప్రభాకర్ రావు(Prabhakar Rao) అని, తనతో సహా బీజేపీ నేతలందరీ ఫోన్లను ట్యాప్ చేసిన నీచుడు ప్రభాకర్ రావు అని ఫైరయ్యారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy), ఉత్తమ్(Uttam) తోపాటు జడ్జీలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారన్నారు.
కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పంద
అనుమానం పుట్టినాకే కేసీఆర్(KCR) పుట్టారని, అందుకే సొంత పార్టీ నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్(Congress) కూడా ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ(CBI) విచారణ జరపాలని డిమాండ్ చేసిందని, కేసీఆర్ చెబితేనే ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) చేశామని ఏసీబీ రాధాకిషన్ రావు(Radha Kishan Rag) వాంగ్మూలమిచ్చినా కేసీఆర్(KCR) కు ఎందుకు నోటీసులివ్వలేదని బండి ప్రశ్నించారు. కేసీఆర్ కు, కేటీఆర్ కు నోటీసులివ్వడానికి ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ మధ్య ఉన్న రహస్య ఒప్పందమేంటని సంజయ్ నిలదీశారు.
తనపై కేసీఆర్ ప్రభుత్వం 109 కేసులు పెట్టిందని, సీఎం ఆఫీస్ ను అడ్డాగా చేసుకుని తాము ఫోన్లో మాట్లాడుకునే విషయాలన్నీ విన్న నీచుడు ప్రభాకర్ రావు అని దుయ్యబట్టారు. ప్రభాకర్ రావుకు ఇకనైనా రాచ మర్యాదలు చేయడం ప్రభుత్వం మానుకోవాలని బండి సూచించారు. ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడని తాను 100 సార్లు చెప్పానని, టెన్త్ హిందీ పేపర్ లీక్(Paper Leek) పేరుతో అర్ధరాత్రి ఇంట్లోకి వచ్చి తాను నైట్ డ్రెస్ తో ఉన్నానని తెలిసినా ప్రభాకర్ రావు ఆదేశాలతోనే తనను అరెస్ట్ చేశారని సంజయ్ వెల్లడించారు. ప్రభాకర్ రావుతో పోలీసులు ఇదే విషయంపై ఫోన్ లో మాట్లాడుతుంటే స్వయంగా తానే విన్నానని బండి తెలిపారు.
Also Read: Bhatti Vikramarka: అభివృద్ధికి కొత్త నిర్వచనం తెలంగాణ.. డిప్యూటీ సీఎం
కేటీఆర్ యూఎస్ వెళ్లింది నిజం కాదా
కేసీఆర్(KCR) పాలనలో మీడియా సహా అందరి ఫోన్లను ట్యాప్ చేశారని, జర్నలిస్టులు(Journalist) సైతం వాట్సాప్, ఫేస్ టైం, సిగ్నల్ ద్వారా మాట్లాడుకునే దుస్థితి తీసుకొచ్చారన్నారు. వాట్సాప్ కాల్ ను కూడా ట్యాప్ చేసిన మూర్ఖుడు ప్రభాకర్ రావు అంటూ బండి ధ్వజమెత్తారు. కేసీఆర్, కేటీఆర్ ను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని విమర్శలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందని ఆయన ఆరోపించారు. అందుకే కేసీఆర్, కేటీఆర్ నోటీసులివ్వడం లేదన్నారు. ప్రభాకర్ రావు అమెరికా నుంచి ఇండియా(INDIA)కు వచ్చే ముందే కేటీఆర్ యూఎస్ వెళ్లింది నిజం కాదా? అని సంజయ్ ప్రశ్నించారు.
కేటీఆర్(KTR) అమెరికా వెళ్లిన తరువాతే ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చి సరెండర్ అయ్యారన్నారు. బీఆర్ఎస్ ను గద్దె దించింది బీజేపీ పార్టీయేనని వ్యాఖ్యానించారు. కేసీఆర్ మెడలు వంచేలా పోరాటాలు చేశామని, బీఆర్ఎస్ తో అండర్ స్టాండింగ్ ఉంటే తామెందుకు పోరాటాలు చేస్తామని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణకు తాము సిద్ధమని, కేంద్రం నేరుగా సీబీఐ విచారణ జరిపే అవకాశం లేదు కాబట్టే ఆగుతున్నామన్నారు. లేదంటే ఎప్పుడో ఫోన్ ట్యాపింగ్ నిందితులందరినీ గుంజుకుపోయి చట్ట ప్రకారం బొక్కలో వేసే వాళ్లమని సంజయ్ హెచ్చరించారు.
Also Read: Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలకు.. కేంద్రం నిధులివ్వాలి!