OYO Room Suicide: ఓయో రూమ్‌లో యువకుడు సూసైడ్
OYO Room Suicide (Image Source: Twitter)
క్రైమ్

OYO Room Suicide: ఓయో రూమ్‌లో యువకుడు సూసైడ్.. మరణానికి ముందు తండ్రికి ఫోన్.. ఏం చెప్పాడంటే?

OYO Room Suicide: ఓయో రూమ్ లో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో చోటుచేసుకుంది. ఆన్ లైన్ బెట్టింగులతో అప్పుల పాలైన అఖిల్ (30).. ఈ బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. రామచంద్రాపురం పోలీసు స్టేషన్ పరిధిలోని బీరంగూడ కమాన్ పక్కన ఉన్న లావీ షోక్ ఓయో హోటల్ లో గదిని అఖిల్ అద్దెకు తీసుకున్నాడు.

అనంతరం తన తండ్రి సంగీత్ రావుకు ఫోన్ చేసి.. ఆత్మహత్య చేసుకుంటున్న విషయాన్ని తెలియజేశాడు. క్రికెట్ బెట్టింగ్ లో మోసపోయి అప్పులపాలైనట్లు తండ్రితో చెప్పుకొని అఖిల్ కుమిలిపోయాడు. అనంతరం రూంలోని ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Also Read: Delhi Blast Case: దిల్లీలో భారీ పేలుడు.. కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం.. రంగంలోకి ఎన్ఐఏ

తండ్రి ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న రామచంద్రాపురం పోలీసులు.. ఓయో రూమ్ లోని అఖిల్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. పటాన్ చెరువు ప్రభుత్వ ఆస్పత్రిలో అఖిల్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అఖిల్ ఫ్యామిలీ రామచంద్రాపురంలోని సాయినగర్ లో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్య చేసుకునేలా ఎవరైనా అఖిల్ ను పురిగొల్పారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Delhi Blast: కీలక అనుమానితుడు డాక్టర్ ఉమర్ కుటుంబ సభ్యులు ఏమంటున్నారో తెలుసా?

Just In

01

Ugandhar Muni: ఎవరి మనోభావాలు దెబ్బ తీయకుండా.. ‘శంబాల’ కథ రాశా!

Mana Shankara Varaprasad Garu: పూనకాలు లోడింగ్.. ‘మెగా విక్టరీ మాస్ సాంగ్’ డేట్ ఫిక్స్!

Jwala Gutta: శివాజీ వివాదంపై గుత్తా జ్వాల ఘాటు వ్యాఖ్యలు.. పోస్ట్ వైరల్!

Indian Railways: రైల్వేస్ కీలక నిర్ణయం… ప్యాసింజర్లకు గుడ్‌న్యూస్!

Chamala Kiran Kumar Reddy: దమ్ముంటే కేసీఆర్‌ను అసెంబ్లీకి తీసుకురా.. ఎంపీ చామల కేటీఆర్‌కు సవాల్!