Supreme Court (imagecredit:twitter)
Politics, తెలంగాణ

Supreme Court: సుప్రీంకోర్టులో రిజర్వేషన్లకు అనుకూలంగా మరో 4 పిటిషన్లు?

Supreme Court: రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో వేసిన కేసును సోమవారం కొట్టేసింది. రాష్ట్ర హైకోర్టులోనే కేసు విచారణ జరుగుతుండగా సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారని పిటిషనర్ ను మందలించింది. దీంతో రిజర్వేషన్లపై కొంత ఊరట లభించింది. ప్రభుత్వానికి, బీసీలకు సైతం ఆశలు చిగురించాయి. రిజర్వేషన్లు అమలు అవుతాయనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నెల 8న హైకోర్టులో విచారణ జరుగుతుంది. చట్టవిరుద్ధంగా ఎలా రిజర్వేషన్లు పెంచుతారు? 50శాతంపై బడి ఎలా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తారు? ప్రత్యేకంగా జీవో 9ను ఎలా తీసుకొచ్చి అమలు చేస్తారని హైకోర్టులో మాధవరెడ్డి(Madhava Reddy) పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఆయన పిటిషన్ ఈ నెల 8న (బుధవారం) విచారణకు రాబోతుంది. జస్టిస్ అభినందన్ కుమార్ శావిలి, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది. అయితే విచారణలో ఏం తీర్పు వస్తుందనేది ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ అయింది.

జీవోను సమర్ధిస్తుందా?

ప్రభుత్వం రిజర్వేషన్లపై ఇచ్చిన బిల్లు ఇటు గవర్నర్, అటు రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉంది. అసెంబ్లీలో తీర్మాణం చేసి పంపినప్పటికీ ఇంకా ఆమోదముద్రపడలేదు. ఈ తరుణంలోనే ప్రభుత్వం జీవో 9ని తీసుకొచ్చి స్థానిక ఎన్నికలకు సిద్ధమైన తరుణంలో మాధవరెడ్డి కోర్టులో కేసు వేయడంతో విచారణ జరుగబోతుంది. అయితే హైకోర్టు రిజర్వేషన్లపై ఎలాంటి తీర్పు వెలువరిస్తుంది.. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను సమర్ధిస్తుందా? లేకుంటే జీవో చెల్లదని చెబుతుందా? గవర్నర్, రాష్ట్ర పతివద్ద రిజర్వేషన్లు బిల్లు పెండింగ్ లో ఉండగా జీవో ఎందుకు తెచ్చారని ప్రశ్నిస్తుందా? లేకుంటే స్థానిక ఎన్నికలు జరుగకపోవడంతో గ్రామాల్లో మౌలిక సమస్యలు తిష్ట వేయడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కోర్టు ప్రభుత్వం తీజుకొచ్చిన జీవో సరైందే అని చెబుతుందా? అసలు ఏం తీర్పు వస్తుందనేది ఉత్కంఠ నెలకొంది. పోటీ చేసేందుకు సిద్ధమైన బీసీ నేతలు ఈ కోర్టు కేసులతో ఆందోళనకు గురవుతున్నారు. రిజర్వేషన్లు అడ్డుకోవద్దని,కోర్టుల్లో వేసిన పిటిషన్లను సైతంవిత్ డ్రా చేసుకోవాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. మరోవైపు కోర్టుల్లో తీర్పు రిజర్వేషన్లపై అనుకూలంగా వస్తుందా? రాకుంటే తమపరిస్థితి ఏంటనేది మల్లగుల్లాలు

రిజర్వేషన్లపై కోర్టు తీర్పు..

హైకోర్టు తీర్పును బట్టి ఎన్నిలకు ముందుకెళ్లాలని భావిస్తుంది. ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ ఎన్నికల నిర్వహణ కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులకు శిక్షణ ఇచ్చింది. బ్యాలెట్ బాక్సులు, ఇంక్ , బ్యాలెట్ పత్రాలు, పోలింగ్ కేంద్రాలను సైతం సిద్ధం చేసింది. అయితే రిజర్వేషన్లపై కోర్టు తీర్పును బట్టి, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుకూలంగా ఎన్నికలకు వెళ్తామని అధికారులు తెలిపారు. గత స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు అమలు చేయాలని కోర్టు ఆదేశిస్తే మళ్లీ గ్రామాల వారీగా రిజర్వేషన్లు మారే అవకాశం ఉందని సమాచారం. వార్డు నుంచి సర్పంచ్, ఎంపీటీసీ(MPTC), జడ్పీటీసీ(ZPTC), ఎంపీపీ(MPP), జడ్పీ(ZP) స్థానాల రిజర్వేషన్లు సైతం మారే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే తీర్పుతో ముందుకెళ్లాలని భావిస్తున్నది.

