Women-Cricketers (Image source Twitter)
లేటెస్ట్ న్యూస్, స్పోర్ట్స్

India Women Cricketers: వరల్డ్ కప్ గెలిచాక భారీగా పెరిగిన మహిళా క్రికెటర్ల బ్రాండ్ వ్యాల్యూ.. ఏ స్థాయిలో అంటే?

India Women Cricketers: క్రికెట్ చరిత్రలో తొలిసారి భారత మహిళల జట్టు ఉమెన్స్ వరల్డ్ కప్-2025ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి ప్రపంచ కప్ కలను నెరవేర్చుకుంది. దీంతో, టీమిండియా ఉమెన్ క్రికెటర్ల బ్రాండ్ వ్యాల్యూ భారీగా పెరిగింది. క్రీడాకారిణుల బ్రాండ్ ఎండార్స్‌మెంట్ (ప్రకటనల) పేమెంట్ ఇప్పటికే 25 శాతం నుంచి 100 శాతం వరకు పెరిగినట్టుగా తెలుస్తోంది. ‘ఎకనామిక్ టైమ్స్’ కథనం ప్రకారం, జెమిమా రోడ్రిగ్స్, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, షఫాలీ వర్మ వంటి కీలకమైన ప్లేయర్లకు బ్రాండ్ ఎండార్స్‌మెంట్ అప్పగించేందుకు పరిశీలనలు మొదలయ్యాయి.

మంగళవారం ఉదయం నుంచి కొన్ని బ్రాండ్లు (కంపెనీలు) పరిశీలన మొదలుపెట్టాయని, పెద్ద సంఖ్యలో కంపెనీలు సంప్రదింపులు చేస్తున్నాయని ‘బేస్‌లైన్ వెంచర్స్’ మేనేజింగ్ డైరెక్టర్ తుహిన్ మిశ్రా చెప్పారు. కంపెనీలు విపరీతంగా వివరాలు తెలుసుకుంటున్నాయన్నారు. కొత్త ఒప్పందాలు మాత్రమే కాకుండా, కాంట్రాక్ట్ ఫీజులలో 25-30 శాతం కంటే ఎక్కువ పెంచాలనే విజ్ఞప్తులకు సంబంధించిన ఒప్పందాలపై కూడా పునఃచర్చలు జరుగుతున్నాయని తుహిన్ మిశ్రా వివరించారు.

Read Also- Gopichand P Hinduja: వ్యాపార రంగంలో తీరని విషాదం.. హిందూజా గ్రూప్ ఛైర్మన్ కన్నుమూత

జెమిమా బ్రాండ్ వ్యాల్యూ భారీగా పెరుగుదల

సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై అద్భుతమైన పోరాటం చేసిన బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ బ్రాండ్ వ్యాల్యూ భారీగా పెరిగింది. 338 పరుల లక్ష్య చేధనలో ఏకంగా 127 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన ఆమె ప్రదర్శన అభిమానులనే కాదు. వ్యాపార కంపెనీల సైతం ఆకర్షించింది. దీంతో, జెమిమా రోడ్రిగ్స్ బ్రాండ్ విలువ 100 శాతం పెరిగినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. జెమిమా ప్రకటనల వ్యవహారాలు చక్కబెట్టే ఏజెన్సీ ‘జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్’ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కరణ్ యాదవ్ స్పందిస్తూ, ఆస్ట్రేలియాపై మ్యాచ్ పూర్తయిన వెంటనే ప్రకటనలకు సంబంధించిన విజ్ఞప్తులు వరదలా వచ్చాయని వివరించారు. 10 – 12 విభాగాలకు చెందిన బ్రాండ్లతో సంప్రదింపులు జరుపుతున్నామని వివరించారు.

Read Also- CM Revanth Reddy: జర్మనీ టీచర్లను నియమిస్తాం.. విద్యార్థులకు భాష నేర్పిస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి

జెమిమాకు రూ.1.50 కోట్లు

ఒప్పందం ఎంతకాలం ఉంటుంది, చేయాల్సిన ప్రకటనలు ఎన్ని అనే అంశాల ఆధారంగా జెమిమా ప్రస్తుత బ్రాండ్ ఎండార్స్‌మెంట్ కోసం రూ. 75 లక్షల నుంచి రూ.1.5 కోట్ల వరకు ఫీజు వసూలు చేస్తుందని సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక, బ్రాండ్ అండార్స్‌మెంట్ వ్యాల్యూ విషయంలో స్మృతి మంధాన టాప్‌లో కొనసాగుతోంది. దేశంలోనే అత్యధిక ఆదాయం సంపాదిస్తున్న మహిళా క్రికెటర్‌గా ఉంది. ఇప్పటికే 16 బ్రాండ్‌లను ఆమె ప్రమోట్ చేస్తోంది. ఈ జాబితాలో హెచ్‌యూఎల్ బ్రాండ్‌కు చెందిన రెక్సోనా డియోడరెంట్, నైక్, హ్యుందాయ్, హెర్బలైఫ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), గల్ఫ్ ఆయిల్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మెట్‌లైఫ్ ఇన్సూరెన్స్ వంటివి ఉన్నాయి. తన ఎండార్స్‌మెంట్‌ల ద్వారా ఒక్కో బ్రాండ్‌కు సుమారు రూ. 1.5-2 కోట్లు వరకు సంపాదిస్తున్నట్లు సమాచారం. ముంబైలో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌ గెలవడంతో భారత మహిళా క్రికెటర్లకు అపూర్వమైన క్రేజ్ ఏర్పడింది. చాలామంది క్రికెటర్ల సోషల్ మీడియా ఖాతాలకు ఈ రెండు రోజుల్లో ఫాలోయర్లు భారీగా పెరిగిపోయారు.

Just In

01

Wife Shocking Plot: కట్టుకున్న భర్తనే కిడ్నాప్ చేయించింది.. దర్యాప్తులో నమ్మలేని నిజాలు

Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. అవినీతి అక్రమాలపై అదనపు ఎస్పీ శంకర్ విచారణ షురూ.. వెలుగులోకి సంచలనాలు

Revanth Reddy: ఈ నెల 11 లోగా కేసీఆర్‌ను అరెస్ట్ చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Tandur Protest: తాండూర్‌లో హైటెన్షన్.. పార్టీలకు అతీతంగా భారీగా కదిలొచ్చిన నేతలు..?

Baahubali rocket: ‘బాహుబలి’ సినిమా మాత్రమే కాదు.. తెలుగు ప్రజల గౌరవం..