Sanitation Crisis: గ్రామాల్లో సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు ఇండ్లల్లో జమచేసే చెత్తను, రోడ్లపై పడేసిన చేదారాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుద్ద్య కార్మికులు ఎంతో కృషి చేస్తున్నారు. కానీ ఆ కార్మికులు చేసే పని బుడిదలో పోసిన పన్నీరులాగా అయ్యిపోతుంది. వీధుల్లో కుప్పనుడ్చిన చెత్త, ఇండ్లల్లో తీసుకునే చెత్త వేసుకునేందుకు ట్రాక్టర్లు, ట్రాలీ ఆటోలు నడిచే పరిస్థితి లేకుండా పోయింది. అంతేకాకుండా గ్రామంలో ఉప్పోంగిన మురుగు కాల్వను, పలిగిపోయిన నీటి పైపులైన్, రాకపోకలకు ఇబ్బంది కరమైన రోడ్ల మరమ్మత్తులకు అవసరమైన పనులు చేయాలంటే నగదు తప్పనసరి. ఆ నగదు లేకపోవడంతో నిర్వహాణ చేయాలేని దుస్థితిలో గ్రామ పంచాయతీలున్నాయి.
Also Read: Sanitation Crisis: గ్రామాల్లో పేరుకుపోతున్న చెత్త కుప్పలు.. పట్టించుకోని అధికారులు
మేజర్ పనులకు ఖర్చు
మొన్నటి వరకు ఉన్నతాధికారుల ఆదేశాలతో కార్యదర్శులు అప్పోసప్పో చేసి మేజర్ పనులకు ఖర్చు చేశారు. చాలా రోజులుగా ఖర్చు చేస్తున్న నగదు ఇవ్వాలని కార్యదర్శులు ఉన్నతాధికారులను అడిగితే ఎవ్వరు పెట్టుకోమని చెప్పారని సమాధానం వచ్చింది. దీంతో షాక్‌కు గురైన కార్యదర్శులు గ్రామాల్లో చెత్త సేకరణ చేసే ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లను వాడకుండా ఉండేందుకు కంకణం కట్టుకొని సంబంధిత మండలాధికారులకు తాళాలను అప్పగించినట్లు తెలుస్తోంది. కార్మికుల వేతనాలు ఇవ్వడంతో గ్రామంలోని సమస్యలకు పరిష్కారం కాదని, నిర్వహాణ కోసం అయ్యే ఖర్చులను ప్రభుత్వం విడుదల చేయాల్సిందే. ఇలాగే పరిపాలన సాగిస్తే గ్రామాలన్ని చెత్త కుప్పల్లాగా పేరుకపోతాయిని స్థానికులు వివరిస్తున్నారు.
నిధులు నిల్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులను పూర్తిగా నిలిపివేయడం జరిగింది. పంచాయతీల్లో ప్రజాప్రతినిధుల కాల పరిమితి ముగిసిపోవడంతో ప్రత్యేక అధికారుల పాలనతో గత 20 నెలలుగా కొనసాగుతుంది. దీంతో ప్రత్యేక అధికారులు గ్రామాలకు పేరకు మాత్రమే వ్యవహారిస్తున్నారు. కానీ ఆ గ్రామాల పరిస్థితిని అటువైపు తొంగి చూడటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏ సమస్య వచ్చిన పంచాయతీ కార్యదర్శులపై అధికారులు ఓత్తిడి పెట్టి పనిచేయిస్తున్నారనే వాధన వినిపిస్తుంది. జిల్లా పంచాయతీ అధికారులు మాత్రం కార్యదర్శులకు ఏకకంగా ఎవరు డబ్బులు పెట్టుకోని పనిచేయించమని చేబుతున్నారనే విమర్శలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతుంది.
