Swetcha Effect (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. ధరల నియంత్రణపై స్పందించిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు

Swetcha Effect: యాదాద్రి భువనగిరి జిల్లాలో నియంత్రణ లేని ధరలపై అక్టోబర్ 31న ఇటుక(Brick) ఇసుకాసురులను ఆపేదెవరు అనే స్వేచ్ఛ కథనానికి జిల్లా కలెక్టర్ హనుమంతరావు(Collector Hanumantha Rao) స్పందించారు. ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందిస్తున్నప్పుడు అధిక ధరలకు ఎందుకు విక్రయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జిల్లాలోని ఎంపీడీవో(MPDO)లు, ఎమ్మార్వో(MRO)లు ఇటుక ఇసుక వ్యాపారులతో సమావేశాలు నిర్వహించి తక్కువ ధరలకు ఇసుక,ఇటుక సప్లై చేయాలని తెలిపారు.

యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశాల మేరకు వలిగొండ మండల పరిషత్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం మెటీరియల్ సప్లై విషయంలో అధిక రేట్లకు కాకుండా పేదవారు నిర్మించుకునే ఇంటి విషయంలో తక్కువ ధరకు మెటీరియల్ సప్లై చేయాలని మండలంలోని వ్యాపారులు, మేస్త్రీలతో సమావేశాన్ని ఎంపీడీవో జి. జలంధర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.

Also Read: Cotton Crop: భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన పత్తి పంట.. ఆందోళనలో అన్నదాతలు

అధికారులతో సమావేశం..

ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న ఇసుక రవాణా కూడా తక్కువ ధరకు సరఫరా చేయాలని, ఇందిరమ్మ ఇంటి నిర్మాణ త్వరగా పూర్తి అయ్యేలా సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో తహసిల్దార్ దశరథ(MRO Dasharatha), ఏఈ. కిరణ్(AE Kiran),హెడ్ కానిస్టేబుల్ పురుషోత్తం(Purushotham), ట్రేడర్స్ యజమానులు ఇటుక బట్టి యజమానులు, మేస్త్రీ లు పాల్గొన్నారు.  అక్రమ ఇసుక రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోయింది అంటూ అడ్డుకునే అధికారులు నిమ్మకు నీరు ఎత్తనట్లు వ్యవహరించడం మూలంగా అక్రమార్కులకు కాసుల పంట పండుతుందని గతంలో స్వేచ్చ కథనం ప్రచురించింది.

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇసుక అక్రమ దందా మూడు పూవులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది. ఒకప్పుడు ఒక పర్మిషన్ పదుల సంఖ్యలో దండుకునేవారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంతో అక్రమ ఇసుక దందా చేసే వ్యాపారం లక్షలు దండుకుంటున్నారు. అక్రమ ఇసుక దందాతో అడ్డగోలుగా లక్షల్లో దండుకుంటున్న సంబంధిత అధికారులు మాత్రం మొద్దు నిద్ర నటించడం పట్ల మండలంలోని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు.

Also Read: Mohammad Azharuddin: నేనేంటో ప్రజలకు తెలుసు.. ఎవరి సర్టిఫికేట్ అక్కర్లేదు.. అజారుద్దీన్ స్ట్రాంగ్ కౌంటర్

Just In

01

KTR: కాంగ్రెస్ తోక క‌త్తిరించేందుకు ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నారు.. కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు

Talasani Srinivas Yadav: సంక్షేమ పధకాలు ఆగితే పోరాటం చేస్తాం.. మాజీ మంత్రులు తలసాని కీలక వ్యాఖ్యలు

Srinivas Goud: ఉద్యోగులకు 44 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్

Hydra: మ‌ణికొండ మున్సిపాలిటీలో హైడ్రా యాక్షన్.. 300ల కోట్ల విలువైన భూమి సేవ్

Ramchander Rao: కాంగ్రెస్ పాలన వైఫల్యాలు మోసాలపై బీజేపీ చార్జ్ షీట్ రిలీజ్ : రాంచందర్​ రావు