Udaya Bhanu (Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Udaya bhanu: రియాలిటీ షోస్ లో చూపించేది నిజం కాదా? సంచలన కామెంట్స్ చేసిన ఉదయభాను

 Udaya bhanu: ప్రముఖ యాంకర్‌ ఉదయభాను గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తెలుగు బుల్లితెరపై యాంకర్‌ గానే కాకుండా, నటిగా కూడా మంచి గుర్తింపు పొందింది. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్‌లో 1980 ఆగస్టు 5న జన్మించింది. ఆమె తండ్రి డాక్టర్, కవి అయిన ఉదయభాను పేరునే ఆమెకు పెట్టారు. ఆమె తల్లి ఆయుర్వేద వైద్యురాలు. ఉదయభాను తన కెరీర్‌ను చిన్న వయసులోనే ప్రారంభించారు, పదో తరగతి చదువుతున్నప్పుడే కెమెరా ముందుకు వచ్చింది.

Also Read: Fighter Shiva: ‘నేను పవన్ కళ్యాణ్ లెక్క.. గెలిచే వరకు పోరాడుతా’.. ‘ఫైటర్ శివ’ టీజర్ అరాచకం

బుల్లితెర జీవితం

ఉదయభాను తన ఎనర్జిటిక్ యాంకరింగ్‌తో టెలివిజన్ రంగంలో సంచలనం సృష్టించింది. ఈ ముద్దుగుమ్మ ఈటీవీలో ప్రసారమైన హృదయాంజలి కార్యక్రమంతో అడుగు పెట్టింది. ఆ తర్వాత వన్స్ మోర్ ప్లీజ్ (జెమినీ టీవీ), సాహసం చేయరా డింభకా, డ్యాన్స్ బేబీ డ్యాన్స్, రేలా రే రేలా, ఢీ వంటి షోలతో ఆమె బుల్లితెర మహారాణిగా గుర్తింపు పొందింది. ఆమె చలాకీతనం, మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకునే విధానం ఆమెను హీరోయిన్లను మించిన క్రేజ్‌ను సంపాదించేలా చేసింది. ప్రస్తుతం ఆమె త్రిబాణధారి బార్బరిక్ అనే సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది. దీనిలో ఈమె ఒక ఐటెం సాంగ్‌లో కూడా నటించింది.

Also Read: Jagapati Babu: చైతూ పెళ్లికి ఎందుకు పిలవలేదు.. అఖిల్ పెళ్లిలో అసలు తాగానా? నాగ్‌ని ప్రశ్నించిన జగ్గూ భాయ్

అయితే, ఈ క్రమంలోనే రియాలిటీ షోస్ గురించి ఉదయభాను సంచలన కామెంట్స్ చేసింది. యాంకర్స్ చెప్పేది మొత్తం స్క్రిప్ట్ డ్. వాళ్లు అందుకే చెవిలో మైక్ పెట్టుకుంటారు. ఇలా చేయాలి, అలా చేయాలి, ఇక్కడ నవ్వాలి, అక్కడ ఎమోషన్ చూపించాలి అని ముందే చెబుతారు. యాంకర్స్ చేయడానికి ఏం లేదు .. A టూ z మొత్తం స్క్రిప్ట్ డే. నేను అలాంటివి రాక ముందు నుంచే చేశా అంటూ ఆమె మాటల్లో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం, దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

Also Read: Jagapati Babu: చైతూ పెళ్లికి ఎందుకు పిలవలేదు.. అఖిల్ పెళ్లిలో అసలు తాగానా? నాగ్‌ని ప్రశ్నించిన జగ్గూ భాయ్

 

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?