GHMC ( image credit: swetcha reporter)
హైదరాబాద్

GHMC: ఫుటోవర్ బ్రిడ్జిలపై అధ్యయనం.. స్టడీ చేసి నివేదికలను సమర్పించాలని ఆదేశం

GHMC: గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకి పెరుగుతున్న రద్దీ, ట్రాఫిక్ కారణంగా పాదచారుల రాకపోకలు కష్టతరమవుతున్నాయి. వీరి కష్టాలను కొంతమేరకైనా తగ్గించేందుకు రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు జీహెచ్ఎంసీ సిటీలోని పలు రద్దీ ప్రాంతాల్లో ఫుటోవర్ బ్రిడ్జులను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లో పాదచారులు సురక్షితంగా రోడ్డు దాటేందుకు వీలుగా వీటిని ఏర్పాటు చేశారు. వీటిలో కొన్నింటిని బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ ఫర్ (బీఓటీ) ప్రాతిపదికన ప్రైవేటు సంస్థలకు అప్పగించగా, మరి కొన్నింటి నిర్వహణ బాధ్యతలను జీహెచ్ఎంసీ చేపట్టింది.

Also Read: GHMC: అంతా మీ ఇష్టమా.. మా అనుమతులు తీసుకోరా.. జలమండలిపై జీహెచ్ఎంసీ గరం గరం

30 ఫుటోవర్ బ్రిడ్జిలపై జీహెచ్ఎంసీ అధ్యనయం

పాదచారులకు మరింత సౌకర్యంగా వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు తొలి దశగా 30 ఫుటోవర్ బ్రిడ్జిలపై జీహెచ్ఎంసీ అధ్యనయం చేసేందుకు సిద్దమైంది. ముఖ్యంగా ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ 30 ఫుటోవర్ బ్రిడ్జిల ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ఏమైన మరమ్మతులు అవసరమా? ఎస్క్యులేటర్లు అవసరమా? అన్న వివిధ అంశాల ప్రాతిపదికన జీహెచ్ఎంసీ మెయింటనెన్స్ విభాగం ఇంజనీర్లు ఈ అధ్యయనాన్ని నిర్వహించి, నివేదికలను సమర్పించాలని ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం.

బ్రిడ్జికి ఎస్క్యులేటర్ ఉన్నాయా?

ప్రస్తుతం తొలి దశగా ఎంపిక చేసుకున్న 30 ఫుటోవర్ బ్రిడ్జిల్లో ఏఏ ఫుటోవర్ బ్రిడ్జికి ఎస్క్యులేటర్ ఉన్నాయా? ఉంటే దాని పనితీరు వంటి అంశాలపై కూడా ఇంజనీర్లు స్టడీ చేసి, వాటిని ప్రస్తుతం పెరిగిన పాదచారుల రాకపోకలకు అనుకూలంగా అప్ డేట్ చేయనున్నట్లు తెలిసింది. ప్రతి ఏటా హైదరాబాద్, రాచకొండ, సైబరాబాత్ మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో 150 మందికి పైగా పాదాచారులు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కొల్పోతున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలిసింది.

లిఫ్ట్ లు ఏర్పాటు చేయాలి

రోడ్లు దాటే సమయంలో కొందరు, ఫుట్ పాత్ ల పక్కన నడుచుకుంటూ, మరి కొందరు ప్రమాదాల బారిన పడుతున్నట్లు గుర్తించి, ఈ సంఖ్యను వీలైనంత మేరకు తగ్గించేందుకు ఫుటోవర్ బ్రిడ్జిలను అదనంగా ఏర్పాటు చేయటంతో పాటు ఉన్న వాటిని మరింత మెరుగ్గా అందుబాటులోకి తీసుకురావాలని జీహెచ్ఎంసీ భావిస్తున్నట్లు తెలిసింది. కొన్ని ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఉన్నా, మెట్లు ఎక్కి దిగలేక పాదచారులు రోడ్డు దాటుతున్నట్లు జీహెచ్ఎంసీ గుర్తించింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అవరమైన చోట ఎస్క్యులేటర్ తో పాటు లిఫ్ట్ లు ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది.

ఒకవైపు స్టడీ..మరో వైపు మెయింటనెన్స్

జీహెచ్ఎంసీ ఇప్పటి వరకు సిటీలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫుటోవర్ బ్రిడ్జిల్లో ఒక్క దిల్ సుఖ్ నగర్ మినహా మిగిలిన ప్రాంతాల్లోని ఫుటోవర్ బ్రిడ్జిలను పాదచారులు ఆశించిన స్థాయిలో వినియోగించటం లేదన్న విషయాన్ని కూడా అధికారులు గుర్తించారు. అలాగే కొద్ది నెలల క్రితం హెచ్ఎండీఏ ఉప్పల్ జంక్షన్ లో ఏర్పాటు చేసిన స్కై వాక్ కూడా ఇపుడిపుడే ఆశించిన స్థాయిలో వినియోగంలోకి వస్తుంది. ఎఫ్ఓబీ లు అందుబాటులో ఉన్న చోట కూడా ఎస్క్యులేటర్లు, లిఫ్ట్‌లు పనిచేయడం లేదని పాదచారులు వాపోతున్నారు. ప్రధానంగా ప్రస్తుతం ఉన్న ఎఫ్ఓబీలు రెండు, మూడేళ్ల క్రితం అందుబాటులోకి వచ్చాయి.

