Warangal District: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. శనివారం తెల్లవారు జామున ఎల్కతుర్తి- సిద్దిపేట జాతీయ రహదారి వెంబడి పంట పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తులు సుమారు రెండు వేల నాటు కోళ్లను వదిలేశారు. విషయం తెలిసిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని పొలాలు, పత్తి చేనుల్లో వదిలిన నాటుకోళ్లను పట్టుకోవడం కోసం ఎగబడ్డారు. వెంటబడి దొరికిన కాడికి దొరకబట్టుకుని వెళ్ళి చికెన్(Chiken) విందు చేసుకుంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున నాటు కోళ్లను ఎవరు, ఎందుకు వదిలిపెట్టారో తెలియాల్సి ఉంది. ఏదేమైనా స్థానికులకు మాత్రం ఈ రోజు పెద్ద పండుగే అయింది. స్థానికులు కోళ్ల కోసం ఎగబడడంతో మా పంట పొలాలు పాడై పోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విచారణ చేపట్టిన పోలీసులు
కోళ్ళు వదిలి వెళ్ళింది ఎవరు అనే విషయంపై పోలీసులు(Police) విచారణ చేపట్టారు. ప్రమాదవశాత్తు పడిపోయాయా..? ఎవరైన తీసుకువచ్చి వదిలేశారా..? అనే కోణంలో సీసీ(CC) పుజేజ్ ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.
Also Read: Singareni Collieries: పనితీరులో అలసత్వం వద్దు.. టార్గెట్ కంప్లీట్ చేయాల్సిందే..!
కోళ్ల ఆరోగ్య పరిస్థితిపై విచారణ
కోళ్లు వదిలిపోయిన ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కోళ్ల(Hen) ఆరోగ్య పరిస్థితి(Health condition)పై పలు విధాల చర్చ సాగుతుంది. కోళ్లకు ఏమైనా వైరస్(Virus) ఉందా లేకుంటే రోగం ఉందా అనే అనుమానంతో కొన్ని కోళ్ల నుంచి నమూనాలు సేకరించి పరీక్షల కోసం పంపించినట్లు పశు వైద్య అధికారులు తెలిపారు. పరీక్షల ఫలితాలు వచ్చే వరకు ఆ కోళ్ళు తినవద్దని అధికారులు పేర్కొన్నారు.
Also Read: Delhi Airport: 300 విమానాలు ఆలస్యం.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్యాసింజర్ల గందరగోళం
