Mohammad Azharuddin: తెలంగాణ కేబినేట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మహమ్మద్ అజారుద్దీన్ తొలిసారి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తనపై వస్తోన్న విమర్శలపై ఘాటుగా స్పందించారు. తానేంటో దేశ ప్రజలకు తెలుసున్న ఈ మాజీ క్రికెటర్.. తనకు ఎవరి సర్టిఫికేట్ అవసరం లేదని తేల్చి చెప్పారు. ఏ శాఖ చేపడతారన్న ప్రశ్నపై స్పందిస్తూ దానిపై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు.
‘మంత్రిగా నిబద్దతో పనిచేస్తా’
తనకు ఏ మంత్రిత్వ శాఖ ఇచ్చినప్పటికీ చాలా నిబద్దతతో పనిచేస్తానని మంత్రి అజారుద్దీన్ స్పష్టం చేశారు. తనకు మంత్రిగా అవకాశం కల్పించిన కాంగ్రెస్ హైకమాండ్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పారు. అయితే జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సమీపిస్తున్న సమయంలో అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీనిని అడ్డుకోవాలంటూ ఏకంగా ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో అజారుద్దీన్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.
నాకు ఏ శాఖ ఇవ్వాలనేది సీఎం రేవంత్ నిర్ణయిస్తారు: అజహరుద్దీన్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు, నా మంత్రి పదవికి సంబంధం లేదు
ఏ శాఖ అప్పగించినా నిబద్ధతతో పని చేస్తా
నన్ను కేబినెట్లోకి తీసుకోవడం హైకమాండ్, సీఎం నిర్ణయం
నాపై ఎప్పటినుంచో ఆరోపణలు చేస్తున్నారు
నేనెంటో దేశ ప్రజలకు… https://t.co/hwcLanAg1U pic.twitter.com/vTk7hx0gbS
— BIG TV Breaking News (@bigtvtelugu) October 31, 2025
Also Read: Mohammad Azharuddin: కేబినేట్‌లోకి అజారుద్దీన్.. గవర్నర్, సీఎం సమక్షంలో.. మంత్రిగా ప్రమాణ స్వీకారం
బీజేపీ భయం ఏంటంటే?
అజారుద్దీన్ మంత్రి పదవిని వ్యతిరేకించడం వెనుక బీజేపీకి ఓ భయం ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ మైనారిటీ ఓట్లను కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ ఈ కుట్ర తెరలేపిందని బీజేపీ ఆరోపణలు చేస్తోంది. ఎన్నికల సమయంలో అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చి.. మెజారిటీ ముస్లిం ఓట్లను సొంతం చేసుకోవాలని కాంగ్రెస్ ప్లాన్ వేసిందని మండిపడుతోంది. పైగా అజారుద్దీన్ జూబ్లీహిల్స్ మాజీ అభ్యర్థి కావడం.. ఆయనకు నియోజకవర్గ ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు ఉండటం ఎన్నికల తీర్పును ప్రభావితం చేస్తుందని బీజేపీ భయాందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలోనే అజారుద్దీన్ ను టార్గెట్ చేస్తూ ఆ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు.
మరి రాజస్థాన్ సంగతేంటి?
రాజస్థాన్ లో ప్రస్తుతం భజన్ లాల్ శర్మ (Bhajan Lal Sharma) నేతృత్వంలోని బీజేపీ పార్టీనే అధికారంలో ఉంది. అయితే 2024లో అక్కడ ఉపఎన్నికలు జరిగాయి. గంగాపూర్ జిల్లా కరణ్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కుర్మీత్ సింగ్ కూనర్ అకస్మిక మరణంతో గతేడాది జనవరి 5న ఉపఎన్నిక జరిగింది. ఆ ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సురేంద్ర పాల్ సింగ్ కు సరిగ్గా ఆరు రోజుల ముందు మంత్రి పదవి కట్టపెట్టింది. డిసెంబర్ 30, 2023లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించింది. అలాంటి బీజేపీ.. ఇప్పుడు తెలంగాణ జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు వచ్చేసరికి అజారుద్దీన్ కు పదవి ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బీజేపీ అనుసరిస్తున్న ఈ ద్వంద్వ వైఖరి చాలా హాస్యస్పదంగా ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నారు.

 Epaper
 Epaper  
			 
					 
					 
					 
					 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				