Also Read: Vegetable List: ఏంటి ఇది కూరగాయల చిట్టినా? భార్య రాసిన లిస్ట్ చూసి షాకైన భర్త..

అడ్డుకునేందుకు ప్రయత్నాలు..

రిజర్వేషన్లపై వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో కాంగ్రెస్ హర్షం వ్యక్తం చేస్తుంది. మంత్రులు సైతం బీసీ(BC) సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతుందని, వారికి రాజకీయ అవకాశాలు ఇచ్చేందుకే ప్రభుత్వం అసెంబ్లీలో 42శాతం రిజర్వేషన్లపై తీర్మాణం చేసిందని తెలిపారు. బిల్లులు పెండింగ్ లో ఉండటంతోనే జీవో 9ను తీసుకొచ్చి ఎన్నికలకు వెళ్తుందని దానిని అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడుతున్నారు. మంత్రి పొన్నం ప్రభాక(Min Ponnam Prbhakar)ర్ ఢిల్లీలో మీడియాతో సోమవారం మాట్లాడారు. బీసీ(BC) రిజర్వేషన్లపై ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉందని, ఈ అంశంలో అసెంబ్లీలో చట్టబద్దంగా ఆమోదించుకొని ముందుకు వెళ్తున్నామని తెలిపారు. బీజే(BJP)పీ అన్ని రకాల రిజర్వేషన్లకు వ్యతిరేకం అని, బీసీ రిజర్వేషన్లపై చట్టసవరణ బిల్లు, ఆర్డినెన్స్ ను అడ్డుకుంటుందని మండిపడ్డారు. రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ఆపార్టీ నేతలు ఆమోదించి ఇప్పుడు మాట మారుస్తున్నారని మండిపడ్డారు. ఆపార్టీకి చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఆమోదించాలని డిమాండ్ చేశారు. బీజేపీ(BJP) ప్యూడలిస్టు పార్టీ అని, ఎస్సీ(SC), ఎస్టీ(ST), బీసీ(BC) రిజర్వేషన్లకు వ్యతిరేకం అని మండిపడ్డారు.

ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం..

హైకోర్టు ఈ నెల 8న రిజర్వేషన్లపై సానుకూలంగా స్పందిస్తుందని, అనుకూలంగా తీర్పు వస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తుంది. బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం రిజర్వేషన్లు అమలుకు ముందుకెళ్తున్నామని ఇదే విషయాన్ని ప్రభుత్వం తరుపు న్యాయవాదులు కోర్టుకు వివరించనున్నారని, అందుకు ఇప్పటికే సీనియర్ అడ్వకేట్లతో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భేటీ అయి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం తరుపున బలంగా వాదించనున్నారు. ఇది ఇలా ఉంటే బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా హై కోర్టు లో మరో 4 పిటిషన్ లు దాఖలు అయ్యాయి. మాజీ ఎంపీ వీ.హనుమంతరావు(V Hanumanth rao), బీసీ నాయకులు మెట్టు సాయి కుమార్(Mettu sai Kumar), లక్ష్మణ్ యాదవ్, మాజీ ఐఏఎస్ చిరంజీవులు పిటిషన్ వేశారు. అయితే ఈ నెల 8 మంది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాధవరెడ్డి వేసిన పిటిషన్ తో పాటు అనుకూలంగా వేసిన ఈ నాలుగు పిటిషన్ లను కలిపి హైకోర్టు విచారణ చేయనుంది. అన్ని పిటిషన్లు విచారణ చేసిన తర్వాత కోర్టు ఏం తీర్పు వెలువరిస్తుందోననే ఉత్కంఠ నెలకొంది.

Also Read: Adwait Kumar Singh: విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ పై అవగాహన కల్పించాలి : కలెక్టర్ అద్వైత్ కుమార్

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!