Government Complex: ఏన్కూరు మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ యాడ్ లోని ప్రభుత్వ కాంప్లెక్స్ (Market Complex) లు గత కొన్ని నెలల నుంచి ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వీటిపై అధికారులు ఎందుకు దృష్టి సారించడం లేదు, పట్టించుకోవటం లేదని స్థానిక ప్రజల నుంచి ఆరోపణలు ఉన్నాయి. వ్యవసాయ మార్కెట్ అధికారులు ప్రభుత్వ కాంప్లెక్స్ లోని ఈ షాపులకి పాట జరిపి రెంట్ కి ఇస్తే నెల వారి ప్రభుత్వానికే ఆదాయం వస్తుంది కదా ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నలు ప్రజల్లో తలెత్తుతున్నాయి.
మార్కెట్ యార్డ్ అధికారులు స్పందించి కాంప్లెక్స్ లను పాట జరిపించాలి
ఈ కాంప్లెక్స్ కి 8 షాపులు ఉన్న ఒకటి మాత్రమే రెంటుకి ఇచ్చి మిగతా ఏడు ఎందుకు ఖాళీగా ఉంచుతున్నారు..? ఈ ఏడు షాపులపై ఎందుకు అధికారులు పాట జరిపించడం లేదని స్థానిక ప్రజల్లో ఆరోపణలున్నాయి. కొన్ని నెలల నుంచి ఇలా షాపులు ఖాళీగా ఉండటం వలన పిచ్చి మొక్కలతో దర్శనం ఇస్తున్నాయి. ఈ ఏడు షాపులు ఇలా ఉండటంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండి పడినట్లే కదా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా మార్కెట్ యార్డ్ అధికారులు స్పందించి కాంప్లెక్స్ లను పాట జరిపించాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.
Also Read: Boyinapalli Vinodh Kumar: ఉద్యమానికి భయపడి అప్పట్లో చంద్రబాబు దేవాదుల శంకుస్థాపన: వినోద్ కుమార్
పోషణ మాసం.. ఆరోగ్య రక్షణే లక్ష్యం సిడిపిఓ ఎన్.దయామణి
పోషణ మాసం ఆరోగ్య రక్షణ లక్ష్యంగా పనిచేస్తున్నామని కామేపల్లి ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ ఎన్.దయామణి పేర్కొన్నారు. బుధవారం సింగరేణి మండలం, కారేపల్లి-3 అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన పోషకాహార మాసోత్సవాల వేడుకలలో సిడిపిఓ దయామణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దయామణి మాట్లాడుతూ… గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల శారీరిక, మానసిక ఎదుగుదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పోషకాహారం లోపం ఉన్న పిల్లలను గుర్తించి వారిని సాధారణ స్థితికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
పౌష్టికాహారం తీసుకోవడం వల్ల రక్తహీనత దరిచేరదు
అందరి భాగస్వామ్యంతో ఆరోగ్యవంతమైన జీవితంలో పయనిద్దామన్నారు. మహిళలు, గర్భిణీలు సరైన పోషకాహారం తీసుకుంటే రోగాల బారిన పడకుండా ఉండటమే కాకుండా ఆరోగ్యవంతమైన పిల్లలకు జన్మనివ్వచ్చన్నారు. పౌష్టికాహారం తీసుకోవడం వల్ల రక్తహీనత దరిచేరదని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వనాథపల్లి సెక్టర్ సూపర్వైజర్ జి.రాధమ్మ, అంగన్వాడీ టీచర్లు టి.విజయ కుమారి,బిసుమలత, రజిని, సిహెచ్. విజయ కుమారి, శాంతి, కె.లక్ష్మి, రాజమణి, రోజా, సుజాత, ఇ.లక్ష్మి, గర్భిణీ, బాలింతలు పాల్గొన్నారు.
Also Read: Mallu Bhatti Vikramarka:ఈ సాగు చేసే రైతులకు గుడ్ న్యూస్.. 3,745 కోట్ల పెట్టుబడులు1,518 మందికి ఉపాధి