ఈవిధంగా పంచాయతీల్లో సమస్యలు పట్టించుకునే నాధుడే కరువైయ్యారు. గ్రామా ల్లో పారిశుధ్యం పడకేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉన్నా పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. గ్రామాల్లో ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోయింది. ఇటీవల కురిసిన వర్షానికి ఆది మొత్తం తడిసిపోయి దుర్గంధం వెదజల్లుతోంది. పారిశుధ్యం మెరుగుపర్చాలనే ఆలోచన ఎవ్వరికి లేనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. రంగారెడ్డి జిల్లాలోని 602, వికారాబాద్ జిల్లాలోని 405 గ్రామాల్లో నిర్వహాణ పరిస్థితి ఘోరంగా ఉన్నట్లు క్షేత్ర స్థాయి పరిశీలనతో అర్ధమైతుంది.
సీజనల్ వ్యాధులకు చర్యలేవీ?
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో సీజనల్ వ్యాధులు అధికమైయ్యే పరిస్థితి గ్రామాల్లో కనిపిస్తోంది. రోడ్లపై చెత్త చేదారం పేరుకపోవడంతో తడిసి దోమలు, ఈగలు విజృంభిస్తాయి. దీంతో చిన్నారులకు తోందరగా వైరల్ విష జ్వరాలతో ఇబ్బందిపడే అవకాశం ఉంది. అంతేకాకుండా 65 యేండ్లకు పైబడిన వృద్దులకు వ్యాధులు సంక్రమించే అవకాశం లేకపోలేదు. ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు గ్రామాల్లో చెత్తను తొలగించడంతోపాటు మురుగునీటిని బయటకు పంపి బ్లీచింగ్ చల్లాలి. ఉన్నతాధికారులు సైతం క్షేత్రస్థాయిలోని అధికారులకు ఆదేశాలిస్తున్నా అమలు అయ్యే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందోనని భయంతో చేతి నుంచి నగదు పెట్టేందుకు కార్యదర్శులు వెనుకడుగు వేస్తున్నారు. ఇప్పటి వరకు గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి వెచ్చించిన నగదును చెల్లించడంలో జాప్యం జరుగుతుంది. ఈవిషయాలన్ని దృష్టిలో పెట్టుకోని ఎవ్వరికి వారు జాగ్రత్తలు తీసుకోని మేల్కోంటున్నారు. ప్రజలు ఏవిధంగా మెల్కోనాల్లో తెలుసుకోని ఇకనైనా నడుచుకోవాల్సిన బాధ్యతను పరిస్థితులు కల్పిస్తున్నాయి.
ఇదీ గ్రామాల్లో పరిస్థితి
యాచారం మండలంలో 24 గ్రామపంచాయతీ ఉన్నాయి.. ప్రభుత్వం నుండి నిధులు రాకపోవడంతో పంచాయతీ సెక్రెటరీలు అప్పులు చేసి మరికొందరు దాతలను ఆశ్రయించి చెత్త సేకరణకు టాక్టర్ డీజిల్ కు ఖర్చు చేస్తున్నారు. తలకొండపల్లి మండలంలోని 32 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ప్రస్తుతం గత నాలుగు రోజుల నుండి మా మండలంలోని అన్ని గ్రామాల్లో చెత్త ట్రాక్టర్లకు ప్రభుత్వ నుండి డీజిల్‌కు డబ్బులు రాకపోవడంతో, పంచాయితీ కార్యదర్శులు అందరూ స్థానిక ఎంపీడీవోలకు ట్రాక్టర్ల తాళాలను ఇచ్చారు. ప్రస్తుతం ట్రాక్టర్లు నిలిచిపోవడంతో చెత్త మొత్తం గ్రామాల్లోని ఖాళీ ప్రదేశాల్లో పడవేస్తున్నారు. ఆమనగల్లు మండలంలో 13 గ్రామ పంచాయతీలు ఉండగా చెత్త సేకరించే ట్రాక్టర్ నిర్వహణ ఖర్చులు గత కొన్ని నెలల నుండి పెండింగ్లో ఉండటంతో, ట్రాక్టర్ నిర్వహణ నిర్వహించలేమని అన్ని గ్రామ పంచాయతీల ట్రాక్టర్ తాళాలు ఎంపీఓకు రెండు రోజుల క్రితం అందజేశారు. ప్రస్తుతము చెత్త సేకరించకపోవడంతో కుప్పలుగా పేరుకుపోయాయి.
