Yasangi Season Paddy: రైతన్నలకు గుడ్ న్యూస్ రూ.335 కోట్లు!
Yasangi Season Paddy(image credit: swetcha reporter)
Telangana News

Yasangi Season Paddy: రైతన్నలకు గుడ్ న్యూస్.. నేరుగా ఖాతాల్లో రూ.335 కోట్లు!

Yasangi Season Paddy:  నాగర్ కర్నూల్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు దాదాపు పూర్తయ్యాయి. యాసంగిలో వరి ధాన్యం పండించిన రైతుల (Farmers)కు ఎలాంటి కష్టాలు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయి. జిల్లా చరిత్రలో రికార్డు స్థాయిలో వరి ధాన్యం సేకరణ జరగడం గమనార్హం. అకాల వర్షాలు కురిసినా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వరి ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.

 Also Read: Banakacherla Project: ప్రతిపక్షం మిస్టేక్స్ పై కాంగ్రెస్ ఎటాక్!

వరి కొనుగోళ్లు పూర్తి…!
జిల్లాలో 1 లక్షా 60 వేల ఎకరాల్లో వరి పంట సాగు కాగా, వ్యవసాయ శాఖ అధికారుల అంచనా ప్రకారం 3 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వచ్చింది. ఈ ధాన్యాన్ని రైతుల (Farmers) నుంచి కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఐకేపీ, మెప్మా, సింగిల్ విండోల్లాంటి 232 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 28,705 మంది రైతుల (Farmers) నుండి 1 లక్ష 71 వేల 694 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు జరిగితే అందులో 26 వేల 314 మంది రైతులకు 335 కోట్ల రూపాయలు నేరుగా నిర్ధేశిత సమయంలో (Farmers) రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేసింది. ఇందులో మిగిలిన మరో 239 మంది రైతులకు చెల్లించాల్సిన రూ. 60 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉంది.

కొనుగోలను వేగవంతం

నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తి కానుంది. అధికారుల అంచనా మేరకు ఇంకా 10వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంది. ఇది కూడా వారంలో పూర్తి కానుంది. ఈ సంవత్సరం తీవ్రంగా ఎండలు ఉండే ఏప్రిల్, మే నెలలో కూడా ఆకస్మికంగా పెద్ద వర్షాలు కురియడంతో (Farmers) రైతులకు ఇబ్బందులు కలుగుతాయని గుర్తించిన ప్రభుత్వం కొనుగోలను వేగవంతం చేసింది. నాగర్ కర్నూల్ (Nagar Kurnool) జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల ఆకస్మిక తనిఖీలు చేపట్టి ధాన్యం కొనుగోళ్లు, (Farmers)  రైతులకు కేంద్రాల్లో వరి ధాన్యం తడవకుండా టార్ఫాలిన్ కవర్లను అందించడం, సేకరించిన ధాన్యాన్ని వెంటనే గుర్తించిన 142 మిల్లులకు తరలించడం లాంటి ప్రక్రియను వెంటవెంటనే చేపట్టారు. మొత్తం మీద యాసంగిలో వరి ధాన్యం‌ పండించిన రైతన్నలకు కష్టాలు లేకుండా ధాన్యం సేకరణ దాదాపు పూర్తి కావడం గమనార్హం.

వరి కొనుగోళ్లు పూర్తి : బాదావత్ సంతోష్ నాగర్‌కర్నూల్ కలెక్టర్
జిల్లాలో రైతుల (Farmers)  నుంచి వరి ధాన్యం కొనుగోల సేకరణ దాదాపు పూర్తయింది 90 శాతం వరకు వరి కొనుగోలు చేపట్టాం. 28 వేల మంది వరి రైతులకు 335 కోట్ల రూపాయలను ఖాతాల్లో ప్రభుత్వం జమచేసింది. జిల్లా చరిత్రలోనే రికార్డు స్థాయిలో మరి ధాన్యం సేకరణ చేపట్టినందుకు చాలా సంతోషంగా ఉంది (Farmers) రైతులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఈ వానకాలంలోనూ అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటాం.

 Also Read: Konda vs Congress: కొండా వర్సెస్ కాంగ్రెస్.. వరంగల్‌ నేతల మధ్య కోల్డ్‌వార్!

Just In

01

New Year Party: న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్.. నగరానికి చేరుస్తున్న పెడ్లర్లు డెడ్​ డ్రాప్​ పద్దతిలో..!

Nagababu Politics: అక్కడ ఫోకస్ పెట్టేందుకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఫోకస్ తగ్గించుకుంటున్న మెగా బ్రదర్..

BiggBoss9 Prize Money: బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్‌కు వచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.. సర్‌ప్రైజ్ గెస్ట్ ఎవరంటే?

Kerala News: కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హవా.. పంచాయతీ ఎన్నికల్లో యూటీఎఫ్ సత్తా

Brown University: అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి, ఎనిమిది మంది పరిస్థితి విషమం