Bus Accident (Image Source: Reporter)
ఆంధ్రప్రదేశ్

Bus Accident: మరో రోడ్డు ప్రమాదం.. పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ.. బస్సులో 20 మంది విద్యార్థులు

Bus Accident: బస్సు ప్రమాద ఘటనలో తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతున్నాయి. తాజాగా ఏపీలోని అనంతపురం జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా చింతకుంట ప్రాంతంలో బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. రోడ్డుపక్కన ఉన్న గుంతలో పడి ప్రమాదకర పరిస్థితుల్లో ఆగిపోయింది. ఘటన సమయంలో బస్సులో పలువురు ప్రయాణికులతో పాటు 20 మంది వరకూ స్కూల్ విద్యార్థులు ఉన్నారు.

బస్సు ప్రమాదాన్ని గమనించిన స్థానికులు.. హుటాహుటీన పరిగెత్తుకొచ్చి అందులోని విద్యార్థులను కాపాడారు. బస్సు నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. పుట్లూరు ప్రాంతంలో స్కూల్ విద్యార్థులను ఎక్కించుకొని వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అతి వేగం, డ్రైవర్ అశ్రద్ధ కారణంగానే ఈ ఘటన జరిగిందని విద్యార్థులతో పాటు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

Also Read: KTR On CM Revanth: హైదరాబాద్‌లో ఎక్కడైనా సరే.. సీఎం రేవంత్‌తో చర్చకు రెడీ.. కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్

మరోవైపు ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రయాణికులు ఇచ్చిన ప్రాథమిక సమాచారం ఆధారంగా ఆర్టీసీ డ్రైవర్ పై కేసు నమోదు చేశారు. మరోవైపు ఆర్టీసీ సైతం ఈ ఘటనపై స్పందించింది. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్ పై శాఖపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.

Also Read: CM Revanth Reddy: కారు గుర్తుకు ఓటేస్తే.. కమలంకు వేసినట్లే.. సీఎం రేవంత్ రెడ్డి

Just In

01

Allu Aravind: నాకో స్థాయి ఉంది.. బండ్ల గణేష్‌కు అల్లు అరవింద్ కౌంటర్!

Generational Divide: ఆట మైదానంలో తండ్రుల ఆటలు.. మొబైల్ ఫోన్లలో కొడుకులు..!

GHMC: బాగు చేస్తే మేలులెన్నో.. అమలుకు నోచుకోని స్టాండింగ్ కమిటీ తీర్మానం

Crime News: గుట్టు చప్పుడు కాకుండా గంజాయి పెడ్లర్లు కొత్త ఎత్తులు.. పట్టుకున్న పోలీసులు

Bhupalpally District: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో క్లౌడ్ బస్టర్.. నేలకొరిగిన పత్తి మిర్చి పంట