Godavari Pushkaralu: మాకు పదవులు ముఖ్యం కాదు, ప్రజలే ముఖ్యమని వారితో మమేకమై ఉంటామని మంత్రి కొండా సురేఖ (Konda Surekha) స్పష్టం చేశారు. సచివాలయంలో మీడియాతో చిట్ చాట్ చేశారు. గోదావరి పుష్కరాలకు రూ.200 కోట్ల నిధులు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాసినట్లు తెలిపారు. బీజేపీ కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, (Kishan Reddy) బండి సంజయ్ (Bandi Sanjay) చొరవ తీసుకోవాలని, నిధుల విడుదలకు సహకరించాలని లేకుంటే చేతకాని మంత్రులుగా మిగిలిపోతారన్నారు.
కేంద్రం రెండు తెలుగు రాష్ట్రాలను సమానంగా చూడాలని కోరారు. గోదావరి పుష్కరాలు (Godavari Pushkaral) ఏపీ కంటే తెలంగాణలోనే ఎక్కువ జరుగుతాయన్నారు. భద్రాచల రాముడి పాదాల నుంచే గోదావరి ప్రవహిస్తుందని చెప్పారు. కేంద్రం (Telangna) తెలంగాణపై వివక్ష చూపడం మంచిది కాదని అన్నారు. (Godavari Pushkaral) గోదావరి పుష్కరాలను సక్సెస్ చేసేందుకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని ఆలయాల్లో ఖాళీ పోస్టుల వివరాలను తెప్పిస్తున్నామని, ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని కొండా సురేఖ (Konda Surekha) వివరించారు.
Also Read: Yasangi Season Paddy: రైతన్నలకు గుడ్ న్యూస్.. నేరుగా ఖాతాల్లో రూ.335 కోట్లు!
15కోట్లు ఆషాడ బోనాలకు
గత బీఆర్ఎస్ ప్రభుత్వం 15కోట్లు ఆషాడ బోనాలకు కేటాయిస్తే తాము 20 కోట్లు ఇచ్చామని, మరో 10 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. మరోవైపు, వరంగల్ (Warangal)పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి మంత్రి సురేఖ (Konda Surekha) కౌంటర్ ఇచ్చారు. భద్రకాళీ టెంపుల్ ఎవరి సొత్తు కాదన్నారు. కొందరు తమ సొత్తు అన్నట్లుగా ఫీల్ అవుతున్నారని విమర్శలు చేశారు. నాయిని రాజేందర్ రెడ్డి (Naini Rajender Reddy) అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆగమశాస్త్రం ప్రకారమే భద్రకాళి అమ్మవారికి బోనం సమర్పించాలని నిర్ణయం తీసుకున్నామని, అయితే అక్కడ యాటలు కోస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి (MLA Kadiyam Srihari) తాను మంత్రిగా ఉంటే తన ముందు కూర్చోవడానికి నామోషీగా ఫీల్ అవుతున్నారని, అందుకే తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. మంత్రి వర్గ విస్తరణ అయిన తర్వాత కూడా ఇంకా తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు.
భద్రకాళి బోనాలు తాత్కాలిక వాయిదా
వరంగల్ (Warangal) భద్రకాళి అమ్మవారికి బోనాలు నిర్వహించేందుకు గతంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ (Konda Surekha) ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల భద్రకాళి బోనాలకు సంబంధించి కొంతమంది నుంచి అభ్యంతరాలతోపాటు పలు మాధ్యమాల్లో దీనిపై తప్పుడు వార్తలు ప్రచురితమైన దృష్ట్యా, ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రస్తుతం స్థానికంగా నెలకొన్న రాజకీయ విభేదాలు, పవిత్రమైన అమ్మవారికి ముడిపెట్టి కొంతమంది ఉద్దేశపూరితంగా ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉందని, అసాంఘిక శక్తులను ప్రేరేపించి గొడవలు సృష్టిస్తారన్న అనుమానంతో తాత్కాలికంగా బోనాలు నిర్వహణ రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.
భద్రకాళి అమ్మవారి టెంపుల్ పరిధిలో శాఖాహార బోనాలే ఉంటాయని ఈఓ, వేద పండితులు చెప్పారన్నారు. ఆగమ శాస్త్రం ప్రకారమే, వేద పండితుల నిర్ణయం మేరకు నిర్వహించాలని అనుకున్నామని పేర్కొన్నారు. కొంతమంది మాంసాహారంతో బోనాలు నిర్వహిస్తున్నట్లు చెప్పడంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయన్నారు. రాజకీయాల కోసం భక్తుల మనస్సుల్లో తప్పుడు భావాలు నింపడం సరికాదని కొండా సురేఖ (Konda Surekha) పేర్కొన్నారు.
Also Read: Konda vs Congress: కొండా వర్సెస్ కాంగ్రెస్.. వరంగల్ నేతల మధ్య కోల్డ్‌వార్!