Mohammad Azharuddin: తెలంగాణ కేబినేట్ మంత్రిగా మహమ్మద్ అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Varma), సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), రాష్ట్ర మంత్రుల సమక్షంలో అజారుద్దీన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆజారుద్దీన్ చేత గవర్నర్ ప్రమాణ స్వీకార పత్రాన్ని చదివించారు. దీంతో అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చుట్టూ జరిగిన రాజకీయ వివాదానికి ముంగింపు పడినట్లైంది. అయితే అజారుద్దీన్ కు ఏ శాఖ ఇస్తారన్న దానిపై క్లారిటీ రాలేదు. కానీ మైనారిటీ సంక్షేమశాఖ ఇవ్వొచ్చన వాదన బలంగా వినిపిస్తోంది.
ఇంకా ఇద్దరికీ ఛాన్స్..
అజారుద్దీన్ ప్రమాణ స్వీకారంలో తెలంగాణ మంత్రుల సంఖ్య (సీఎం రేవంత్ రెడ్డితో కలిపి) 16కు చేరింది. రాష్ట్రంలోని అసెంబ్లీ స్థానాల సంఖ్య పరంగా చూస్తే మరో ఇద్దరు సభ్యులను కూడా మంత్రులుగా తీసుకునే అవకాశం ఉంది. ఇక అజారుద్దీన్ విషయానికి వస్తే.. ఆయన జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగాలని భావించారు. కానీ కాంగ్రెస్ యువ నాయకుడైన నవీన్ యాదవ్ (Naveen Yadav)కు అవకాశం కల్పించింది. అయితే ఆగస్టులో గవర్నర్ కోటా కింద అజారుద్దీన్ ను ఎమ్మెల్సీగా కాంగ్రెస్ నామినేట్ చేసినప్పటికీ.. అతడి నియామకం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వద్ద ఇంకా పెండింగ్ లోనే ఉంది.
రాజ్ భవన్ లో మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణస్వీకారం
అజారుద్దీన్ తో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
అజారుద్దీన్ కి శుభాకాంక్షలు తెలియచేసిన సీఎం రేవంత్ రెడ్డి
పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎస్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు pic.twitter.com/9IACPTKIbk
— BIG TV Breaking News (@bigtvtelugu) October 31, 2025
కాంగ్రెస్‌లో అజారుద్దీన్ ప్రస్థానం
టీమిండియా కెప్టెన్ గా గతంలో సేవలందించిన అజారుద్దీన్ 2009లో పొలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. 2009 ఫిబ్రవరి 19న జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో యూపీలోని మెురాదాబాద్ నుండి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 2014లో రాజస్థాన్ లోని టోంక్ – సవాయి మాధోపూర్ (Tonk-Sawai Madhopur) స్థానం పోటీ చేసి బీజేపీ అభ్యర్థి సుఖ్ బీర్ సింగ్ జౌనాపురియా చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ప్రెసిడెంట్ గాను సేవలు అందించారు. 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బీఆర్ఎస్ నేత మాగంటి గోపినాథ్ చేతిలో ఓటమి పాలయ్యారు. మాగంటి మరణంతో కాంగ్రెస్ తరపున తిరిగి ఉపఎన్నికల్లో పోటీ చేయాలని అజారుద్దీన్ భావించినప్పటికీ.. అది జరగలేదు.
వ్యక్తిగత జీవితం..
అజారుద్దీన్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆయన 1987లో నౌరీన్ ను వివాహం చేసుకున్నారు. వారికి మహమ్మద్ అసదుద్దీన్, మహమ్మద్ అయాజుద్దీన్ అనే ఇద్దరు కుమారులు జన్మించారు. అయితే 1996లో నౌరీన్ కు విడాకులు ఇచ్చిన అజారుద్దీన్.. ఆ తర్వాత నటి సంగీత బిజ్లానీని రెండో వివాహం చేసుకున్నారు. అయితే 2010లో సంగీత కూడా విడాకుల కోసం కోర్టుకు వెళ్లడం గమనార్హం. మరోవైపు 2011లో బైక్ ప్రమాదంలో అజారుద్దీన్ చిన్న కుమారుడు అయాజుద్దీన్ ప్రాణాలు కోల్పోయాడు. పెద్ద కుమారుడు అసదుద్దీన్.. ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి సానియా మిర్జా సోదరిని ఆనం మిర్జాను 2019లో వివాహం చేసుకున్నాడు.

 Epaper
 Epaper  
			 
					 
					 
					 
					 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				