5 జోన్లలో కొద్ది రోజుల్లో పనులు స్టడీ

అయితే నిర్వహణ భాధ్యతలను నిర్మించిన ఏజేన్సీలు రెండేళ్లపాటు మాత్రమే చేపడుతాయి. ఇలా రెండేళ్ల తరువాత నిర్వహణ బాధ్యతలను వదిలేయడంతో కొన్నిచోట్ల సమస్య ఏర్పడిన విషయాన్ని గుర్తించిన జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ నేరుగా జీహెచ్ఎంసీ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ అధికారులు నిర్వహణ బాధ్యతలు చేపట్టాలని ఆదేశించారు. కొన్నింటికి గడువు ఇంకా ఉంది. అయితే వాటిని ఏజేన్సీలతో చేయించడంతో అధికారులు పర్యవేక్షించాలని కమిషనర్ సూచించినట్లు తెలిసింది. ఓ పక్కన వీటిపై అధ్యనయం చేయటంతో పాటు నిర్వహణ బాధ్యతలను కూడా మెయింటనెన్స్ విభాగం ఇంజనీర్లు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఖైరతబాద్ జోన్ లో నిర్వహణ పనులు కూడా ప్రారంభించారు. మిగతా5 జోన్లలో కొద్ది రోజుల్లో పనులు స్టడీ, నిర్వహణ బాధ్యతలను మొదలు పెట్టనున్నట్లు తెలిసింది.

అవసరమైన చోట్ కొత్త ఎఫ్ఓబీలు

ప్రస్తుతం ఉన్న ఎఫ్ఓబీలు ఎలా ఉన్నాయన్న దాంతో పాటు ఎస్క్యులేటర్లు ఉండి, పాడైపోయి ఉంటే వాటికి వెంటనే మరమ్మతులు చేయనున్నారు. అలాగే ఎక్కువ రద్దీ ఉండే ప్రాంతాల్లో కొత్తగా మరిన్ని ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించేందుకు అక్కడ రాకపోకలు సాగిస్తున్న పాదచారుల సంఖ్యను పరిగణలోకి తీసుకుని ఫీజుబిల్టి టెస్టును నిర్వహించనున్నారు. పాదచారులు రోడ్లు దాటుతూ ప్రమాదాల బారిన పడకుండా, ఎఫ్ఓబీ లను వినియోగించేలా ప్రోత్సహించడానికి జీహెచ్‌ఎంసీ ఈ ప్రతిపాదనను సిద్ధం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులు మెట్లు ఎక్కడానికి పడుతున్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని, అవసరమైన చోట్ల ఎస్క్యులేటర్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. రద్దీ, ట్రాఫిక్ లో భాగంగా పాదచారుల రాకపోకలు ఎక్కువగా ఉండి, గతంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరిగిన ప్రాంతాల్లో తొలి ప్రాధాన్యత కింద ఎస్క్యులేటర్లు,స లిఫ్టులతో కూడిన ఫుటోవర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేయటంతో పాటు వాటి వినియోగం పెరిగితే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు.

Also Read: GHMC: జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లపై తీవ్ర విమర్శలు.. ఏం చేయడంలేదో తెలుసా?

Just In

01

Huzurabad: విద్యార్థులతో ధ్యాన మహాయజ్ఞం.. ఏకాగ్రత కోసం ధ్యానం నిత్యకృత్యం కావాలి : కమిషనర్ సమ్మయ్య

Delhi Blast: ఢిల్లీ పేలుడు న్యూస్ చూసి.. ముగ్గురు కొడుకులకు తండ్రి ఫోన్.. ఆఖరికి ఆయన ఊహించిందే జరిగింది

The Girlfriend: సక్సెస్ సెలబ్రేషన్స్‌కి సిద్ధమవుతున్న‘ది గర్ల్‌ఫ్రెండ్’ టీమ్.. చీఫ్ గెస్ట్ ఎవరంటే?

GHMC: ముమ్మరమైన రోడ్ సేఫ్టీ డ్రైవ్.. ఇప్పటి వరకూ వరకు 20 వేల 337 గుంతలు పూడ్చివేత!

Huzurabad: జాతీయస్థాయి కరాటే పోటీల్లో.. హుజూరాబాద్ విద్యార్థుల అద్భుత ప్రదర్శన!