Digital Arrest Scam: బెంగళూరు స్టేట్‌లో జరిగే అసాంఘిక చర్యల్లో మీకు భాగస్వామ్యం ఉందని.. మిమ్ములను డిజిటల్ అరెస్ట్ చేస్తామని నల్గొండ(Nalgonda) పట్టణ కేంద్రానికి ఓ రిటైర్డ్ ఉద్యోగికి సైబర్ నేరస్తులు వార్నింగ్ ఇవ్వడంతో వారు అడిగినంత నగదును బదిలీ చేసేందుకు సిద్ధం కాగా ఎస్ బీఐ మేనేజర్, సైబర్ క్రైమ్ డీఎస్పీ ఎంట్రీతో నగదు బదిలీకి బ్రేక్ పడింది. నగదు బదిలీ కాకుండా రక్షించారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలో వెలుగు చూసిన ఈ సంఘటన పై సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
రూ.18 లక్షలు డిపాజిట్..
నల్లగొండ పట్టణానికి చెందిన రిటైర్డ్ టీచర్ పుచ్చకాయల దేవేందర్ రెడ్డి(Puchakayala Devender Reddy) పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త సిమ్ తీసుకున్నారు. సదరు విశ్రాంత ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు ఫోన్లు చేసి బెంగళూరులో ఇల్లీగల్ చేస్తున్నట్టుగా ఆరోపణలు చేసి బెదిరించారు. అరెస్ట్ కాకుండా ఉండాలంటే తామిచ్చే అకౌంట్ నంబర్‌కు వెంటనే రూ.18 లక్షలు డిపాజిట్ చేయాలని డిమాండ్ చేశారు. వారి బెదిరింపులకు భయపడి బాధితుడు ప్రకాశం బజార్‌లోని ఎస్‌బీఐ బ్యాంక్‌కి వెళ్లి రూ.18 లక్షలు డిపాజిట్ చేయాలని మేనేజర్‌ను కోరాడు.
Also Read: BSNL: దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ కొత్త యాప్ ప్రారంభం.. కస్టమర్ ఆన్‌బోర్డింగ్ కోసం సంచార్ మిత్ర
నేరగాళ్లకు కాల్ చేసి ప్రశ్నించగా..
దీంతో అనుమానం వచ్చిన మేనేజర్ వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తక్షణమే సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ(DSP Lakshminarayana), ఎస్‌ఐ విష్ణుకుమార్(SI Vishnu Kumar), సిబ్బంది అక్కడికి చేరుకుని దేవేందర్ రెడ్డిని విచారించారు. అతడికి వచ్చిన ఫోన్ కాల్ లిస్ట్‌ను పరిశీలించి సైబర్ నేరగాళ్లకు తిరిగి కాల్ చేసి ప్రశ్నించగా వారు తడపడుతూ వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. అనంతరం సైబర్ క్రైమ్ డీఎస్పీ మాట్లాడారు. డిజిటల్ అరెస్ట్ పేరిట ఫోన్, వీడియో కాల్స్ వస్తే www.cybercrime.gov.in లో, 1930 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసి రిపోర్ట్ చేయాలని చెప్పారు. ఇన్ టైంలో స్పందించి సైబర్ నేరగాళ్ల భారీన పడకుండా కాపాడిన నల్లగొండ సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఎస్ఐ విష్ణు, హెడ్ కానిస్టేబుల్ రియాజ్, కానిస్టేబుల్ మోక్షిద్ లను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.
Also Read: IND vs SA 5th T20I: కొద్ది గంటల్లో ఐదో టీ20.. టీమిండియాలో భారీ మార్పులు.. ఈ ఇద్దరు స్టార్లు ఔట్!

