Clash Over Ganja
తెలంగాణ

Clash Over Ganja: గంజాయి బ్యాచ్ హల్చల్.. యువకునికిపై ఎక్సైజ్ సిబ్బంది దాడి చేశారంటూ ఫిర్యాదు

Clash Over Ganja: కుత్బుల్లాపూర్‌ (Quthbullapur)లో గంజాయి బ్యాచ్ హల్ చల్ సృష్టించింది. దీంట్లో ఓ యువకునికి తీవ్ర గాయాలయ్యాయి. ఎక్సైజ్ అధికారుల దాడిలోనే గాయాలైనట్టు యువకులు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, గంజాయి సేవించిన యువకులు దాడి చేశారని ఎక్సైజ్ సిబ్బంది కంప్లయింట్ ఇచ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి. అయోధ్య నగర్ చౌరస్తాలో కొందరు యువకులు గంజాయి సేవిస్తున్నట్టు ఎక్సైజ్ పోలీసులకు ఆదివారం సమాచారం వచ్చింది. దాంతో అక్కడికి సివిల్ డ్రస్‌లో వెళ్లిన ఎక్సైజ్ సిబ్బంది కొందరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని అక్కడి నుంచి తరలిస్తుండగా స్థానికంగా ఉంటున్న చంటి యాదవ్ అనే యువకుడు, మరో కాలనీకి చెందిన వారు.. తన కాలనీ వారిపై దాడి చేసి తీసుకెళుతున్నారని భావించి అడ్డుకునే యత్నం చేశాడు.

Also Read- cine workers strike: సినీ కార్మికుల సమస్యలపై చిరంజీవితో చర్చించిన నిర్మాత.. ఇక షూటింగ్ స్టార్ట్!

ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో చంటి యాదవ్‌ (Chanti Yadav)కు చెంప, చెవిపై గాయాలయ్యాయి. వెంటనే అతన్ని స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా 22 కుట్లు పడ్డాయి. కాగా, ఎక్సైజ్ అధికారులు సర్జికల్ బ్లేడ్‌తో చేసిన దాడిలో చంటి యాదవ్‌కు గాయాలయ్యాయని (Youth Injured Excise Raid) యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, చంటి యాదవ్‌ను ఇన్ఫార్మర్‌గా అనుమానించి యువకులు దాడి చేశారని ఎక్సైజ్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి.. విచారణ జరుపుతున్నారు.

మందు కొట్టి పట్టుబడ్డారు
ఇదిలా ఉంటే, సైబరాబాద్ పోలీసులు జరిపిన వారాంతపు డ్రంకెన్ డ్రైవ్ (Weekend Drunk Driving Cases) పరీక్షల్లో 272 మంది పీకలదాకా తాగి దొరికిపోయారు. శనివారం కమిషనరేట్ పరిధిలోని వేర్వేరు చోట్ల ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు జరుపగా, పరిమితికి మించి మద్యం సేవించి 227 మంది ద్విచక్ర వాహన దారులు పట్టుబడ్డారు. ఆటోలు నడుపుతూ 15 మంది, కార్లు డ్రైవ్ చేస్తూ 29 మంది, భారీ వాహనం నడుపుతూ ఒకరు దొరికిపోయారు. అందరిపై కేసులు నమోదు చేసిన పోలీసులు వారిని ఆయా కోర్టుల్లో హాజరు పరచనున్నారు.

Also Read- Udaya bhanu: రియాలిటీ షోస్ లో చూపించేది నిజం కాదా? సంచలన కామెంట్స్ చేసిన ఉదయభాను

ఇటీవల వరుస ఘటనలు

రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్​ మండలం బాటసింగారం ప్రాంతంలో టీఎస్​26 డీ 1004 నెంబర్​ గల కారు డివైడర్​‌ను ఢీకొట్టి ప్రమాదానికి గురైనట్లుగా స్థానికులు పోలీస్​ పెట్రోలింగ్ వాహనానికి సమాచారం అందించారు. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా.. కారు డ్రైవర్​ మద్యం మత్తులో ఉండి డ్రైవింగ్ చేయడం వలనే ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించి.. కారును పూర్తిస్థాయిలో పరిశీలించారు. కాగా అందులో మద్యం బాటిల్స్​, గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించి అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్‌ (Abdullapurmet police station)కు ​తరలించారు. నిందితుడి నుంచి 20 కిలోల గంజాయిని స్వాధీనం (Ganja Seized) చేసుకొన్నామని, అతడిని కోర్టు ముందు హాజరు పరచనున్నట్లు పోలీసులు తెలిపారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు