Swetcha Effect: అక్రమంగా ఫిల్టర్ ఇసుక తయారు చేస్తున్న వారిపై ఎట్టకేలకు గద్వాల రూరల్ ఎస్సై శ్రీకాంత్(SI Srikanth) కేసు నమోదు చేశారు. దర్జాగా ఫిల్టర్ ఇసుక దందా అనే శీర్షికన స్వేచ్ఛలో వచ్చిన కథనానికి ఎస్సై శ్రీకాంత్ స్పందించారు. మోటార్ సాయంతో పంపింగ్ చేయడం ద్వారా మట్టిని వేరు చేయడం ద్వారా ఫిల్టర్ ఇసుక తయారు చేస్తూ గత కొన్నేలుగా ఫిల్టర్ ఇసుక దందా నిర్వహిస్తూ అక్రమ సంపాదనకు తెరలేపారు.
భూమి యజమాని శ్రీనివాస్..
గద్వాల మండలం జిల్లెడు బండ(Jilledu Banda) గ్రామ శివారులోని సర్వే నంబర్ 13 లో గల ఒక ఎకరా 20 గుంటల పొలంలో అక్రమంగా జెసిబి(JCB) తో మట్టిని తవ్వి ఫిల్టర్ ఇసుకను తయారు చేస్తుండగా భూమి యజమాని శ్రీనివాస్ తన పొలంలో మట్టిని ఎలా తవ్వుతారని ప్రశ్నించగా, నీటిపారుదల కాల్వలో పొలం పోయిందని, నీకేం హక్కు ఉందని తిరిగి మమ్మల్ని దౌర్జన్యంగా ప్రశ్నిస్తున్నారని బాధితుడు శ్రీనివాస్ తెలిపారు.
Also Read: Ramachandra Rao: రాష్ట్రంలో ఫ్రీ బస్సు వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి: రాంచందర్ రావు
ఏఎస్ఐ బృందం..
తరచుగా పట్టా భూములలో తవ్వుతూ ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడుతున్నారని బాధితుడు తెలిపాడు. గ్రామ పెద్దల సమక్షంలో జరిగిన సంఘటనపై పంచాయతీ నిర్వహిద్దామని తెలిపిన వారు ముందుకు రావడంతో ఎట్టకేలకు గద్వాల రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఎస్సై ఆధ్వర్యంలో ఏఎస్ఐ బృందం క్షేత్రస్థాయిలో విచారించి అక్రమ ఫిల్టర్ ఇసుక తయారీకి పాల్పడ్డ వారిపై కేసు నమోదు చేశారు. ఏ1. రాజశేఖర్, ఏ2.నగేష్ ఏ 3.కృష్ణయ్య పై కేసులు నమోదైనట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
