Samantha vs Sobhita
ఎంటర్‌టైన్మెంట్

Samantha vs Sobhita: అక్కినేని కోడలు వర్సెస్ సమంత రూత్ ప్రభు.. నెటిజన్లు షాకింగ్ కామెంట్స్!

Samantha vs Sobhita: సమంత, శోభిత.. ఇద్దరూ టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమే. ఇద్దరూ ఉండేది ముంబైలోనే. ఇద్దరూ పెళ్లాడింది ఒక్కరినే. ఒకరు నాగ చైతన్య (Naga Chaitanya)కు మాజీ భార్య అయితే మరొకరు రీసెంట్‌గానే ఆయన లైఫ్‌లోకి ఎంటరయ్యారు. వర్సెస్ అనే పదం ఉంది కాబట్టి వీరిద్దరూ ఏమైనా గొడవలు పడుతున్నారా? చైతూ విషయంలో ఇద్దరికీ మధ్య ఏమైనా చెడిందా? సమంత (Samantha Ruth Prabhu)తో ఉన్నప్పుడే చైతూ, శోభిత (Sobhita Dhulipala)ను లైన్‌లో పెట్టాడనేలా.. ఈ మధ్య సోషల్ మీడియాలో వార్తలు చూస్తుంటే, సంథింగ్ రాంగ్ అని తప్పకుండా అనిపిస్తుంది. మరి ఆ వార్తల్లో నిజం ఎంత అనేది మాత్రం చెప్పలేము. అసలు చైతూ, సామ్ విడిపోవడానికి కారణం ఏమిటనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. వాళ్ల ఇంట్లోని వారికి కూడా బహుశా తెలిసి ఉండకపోవచ్చు. సింపుల్‌గా మేమిద్దరం విడిపోయి, ఎవరి లైఫ్‌ని వాళ్లం బతకాలనుకుంటున్నట్లుగా ఇద్దరూ చెప్పారు అంతే. ఆ తర్వాత నాగార్జున (King Nagarjuna) కూడా ఏమీ మాట్లాడలేకపోయారు.

Also Read- Niharika Konidela: ఆ హీరోతో నా రిలేషన్ ఐదేళ్లు.. లవ్ సింబల్ తో హింట్ ఇచ్చిన నిహారిక కొణిదెల?

ఆ తర్వాత కొంత కాలానికే చైతూ లైఫ్‌లోకి శోభిత వచ్చి చేరింది. వారిద్దరి మనసులు కలిశాయి. ఇరు కుటుంబాల పెద్దలు మాట్లాడుకుని చైతూ, శోభితల పెళ్లిని చాలా సింపుల్‌గా ముగించేశారు. ప్రస్తుతం ఎవరి బతుకు వాళ్లు బతుకుతున్నారు. చైతూ హ్యాపీగా శోభితతో కాపురం చేసుకుంటున్నాడు. సమంత మాత్రం ఇంకా సింగిల్‌గానే ఉంది. తను కూడా పెళ్లి చేసుకుంటుందంటూ ఎప్పటి నుంచో వార్తలైతే వినబడుతున్నాయి కానీ, పెళ్లి వరకు మ్యాటర్ వెళ్లడం లేదు. మధ్య మధ్యలో అదేం లేదు అన్నట్లుగా ఆమె చెబుతూ ఉంది. ఈ నేపథ్యంలో సమంత వర్సెస్ శోభిత అనగానే రకరకాల థాట్స్ రావడం కామనే. కాకపోతే ఇక్కడ విషయం వారి వ్యక్తిగతమైనది కాదు. వారి అవతారాలకు చెందినది.

Also Read- Venu Madhav: నడిచి వస్తున్న వేణుమాధవ్.. గుండెలు పిండేసే వీడియో వైరల్!

సామ్, శోభిత ఇద్దరూ హెల్త్ పట్ల ఎంతో జాగ్రత్తగా ఉంటారు. డైలీ జిమ్‌లో గంటలపాటు గడుపుతుంటారు. జిమ్ ముగించుకుని బయటకు వచ్చే సమయంలో వారు కనిపించే అవతారంపై ఇప్పుడు నెటిజన్లు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. సమంత, శోభిత జిమ్ నుంచి బయటకు వస్తున్న వీడియోలను మిక్స్ చేసి.. వీరిద్దరిలో ఎవరు ఆకర్షిస్తున్నారు? అని ఓ నెటిజన్ పోస్ట్ చేసిన వీడియోకు నెటిజన్ల కామెంట్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఈ వీడియోలో శోభిత పొట్టి డ్రస్‌లో కనిపిస్తే.. సమంత మాత్రం టైట్‌గా డ్రస్‌తో ఆల్-బ్లాక్ అవుట్‌ఫిట్‌‌తో దర్శనమిస్తోంది. ఇందులో శోభిత గ్లామర్‌గా కనిపిస్తుంటే.. సమంత కాస్త పద్దతిగా కనిపిస్తుంది. ఇద్దరూ వారి డ్రస్సుల్లో మెరిశారు. నెటిజన్లు అందరూ ఏకగ్రీవంగా సమంతకే సపోర్ట్ ఇస్తూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ‘హీరోయిన్లుగా ఎలా ఉన్నా.. పెళ్లి తర్వాత ఎలా ఉన్నారనేది ఇక్కడ ఇంపార్టెంట్. చెత్త వేషాలు వేస్తే ఎవరినైనా ఛీ అంటారు జనం’ అని ఓ నెటిజన్ చేసిన కామెంట్ బాగా వైరల్ అవుతోంది.

">

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు