Jagapathi babu Show
ఎంటర్‌టైన్మెంట్

Jagapati Babu: చైతూ పెళ్లికి ఎందుకు పిలవలేదు.. అఖిల్ పెళ్లిలో అసలు తాగానా? నాగ్‌ని ప్రశ్నించిన జగ్గూ భాయ్

Jagapathi Babu: నటసింహం నందమూరి బాలకృష్ణ ‘ఆహా’ ఓటీటీలో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె’ (Unstoppable With NBK) అనే షోతో ఎక్కడా లేని క్రేజ్‌ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ షోతో ఆహా ఓటీటీ అతి తక్కువ టైమ్‌లోనే మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ఇక ఫస్ట్ టైమ్ బాలయ్య ఇలాంటి షో‌కు ఓకే చెప్పడమే కాదు.. తనదైన తరహాలో ఈ షోని ముందుకు తీసుకెళ్లడంతో.. రికార్డులు బద్దలు కొట్టేశారు. ఇప్పటి వరకు ఇలాంటి షోలకు రాని సెలబ్రిటీలను కూడా ఈ షోకి బాలయ్య తీసుకు వస్తుండటంతో.. నార్మల్‌గానే ‘అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్‌బికె’ టాక్ షో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇంతకు ముందు మంచు లక్ష్మి, రానా దగ్గుబాటి, ప్రదీప్ మాచిరాజు వంటి వారు కూడా ఇలాంటి షో చేశారు కానీ, ఇంత క్రేజ్ మాత్రం తీసుకురాలేకపోయారు. ఇప్పుడు బాలయ్య రూటులోనే జగ్గూ భాయ్.. అదే మన జగపతిబాబు (Jagapati Babu:) కూడా ఓ షో స్టార్ట్ చేశారు.

జగపతిబాబు హోస్ట్‌గా ‘జయమ్ము నిశ్చయమ్మురా’ (Jayammu Nischayammu Raa) పేరుతో జీ5 ఓటీటీ ఓ సెలబ్రిటీ టాక్ షో ను ప్రారంభించింది. ఈ షో‌కు మొట్టమొదటి గెస్ట్‌గా కింగ్ నాగార్జున‌ (King Nagarjuna)ను ఆహ్వానించారు. ప్రస్తుతం కింగ్ నాగార్జున నటించిన ‘కూలీ’ (Coolie) సినిమా విడుదలైన నేపథ్యంలో.. ఆ సినిమా ప్రమోషన్‌కు ఉపయోగపడుతుందని అంతా భావించారు కానీ.. ఈ షో ద్వారా వారి ఫ్యామిలీలోని సీక్రెట్స్‌ కూడా సిగ్గులేకుండా జగపతిబాబు బయటకు తీస్తున్నారు. ‘సిగ్గులేకుండా’ అనే పదం ఎందుకు వాడాల్సి వచ్చిందంటే.. జగ్గూ భాయే ఇది ‘సిగ్గు లేకుండా మాట్లాడుకునే షో’ అని పదే పదే చెబుతున్నందుకు గానూ అలా సంభోదించాల్సి వచ్చింది. ఇక ఈ షోలో.. నాగ్‌పై తనకున్న ప్రేమని, కోపాన్ని బయటపెట్టారు జగపతిబాబు. ముఖ్యంగా నాగ్ కుమారుల పెళ్లి ప్రస్తావనకు సంబంధించి జరుగుతున్న సంభాషణ వీడియో ఒకటి సోషల్ మాధ్యమాలలో బాగా వైరల్ అవుతోంది.

Also Read- Kannada Crime Thriller: ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను రాత్రివేళల్లో మాత్రం చూడకండి.. లేదంటే అంతే!

ఇందులో నాగ్‌తో పాటు తన సోదరి, సోదరుడు కూడా ఉన్నారు. ‘‘అప్పట్టో నువ్వు మనోడివి కదా.. పార్టీకి రమ్మని నాగ సుశీల పిలిస్తే వచ్చాను. అప్పుడు తాగి న్యూసెన్స్ చేశాను. అప్పుడు నువ్వొక (నాగ్) లుక్ ఇచ్చావ్.. భయంకరమైన లుక్. ఆ తర్వాత మళ్లీ పార్టీకి నన్ను నువ్వు ఇంటికి పిలవలేదు’’ అని జగపతిబాబు అంటుంటే.. కింగ్ నాగ్, సుశీల ఇద్దరూ మాకు గుర్తులేదు అన్నారు. వెంటనే.. ‘హలో.. మరి చైతన్య పెళ్లికి పిలవలేదు దాని సంగతి ఏంటి?’ అని జగపతిబాబు ప్రశ్నించారు. ఏ.. పిలిచాను నిన్ను? నువ్వు లేవని చెప్పారు.. అని నాగ్ అంటే.. నువ్వు వైజాగ్ వెళ్లావని చెప్పారు అని నాగ సుశీల అన్నారు. బారాత్‌కు పిలిచాం అని నాగ సుశీల మళ్లీ కల్పించుకున్నారు. ‘మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే.. తను చెబుతుందని నువ్వు.. నువ్వు చెబుతావని తను, సుప్రియ చెబుతుందని మీరిద్దరూ అనుకుని మరిచిపోయారు.. ఇది జరిగింది’ అని జగపతిబాబు మళ్లీ సమాధానం చెప్పారు.

వెంటనే నాగ్ కల్పించుకుని.. ‘ఇప్పుడు పిలవలేదు.. ఫ్రెండ్ అంటున్నావ్.. మరి నువ్వే రావచ్చు కదా’ అని ప్రశ్నించారు. ‘నాకు సిగ్గులేదు.. అదే వేరే సంగతి’ అని జగ్గూ భాయ్ చెప్పుకొచ్చారు. షూటింగ్స్‌తో బిజీగా ఉన్నామని ఇద్దరూ సర్ది చెప్పుకుంటూనే.. ‘నా కూతురు పెళ్లికి రాలేదు.. నువ్వు?’ అంటూ నాగ్‌పై జగపతిబాబు మరో బాంబు పేల్చారు. ఇంతలో పక్కన కూర్చుని ఉన్న వెంకట్ మాట్లాడుతూ.. ‘ఇదేదో పోట్లాటగా తయారయ్యేలా ఉంది’ అని నవ్వుకున్నారు. అనంతరం జగపతిబాబు మాట్లాడుతూ.. ‘అఖిల్ పెళ్లికి ఫస్ట్ నాకే ఫోన్ చేశావ్.. అది నాకు మైండ్‌లో నిలిచిపోయింది. నన్ను కదిలించేసింది.. చైతూ పెళ్లికి జరిగింది గుర్తు పెట్టుకుని.. మళ్లీ ఎక్కడ మరిచిపోతానో అని చెప్పి ముందు నన్నే పిలిచావ్.. అవునా? కాదా?’ అని ప్రశ్నించారు. నాగార్జున్ ‘కరెక్ట్’ అని అన్నారు.

Also Read- RGV – Chiranjeevi: చిరంజీవితో సినిమా క్యాన్సిల్ అవడానికి కారణం ఎవరంటే..?

‘అది బ్యూటీ’ అని జగపతిబాబు అనగానే.. ‘వచ్చావ్.. చాలా పెద్ద మనిషి తరహాగా.. చాలా కుదురుగా ఉన్నావ్’ అని నాగ సుశీల అన్నారు. ‘తాగానా.. ఆరోజు?’ అని జగపతిబాబు అంటే.. ‘తాగలేదు’ అని సుశీల సమాధానం చెప్పారు. అంటే ఈ తాగడం పెద్ద ప్రాబ్లమా? అని నాగ్ అంటే.. ‘నువ్వే ప్రాబ్లమ్ చేస్తున్నావ్’ అంటూ జగపతిబాబు అన్నారు. ఇలా వీరి మధ్య ఆహ్లాదకరంగా సంభాషణ నడిచింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ షో జీ తెలుగులో ఆగస్ట్ 17న రాత్రి 9 గంటలకు, అలాగే ఆగస్ట్ 15 నుంచి జీ5 ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