Trump Viral Video: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ మధ్య అలాస్కా వేదికగా భేటి జరిగిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే లక్ష్యంతో ట్రంప్ నిర్వహించిన ఈ భేటి.. ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ముగిసింది. రష్యా – అమెరికా మధ్య చాలా వరకూ విషయాల్లో ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ యుద్ధం విషయానికి వచ్చే సరికి ఇరుదేశాధినేతలు ఒక ఒప్పందానికి రాలేకపోయారు. ఇదిలా ఉంటే పుతిన్ తో భేటి సందర్భంగా.. ట్రంప్ వ్యవహరించిన తీరుపై నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మద్యం తాగి భేటికి హాజరయ్యారా? అన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.
నెటిజన్లు ఏమంటున్నారంటే?
అలాస్కా భేటిలో పాల్గొనేందుకు వస్తోన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ కోసం.. ఎర్ర తివాచీని ఏర్పాటు చేశారు. అయితే దానిపై ట్రంప్ ఇబ్బంది పడుతూ నడిచినట్లుగా ఉన్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అందులో ఎర్ర తివాచీపై ట్రంప్ నేరుగా నడవలేకపోయారు. అటు ఇటు వంకరగా నడిచారు. దీంతో ట్రంప్ భేటికి తాగొచ్చారా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ బైడెన్ గనుక ఇలా నడిచి ఉంటే చాలా విమర్శలు వచ్చేవని పేర్కొంటున్నారు. అయితే ట్రంప్ స్నైపర్ కాల్పులను తప్పించుకోవడానికే అలా వంకర టింకరగా నడిచారని మరికొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. రెడ్ కార్పేట్ ఉండి మంచిదైందని.. లేదంటే ట్రంప్ దారి తప్పిపోయేవారని పేర్కొంటున్నారు. మరికొందరు ఈ వీడియో నిజమైందా? కాదా? అన్న అనుమానాలను వ్యక్తం చేశారు.
Trump couldn’t even walk in a straight line to greet Putin; stumbling like a man who just met gravity for the first time.
World stage, red carpet, and he’s out here looking like a malfunctioning Roomba. pic.twitter.com/wVyk0vSLuW
— Brian Allen (@allenanalysis) August 15, 2025
Also Read: Trump on Tariffs: అలా చేయకూడదేమో.. భారత్‌పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రంప్ నడకకు కారణమదేనా?
జూలైలో వైట్ హౌస్ ట్రంప్ ఆరోగ్యంపై ప్రకటన చేస్తూ ఆయనకు ‘క్రానిక్ వెనస్ ఇన్‌సఫిషెన్సీ’ (Chronic Venous Insufficiency) అనే వ్యాధి ఉందని తెలిపింది. ఈ సమస్య ఉన్నవారిలో గుండె నుంచి కాళ్లకు వెళ్లే రక్త నాళాలు సమర్థవంచంగా పనిచేయవు. దీని వలన కాళ్లకు రక్తం సరఫరా తగ్గి.. వాపు, చర్మం సమస్యలు, కాళ్ల మడమల చుట్టూ ఉబ్బడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ట్రంప్ నడుస్తూ తడబడటం.. ఈ పరిస్థితి వల్లే కావొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Also Read: Block Widow Case: ప్రపంచంలోనే క్రూరమైన భార్య.. ఏకంగా 11 మంది భర్తలను లేపేసింది!
భేటి తర్వాత ట్రంప్ ఏమన్నారంటే?
రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటి అనంతరం.. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ‘ఒప్పందం కుదిరే వరకు ఎలాంటి ఒప్పందం లేదు’ అని ఈ సందర్భంగా ట్రంప్ తేల్చి చెప్పారు. దీన్ని బట్టి ఇరువురి నేతల చర్చల్లో తుది పరిష్కారం రాలేదని అర్థమవుతోంది. అయినప్పటికీ ట్రంప్ మాట్లాడుతూ ‘ఇది చాలా ఫలప్రదమైన సమావేశం. చాలా అంశాలలో ఏకాభిప్రాయం కుదిరింది. చాలా కొద్దిపాటి విషయాలు మాత్రమే మిగిలాయి. మేము అక్కడికి చేరుకోలేదు. కానీ చేరుకునే మంచి అవకాశం ఉంది’ అని అన్నారు. అయితే ఉక్రెయిన్ యుద్ధాన్ని (Ukraine War) ఆపాలన్న లక్ష్యంతో ట్రంప్ ఈ భేటి నిర్వహించగా.. అసలు దానిపై ఏకాభిప్రాయం రాకపోవడంతో అలాస్కా భేటి విఫలమైందని పలువురు అభిప్రాయపడుతున్నారు.