Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela)గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగు పెట్టి ( Telugu Film Industry) నటిగా.. నిర్మాతగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 2024 లో కమిటీ కుర్రాళ్లతో పాటు, వెబ్ సిరీస్ లు కూడా తీస్తూ మెగా డాటర్ దూసుకెళ్తుంది. అంతే కాదు, ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన గద్దర్ అవార్డుకు కూడా మెగా డాటర్ ఎంపికైంది.
Also Read- Venu Madhav: నడిచి వస్తున్న వేణుమాధవ్.. గుండెలు పిండేసే వీడియో వైరల్!
సినిమాల పరంగా ఈ ముద్దుగుమ్మ మంచి ఫామ్ లో ఉంది కానీ, వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకుని, విడాకులు ఇచ్చిన విషయం మనకీ తెలిసిందే. అయితే, ఇది వినడానికి కష్టంగా ఉన్నా .. నిహరిక తన జీవితంలో పెద్ద నిర్ణయమే తీసుకుందని చెప్పుకోవాలి. దీని మీద రియాక్ట్ అయిన మెగా డాటర్ .. నా భవిష్యత్తు గురించి ఆలోచించే ఇలా చేశానని పలు ఇంటర్వ్యూ ల్లో చెప్పుకొచ్చింది. విడాకులు తీసుకున్న తర్వాత గ్యాప్ తీసుకోకుండా.. వరుస చిత్రాలతో ఫుల్ బిజీ అయింది. ఇదిలా ఉండగా.. నిహారిక తాజాగా పెట్టిన స్టోరీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఓ యంగ్ హీరో గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.
Also Read- Kuberaa OTT: ‘కుబేర’ ఓటీటీ డీల్ ఎంతో తెలుసా? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే?
యంగ్ హీరో అంకిత్ బర్త్ డే సందర్భంగా నిహారిక కొణిదెల పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ” అతను నాకు ఐదేళ్ల నుంచి తెలుసు.. మేము మీట్ ఐనప్పుడు గంటల కొద్దీ మాట్లాడుకుంటూనే ఉంటాము. మేము ఎక్కువగా మాట్లాడుకునే టాపిక్ సినిమా. అతనితో నేను చాలా ఎంజాయ్ చేస్తుంటాను.. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ కు పిల్లర్‌గా నిలబడ్డాడు. అతను ప్యాషనేట్ స్టోరీ టెల్లర్స్‌కు సపోర్ట్ గా చేస్తుంటాడు. అంకిత్ కు హ్యాపీ బర్త్ డే ” అంటూ.. నిహారిక తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో రాసుకొచ్చింది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు