cine workers strike: గత కొన్ని రోజులుగా జరుగుతున్న సినీ కార్మికుల సమ్మె కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘ఈ రోజు చిరంజీవిని కలిసి సమస్యలు మొత్తం చెప్పాము. దీని గురించి చిరంజీవి కూడా చాలా పాటుపడుతున్నారు. ప్రతిరోజు ఈ సమస్య సాల్వ్ అవ్వాలని మాతో ఫాలోప్ చేస్తూనే ఉన్నారు. రేపు ఫెడరేషన్ వారు చిరంజీవిని కలవనున్నారు. దీంతో సమస్య తీరుతుందని ఆశిద్దాం. నిర్మాతలు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. చిన్న నిర్మాతలు అయితే బాగా సఫర్ అవుతున్నారు. అందుకు తన వంతుగా కార్మికులతో మాట్లాడతానన్నారు. ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ కూడా సమస్య పరిష్కారానికి ఆయన వంతు కృషి చేస్తున్నారు. నేను ఛాంబర్ కు కౌన్సిల్ ఫెడరేషన్ దూతగా ఉన్నాను.. నాకున్న అనుభవంతో ప్రాక్టీకల్ గా ఉండే సమస్యలను వివరించాను.’ అని అన్నారు.
Read also- Udaya bhanu: రియాలిటీ షోస్ లో చూపించేది నిజం కాదా? సంచలన కామెంట్స్ చేసిన ఉదయభాను
ఇప్పటికే టాలీవుడ్ నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవిని కలిసిన విషయం తెలిసిందే. ‘ఫెడరేషన్ వారు రేపు కాలుస్తారు. ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువే గానే ఇక్కడ కార్మికులకు టారీఫ్ ఉంది. చిరంజీవి ఇరు వర్గాలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఉన్నారు. నిర్మాతల ప్రతిపాదనలను గతంలోనే ఒప్పుకున్నా ఇంకా అమలు లోకి రావటం లేదు. నిర్మాతల వీక్నెస్ వల్లే అవి జరగటం లేదు. అయితే అవేమి కష్టమైనవి కాదు.. వర్కర్స్ ను కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంది. లేబర్ కమీషనర్ రికార్డ్ రూల్స్ ప్రకారం సినిమాలకు వర్క్ చేయలేము.. మేమంతా కలిసి ఓ ఫ్యామిలీ లా వర్క్ చేసుకోవటం అలవాటు అయిపొయింది.’ అంటూ చెప్పుకొచ్చారు.
Read also- Crime News: రామంతపూర్ బాలుని హత్య కేసులో నిందితుడు అరెస్ట్.. ఏం చేశాడంటే!
ఇటీవలి చర్చలు
ఫిల్మ్ ఛాంబర్ భేటీలు: నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులు ఫిల్మ్ ఛాంబర్‌లో పలు సార్లు చర్చలు జరిపారు(cine workers strike). కానీ ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదు.
ప్రభుత్వ జోక్యం: నిర్మాతలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సమావేశమయ్యారు. దిల్ రాజు నేతృత్వంలో 15 మంది ప్రముఖ నిర్మాతలు ఈ భేటీల్లో పాల్గొన్నారు. అయితే, మంత్రి దుర్గేష్ ఈ విషయంలో ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకోదని, ఫిల్మ్ ఛాంబర్ ఫెడరేషన్ మధ్య ఒప్పందం ద్వారా పరిష్కరించాలని స్పష్టం చేశారు.