గ్రామ పంచాయతీ పరిధిలో చెత్త సమస్య ఎక్కువగా ఉంది
–కేశంపేట మండలంలో 29 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ప్రస్తుతం గత రెండు రోజుల నుండి మా మండలంలోని అన్ని గ్రామాల్లో చెత్త ట్రాక్టర్లకు ప్రభుత్వం నుండి డీజిల్ డబ్బులు రాకపోవడంతో చెత్త సేకరణ జరగడం లేదు. ట్రాక్టర్ లలో పోయించిన డీజిల్ వున్న గ్రామాలలో మాత్రం చెత్త సేకరణ జరిగింది. పంచాయితీ కార్యదర్శులు గ్రామపంచాయతీలలో ఆర్థిక పనులను నిలిపివేశారు. మహేశ్వరం మండలంలో 30 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మహేశ్వరం గ్రామ పంచాయతీ పరిధిలో చెత్త సమస్య ఎక్కువగా ఉంది.మహేశ్వరం ఎంపిడివో కార్యాలయం నుంచి ఉప్పుగడ్డ తండాకు వెళ్ళే ప్రధాన రహదారి ప్రక్కనే నిత్యం చెత్త వేస్తున్నారు. దీంతో అటువైపు వెళ్ళే వారు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గ్రామంలోని పారిశుధ్యం అస్తవ్యస్తం
మాడ్గుల మండలంలో 34 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ట్రాక్టర్ తో చెత్త గ్రామాల నుండి తరలించలేక కార్యదర్శులు ఇబ్బందులకు గురవుతున్నారు. చిన్న గ్రామ పంచాయతీలలో కార్యదర్శులు ఒక లక్ష నుండి రెండు లక్షల వరకు సొంతంగా ఖర్చు చేస్తూ చెత్తను తరలిస్తున్నట్లు చెప్పారు. కొత్తూరు మండలంలో 12 గ్రామ పంచాయతీ లు ఉన్నాయి. చెత్త ట్రాక్టర్ నిర్వహణ బానే ఉన్నా… తడి పొడి చెత్తను వేరు చెయ్యడం లేదు. ఆ చెత్తను కాలుస్తున్నారు. పెద్దెముల్ మండలంలో మొత్తం 37 గ్రామ పంచాయితీలు ఉన్నాయి, ప్రతి గ్రామంలోని పారిశుధ్యం అస్తవ్యస్తంగా తయారైంది.
ప్రజలు ఇబ్బంది
స్పెషల్ ఆఫీసర్లు నామా మాత్రంగానే ఉన్నారు, చిన్న చిన్న పనులకు పంచాయితీ కార్యదర్శులు సొంత డబ్బులు పెట్టీ పనులు చెపిస్తున్నారు. మరి కొందరు పంచాయితీ కార్యదర్శులు చేతులేస్తున్నారు, పలు గ్రామాలలో చెత్త ట్రాక్టర్ల సేవలు నిలిచిపోయాయి, వర్షాకాలం ప్రారంభం కావడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బొంరాస్పేట్ మండలంలో 47 గ్రామపంచాయతీలు ఉన్నాయి. పరిపాలన ప్రభుత్వ చెత్త ట్రాక్టర్లు సరైన నిర్వహణ లేక రిపేర్ కి వస్తున్నాయి. మర్పల్లి మండలంలో 28 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కొన్ని గ్రామ పంచాయతీలో చెత్త ట్రాక్టర్ నిర్వహణ సక్రమంగానే ఉంది. ఎక్కువగా చిన్న పంచాయతీలలో డబ్బులు లేక వృధాగా పడి ఉన్నాయి.
Also Read: Sanitation Crisis: గ్రామాల్లో పేరుకుపోతున్న చెత్త కుప్పలు.. పట్టించుకోని అధికారులు
