Collector Hanumanth Rao: బడిబాట కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో మధ్యాహ్న భోజనాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు. తానొక జిల్లా కలెక్టర్ అనే భావన లేకుండా విద్యార్థులతో కలిసి తానొక విద్యార్థిగా క్యూ లైన్ లో నిల్చొని విద్యార్థిలతో కలిసి భోజనం చేశారు. మధ్యాన్న భోజనం వంట ని పరిశీలించారు. మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం పెడుతున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు.
Also Read: Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. ధరల నియంత్రణపై స్పందించిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు
నీటి సౌకర్యం సరిగా లేక ఇబ్బందులు
విద్యార్థులు కోరిన విధంగా పాఠశాల లో సరిపోను టాయిలెట్ లు లేక మరియు నీటి సౌకర్యం సరిగా లేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు తెలిపడంతో కొత్త టాయిలెట్ లు నిర్మించడంతో పాటు నీటి సరఫరా సౌకర్యం ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. పదవ తరగతి విద్యార్థులకు గణిత బోధన చేశారు. వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే విద్యార్థులు ఎలా సన్నద్ధం కావాలో అర్థం అయ్యేలా వివరించారు. ఇప్పటి నుండి పరీక్షలు రాసే వరకు టీవీలకు, ఫోన్ లకు దూరంగా ఉంటూ వార్షిక పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలని సూచించారు.
200 మందికి సైకిల్స్ బహుమతి
100 పర్సెంట్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు 200 మందికి సైకిల్స్ బహుమతి ఇవ్వడంతో పాటు వారీ తల్లిదండ్రులకు సన్మానించడంతో జరుగుతుందని తెలిపారు.పాఠశాలలో వాచ్మెన్ లేక ఇటీవల అపరిచిత వ్యక్తులు పాఠశాలకి వచ్చి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఉపాధ్యాయులు తెలపడం తో వెంటనే చౌటుప్పల్ ఏసిపి కి ఫోన్ చేసి రోజు స్కూల్ కి పెట్రోలింగ్ పోలీసుని పంపించాలని ఆదేశించారు.
Also Read: Supreme Court: సుప్రీంకోర్టులో రిజర్వేషన్లకు అనుకూలంగా మరో 4 పిటిషన్లు?
