Rabi Season (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Rabi Season: రబీ సాగుకు రైతులు సమాయత్తం.. జోరుగా మొదలైన రబీ సాగు పనులు

Rabi Season: వానకాలం పంటల సాగు తుది దశకు రావడంతో అన్నదాతలు యాసంగి పంట సాగుకు సన్నద్ధమవుతున్నారు. వ్యవసాయ అధికారులు సైతం సాగు విస్తీర్ణాన్ని అంచనా వేసి సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నారు. ప్రస్తుత వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు పడడంతో సాగునీటి నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో రైతులు జూరాల, నెట్టెంపాడు ఆయకట్టు కింద వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే గద్వాల నియోజకవర్గంలోని 5 మండలాలలో రైతుల వరి నారుమళ్లను సిద్ధం చేసుకుంటున్నారు. అదేవిధంగా సాగునీటి వనరులు లేని మండలాలలో బోర్ల కింద మొక్కజొన్న, పొగాకు, ఆరుతడి పంటలైన మినుములు, పెసలు, అలసిందా వంటి పంటల సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఖరీఫ్ లో అధిక వర్షాలతో తీవ్రంగా దెబ్బతిన్న రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. యాసంగిలోనైనా దిగుబడులు వస్తాయనే ఆశతో రైతులు వివిధ పంటల సాగుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో జిల్లాలో 1.95 లక్షల ఎకరాలలో వివిధ పంటలు సాగు అయ్యే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు.

సాగునీరు పుష్కలం

ఈ దఫా వర్షాలు సమృద్ధిగా కురవడంతో జూరాల ప్రాజెక్టుతో పాటు రిజర్వాయర్లలో నీటి నిలువలు పుష్కలంగా ఉన్నాయి. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా అధిక వర్షపాతం నమోదు వల్ల భూగర్భ జలాలు సైతం పెరిగాయి. వాన కాలం కంటే యాసంగిలో దిగుబడులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందనే భావనతో రైతులు బోరుబావుల కింద నారమల్లు సైతం తయారు చేసుకుంటున్నారు. డిసెంబర్ లోపు వరి నాట్లు పూర్తి చేసుకుంటే మార్చి వరకు పంటలకు చేతికి వచ్చే అవకాశం ఉంటుందని రైతులు ఆశాభావం చేస్తున్నారు ఏప్రిల్, మే నెలలో వడగండ్ల కురిసే అవకాశాలు ఉంటాయననే ఉద్దేశంతో రైతులు ముందస్తుగా సాగుకు సన్నద్ధమవుతున్నారు. వరి 85,529 వేల ఎకరాలలో మొక్కజొన్న 53,452, పప్పు శనగ 12 వేల ఎకరాలు, జొన్న 13 వేల ఎకరాలు, అదేవిధంగా మినుములు పెసల్లు, పొగాకు, బొబ్బర్లు ఇతర పంటలను సాగు చేసే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు.

Also Read: Terrorist Arrest: దేశంలో దాడులు చేసేందుకు టెర్రరిస్టుల ప్లాన్.. అరెస్ట్ చేసిన పోలీసులు

తుంగభద్ర కింద క్రాప్ హాలిడే

అలంపూర్ నియోజకవర్గంలో ప్రధాన సాగునీటి వనరైన తుంగభద్ర డ్యాం గేట్ల మరమ్మతుల కారణంగా ప్రస్తుత రబీకి నీరు అందే అవకాశం లేదు. దీంతో క్రాప్ హాలిడే ప్రకటించే అవకాశం ఉంది. తుంగభద్ర డ్యాం 33 గేట్లు మరమ్మతులకు ఇప్పటికే నీటి పారుదల శాఖ అధికారులు నిర్ణయం తీసుకోవడంతో డిసెంబర్ 20 వరకు మాత్రమే నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో అలంపూర్ తాలూకాలో 87 వేల ఎకరాలలో వివిధ పంటలు సాగయ్యే అవకాశం ఉండేది. దీంతో వరికి బదులుగా స్వల్పకాలిక పంటలైన అంతర పంటల సాగుకు కొందరు రైతులు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యవసాయ అధికారులు క్లస్టర్ల వారీగా రబీలో సాగునీటి వనరుల కొరత దృష్ట్యా ఆరుతడి పంటల సాగుకు మొగ్గు చూపాలని రైతులను సూచించే అవకాశం ఉంది.

Also Read: Faria Abdullah: అందాలను ఆరబోసినా.. ఈ పొడుగు కాళ్ల సుందరిని ఎవరూ పట్టించుకోవడం లేదా?

Just In

01

Islamabad Blast: ఇస్లామాబాద్ కోర్టు ప్రాంగణంలో భారీ పేలుడు.. 5 మంది మృతి, 20 మందికి గాయాలు

Prabhas: ప్రభాస్‌కు ఎందుకు అంత క్రేజ్.. పాన్ ఇండియా స్టార్‌ అవ్వడానికి రీజన్ ఇదే..

VC Sajjanar: మహిళలు పిల్లల భద్రతలో రాజీ పడేదే లేదు.. హైదరాబాద్​ కమిషనర్ వీ.సీ.సజ్జనార్ స్పష్టం!

Jatadhara: బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసిన ‘జటాధర’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

CM On Andesri: అందెశ్రీ పేరుతో స్మృతి వనం.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం.. సీఎం రేవంత్