Ganesh Chaturthi 2025: హిందూ సంప్రదాయంలో వినాయకుడు (గణపతి)ని మొదటగా పూజించడం ఒక ఆచారం. ఇది మన పూర్వీకుల నుంచి ఉంది. దీనికి గల కారణాలు పురాణాలలో ఉన్నాయి. అసలు వినాయకుడిని ముందుగా ఎందుకు పూజిస్తామో ఇక్కడ తెలుసుకుందాం..
విఘ్నేశ్వరుడు (విఘ్నాలను తొలగించేవాడు)
వినాయకుడు “విఘ్నేశ్వరుడు” గా పిలుచుకుంటాము. అంటే అడ్డంకులను తొలగించే దేవుడు. ఏదైనా కార్యాన్ని ప్రారంభించే ముందు ఆయనను పూజిస్తే, ఆ కార్యం సాఫీగా, విజయవంతంగా పూర్తవుతుందని భక్తులు నమ్ముతుంటారు. ఆయన ఆశీస్సులు అడ్డంకులను కూడా నివారిస్తాయని భక్తులు విశ్వసిస్తారు.
Also Read: Clash Over Ganja: గంజాయి బ్యాచ్ హల్చల్.. యువకునికిపై ఎక్సైజ్ సిబ్బంది దాడి చేశారంటూ ఫిర్యాదు
పురాణాలు ఏం చెబుతున్నాయంటే?
ఒక పురాణ కథ ప్రకారం, దేవతలు శివుడు , పార్వతీ దేవి వద్ద వినాయకుడు, కార్తికేయుల మధ్య ఒక పోటీ జరిగింది. ఎవరు మొదటగా పూజలు అందుకోవాలనే ప్రశ్న రాగా, శివుడు వారిని ప్రపంచాన్ని మూడు సార్లు చుట్టి రావాలని ఆదేశించాడు. కార్తికేయుడు తన వాహనం (నెమలి)పై ప్రపంచాన్ని చుట్టడానికి వెళ్ళగా, వినాయకుడు తన తల్లిదండ్రులైన శివపార్వతులను మూడు సార్లు ప్రదక్షిణం చేసి, వారే తన ప్రపంచమని చెప్పాడు. ఈ తెలివితో ఆయన మొదటి పూజకు అర్హుడిగా గుర్తింపు పొందాడని చెబుతున్నాయి.
ఇదే మాత్రమే కాకుండా, ఇంకో కథలో వినాయకుడు శివుని ఆజ్ఞతో దేవతలందరికీ అధిపతిగా నియమించబడ్డాడు. అందుకే ఆయనను “గణపతి” (గణాలకు అధిపతి) గా పిలుస్తారు.
ఆధ్యాత్మిక ప్రాముఖ్యత
వినాయకుడు జ్ఞానం, బుద్ధి, సిద్ధి (విజయం) యొక్క దేవుడుగా గుర్తించబడతాడు. ఏ కార్యాన్ని ప్రారంభించినా, ఆయన ఆశీస్సులు ఆ కార్యంలో విజయాన్ని, సమృద్ధిని తెస్తాయని భక్తులు భావిస్తారు. ఆయనను మొదట పూజించడం వల్ల మనస్సు స్థిరంగా, ఆలోచనలు స్పష్టంగా ఉంటాయని నమ్ముతారు.
సాంప్రదాయ ఆచారం
హిందూ శాస్త్రాల ప్రకారం, వినాయకుడు అన్ని దేవతలకు ముందు పూజించబడాలని చెప్పబడింది. గృహప్రవేశం, వివాహం, యజ్ఞం, లేదా ఏదైనా కొత్త పని మొదలు పెట్టేటప్పుడు.. శుభ కార్యాలలో గణపతి పూజ మొదటి స్థానంలో ఉంటుంది.

 Epaper
 Epaper  
			 
					 
					 
					 
					 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				