Sanitation Crisis: మండల పరిధిలోని వట్టి ఖమ్మం పహాడ్ గ్రామ ఊరు బయట చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. సేవాలాల్ తండ లో రోడ్లపై పెంట దిబ్బలు, మున్యా నాయక్ తండ స్మశాన వాటిక వెళ్లే మార్గంలో రోడ్లపైనే చెట్లు కొమ్మలు ఉండడం వాహన దారులకు రాకపోకలకి ఇబ్బంది గురైతున్నారు, ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామాల్లో పారిశుధ్యం (Sanitation Crisis) పడకేసిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామంలో రోజుల తరబడి రోడ్డు వెంట పడవేసి ఉండడంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని సమాచారం. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు లేకపోవడం వల్ల అధికారులు చుట్టపు చూపుగా వచ్చి గ్రామాల్లో ఫోటోలు దిగి వెళ్ళిపోతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: Sanitation Crisis: గ్రామాల్లో పేరుకుపోతున్న చెత్తాచెదారం.. పట్టించుకునే నాథుడే లేడా?
ప్రజలు పడకుండా తగు జాగ్రత్తలు పాటించాలి
మండలాధికారులు గ్రామ పంచాయతీల పైన ప్రత్యేక దృష్టి సారించి గ్రామాలలో విష జ్వరాల బారిన ప్రజలు పడకుండా తగు జాగ్రత్తలు పాటించాలని స్థానికులు అన్నారు.దాంతో సమస్యల సుడిగుండంలో ప్రజలు సతమతమవుతున్నారు. పల్లెల్లో మురుగు కాలువల పరిస్థితి దయనీయంగా మారడంతో జనం దోమలతో వేగలేకపోతున్నారు. మరమ్మతులు చేపట్టాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఏ గ్రామంలో చూసినా మురుగు కాలువల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. భారీ ఇంకుడు గుంతలు నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. వట్టి ఖమ్మం పహాడ్ మురుగు నీరు చేరుతుండటంతో దుర్వాసనభరించలేకపోతున్నామ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామం నుంచి వెళ్లే దారిలో మురుగు ఎక్కడికక్కడే నిలుస్తోంది. పారిశుధ్య పనులు క్రమం తప్పకుండా చేపట్టకపోవడంతో చెత్తాచెదారంతో నిండిపోయి కాలువలు దోమలకు నిలయంగా మారాయని గ్రామస్తులు వాపోతున్నారు.
అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి తక్షణమే చర్యలు చేపట్టాలి
నిధుల లేమి పేరుతో పంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణను కార్యదర్శులు విస్మరించడంతో వీధుల్లో చెత్త దర్శనమిస్తోంది. ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు బెంబేలెత్తుతున్నారు. దీనికి తోడు పంచాయతీ కార్యదర్శులు పట్టణాల్లో నివాసముంటూ చుట్టపు చూపుగా పంచాయతీలకు వెళ్తున్న కారణంగా చిన్నపాటి అవసరమొచ్చినా, సౌకర్యాల కల్పన కోసమైనా కార్యదర్శుల కోసం వ్యయ ప్రయాసల కోర్చి మండల పరిషత్‌కు చేరుకోవాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీల్లో నెలకొన్న పారిశుధ్యం లోపాన్ని నిర్మూలించేందుకు పర్యవేక్షించాల్సిన అధికారులు సమీక్షలకే పరిమితమవుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి పారిశుధ్య నిర్వహణను తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.