Trump and Putin
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Trump on Tariffs: అలా చేయకూడదేమో.. భారత్‌పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Trump on Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం అలస్కాలో ముఖాముఖీ భేటీ అయ్యారు. యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఈ సమావేశం అనంతరం ట్రంప్ వైఖరిలో మార్పు వచ్చిందా?, రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై టారిఫ్‌లు (Trump on Tariffs) విధించే విషయంలో  ఆయన కాస్త మెత్తబడ్డారా? అనే ప్రశ్నలకు ఔననే సమాధానం వస్తోంది. రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేసే దేశాలపై రెండో దఫా సుంకాలు వెంటనే విధించబోమని, రెండు మూడు వారాల్లో ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చని ట్రంప్ వెల్లడించారు. సుంకాల విధింపు కారణంగా రష్యా ఒక ఆయిల్ కస్టమర్‌ను కోల్పోయిందని భారత్‌ను ఉద్దేశించి ట్రంప్ ప్రస్తావించారు.

Read Also- Kannada Crime Thriller: ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను రాత్రివేళల్లో మాత్రం చూడకండి.. లేదంటే అంతే!

‘‘ ఆయన (రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్) ఒక ఆయిల్ కస్టమర్‌ను కోల్పోయారు. ఆ కస్టమర్ భారత్. రష్యా నుంచి ఇండియా సుమారు 40 శాతం ఆయిల్ కొనుగోలు చేస్తోంది. చైనా కూడా పెద్ద ఎత్తున ఆయిల్ కొనుగోలు చేస్తోందని అందరికీ తెలుసు. నేను ద్వితీయ జరిమానాలు లేదా సెకండరీ టారిఫ్‌లు విధిస్తే రష్యా దృష్టిలో ఇది చాలా తీవ్రంగా అనిపిస్తుంది. అయినప్పటికీ, ఒకవేళ టారిఫ్‌లు విధించాల్సి వస్తే విధిస్తాను. బహుశా అలా చేయకూడదేమో’’ అని అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

Read Also- Khazana Jewellers Robbery: ఖజానా దోపిడి దొంగలు మామూలోళ్లు కాదు.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన డీసీపీ!

రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లు ఆపినట్లుగా భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ట్రంప్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారంటూ భారత్ దిగుమతులపై సుంకాలను 25 శాతం నుంచి 50 శాతానికి పెంచుతూ ఇటీవలే ట్రంప్ ప్రకటన చేశారు. ఈ అదనపు టారిఫ్ ఆగస్ట్ 27 నుంచి అమల్లోకి రానుంది.

ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపకపోతే రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసే దేశాలపై జరిమానాలుగా సుంకాలు పెంచుతామని ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. కాగా, రష్యా ముడి చమురును అధికంగా భారత్, చైనాలు కొనుగోలు చేస్తున్నాయి.

Read Also- Mahesh Kumar Goud: బ్రిటిష్ పాలకులకు బీజేపీ మద్ధతు.. టీపీసీసీ చీఫ్ సంచలన కామెంట్స్

పుతిన్‌తో చర్చలు అర్థవంతంగా జరిగాయన్న ట్రంప్… రష్యాపై ఒత్తిడి పెంచే ప్రయత్నంలో భాగంగా ఆ దేశం నుంచి ఆయిల్ కొనుగోలు చేసే చైనా, ఇతర దేశాలపై అవసరమైతే అదనపు సుంకాలు విధించాలని భావిస్తున్నట్టుగా స్పష్టంగా చెప్పారు. దీనినిబట్టి, భారత్‌పై విధించిన అదనపు సుంకాలు కూడా రష్యాపై ఒత్తిడి పెంచే ప్రయత్నంలో భాగంగా విధించినట్టుగా అనిపిస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీకి ముందు ట్రంప్ చేసిన కీలక వ్యాఖ్యలు ఇందుకు అద్దంపడుతున్నాయి. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై తాము విధించిన సుంకాలు.. అమెరికాతో రష్యా చర్చలకు అంగీకరించడంలో కీలక పాత్ర పోషించాయని ట్రంప్ తెలిపారు.

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం